Wednesday, February 12, 2020

నేనెవరిని అని తెలుసుకోవాలని రాముడికి సందేహం కల్గింది

⚔🤺నేను నేను నేను నేను నేను నేను నేను నేను🤺⚔

శ్రీరామ చంద్రుడికి హఠాత్తుగా మనసులో ఒక సందేహం పుట్టుకొచ్చింది. సరాసరి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లి తలుపు తట్టాడు. ఇంత రాత్రి వేళ వచ్చిందెవరని ఆశ్చర్యపడ్డాడు వశిష్ఠుడు.
‘‘ఎవరూ?’’ అని గట్టిగా అన్నాడు...

‘‘నేనే’’ అన్నాడు రాముడు!

‘‘నేనంటే ఎవరు?’’ అని తిరిగి ప్రశ్నించాడు.

‘అది తెలుసుకోవాలనే ఇలా వేళకాని వేళ తలుపు తట్టాను గురుదేవా’ అని గాఢంగా నిట్టూర్చాడు స్వామి.
🌷🌷🌷🌷🌷
‘నేనెవరిని" అనేది యుగయుగాలుగా మనిషిని వేధిస్తున్న ప్రశ్న. వెంటాడుతున్న సందేహం!

🧘🏻‍♀ఇది వేదాంతాన్ని గురించి చర్చ కాదు... వివేకాన్ని గురించిన మథనం...

ఆధ్యాత్మిక లోకాల్లోనే కాదు, రోజువారీ జీవితాల్లో కూడా అహంకారం ఉండకూడదని విజ్ఞులు చెబుతారు. నేను" ని సంస్కృతంలో అహం అంటారు.

అహం అంటే తాననే భావన మాత్రమే కాదు, తనలో ఉన్న కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అవలక్షణాలు కూడా.

ఆధునిక జీవన సరళిలో అగచాట్లకు గురి చేస్తున్నది, జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది ఇవే.

అహాన్ని, దానికి అంటిపెట్టుకుని ఉన్న ఈ చెడ్డలక్షణాలను కూడా వదులుకోగలిగితే జీవితం ఆనందమయం అవుతుంది. లోకంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.

మాటిమాటికీ మనిషి నోట ‘నేను’ అనే మాట వస్తూనే ఉంది. కానీ ఈ ‘నేను’ ఎవరనేది చిక్కు ప్రశ్నగా, చిదంబర రహస్యంగా మిగిలిపోతూనే ఉంది.

సత్యభామ కాలు కృష్ణుడి తలకు తగిలింది.
‘‘నన్ను’’ తంతే తన్నావు. నీ కాలు తగలడం నాకు గౌరవమే’ అన్నాడా భార్యా విధేయుడు. తలనే కాదు, శరీరంలో ఎక్కడ తన్నినా "నన్ను" తన్నాడనే అంటారు.
అలా అని
శరీరమే ‘నేను’ కాదు. కన్ను నాది, కాలు నాది అంటున్నాం.
కానీ కన్నూ, కాలూ నేను కాదు.

ఎందుకంటే కన్నూ కాలు లేకున్నా ‘నేను’ ఉన్నాను.
నాలుక మిఠాయిని రుచి చూసింది. చెవి చక్కని సంగీతాన్ని ఆలకించింది. ముక్కు సువాసన పసిగట్టింది.

‘నేను’ తిన్నాను, నేను విన్నాను, నేను వాసన చూశాను అనేస్తాం. కానీ ఇవేవీ ‘నేను’ కాదు.

ఎవరైనా తిట్టిపోస్తే మనసు 😡గాయపడుతుంది. కాస్త పొగిడితే చాలు, మనసు😄 సంతోష పడుతుంది. కానీ మనసు 😇అదెక్కడుందో అంతు చిక్కదు.

అంటే పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు... వీటిలో ఏ ఒక్కటీ నేను కాదు.సత్యం ఏంటంటే నేనుకు అంటిపెట్టుకుని ఇవన్నీ ఉన్నాయి.

ఇదివరకొక రాజు జ్ఞానోపదేశం పొందాలనుకున్నాడు. ప్రసిద్ధుడైన ఒక ఆధ్యాత్మిక గురువు ఇంటికి వెళ్లాడు. అక్కడున్న శిష్యుడిని పిలిచాడు.
‘నేనొచ్చానని మీ గురువుగారికి చెప్పు’ అన్నాడు.

లోపలికి వెళ్లిన శిష్యుడు చెప్పిన మాట విని గురువు ఇలా బదులిచ్చాడు ‘నేను’ పోయాక రమ్మను... ఉపదేశిస్తాను’.

ఆ మాట రాజును అయోమయంలో పడేసింది. ‘పోయినాయన చెప్పేదేముంది?’ అని తెల్లబోయాడు. మారు మాట లేకుండా ఇంటికి తిరిగెళ్లిపోయాడు.

కానీ గురువు మాట మాత్రం రాజు మనసును గట్టిగా పట్టుకుంది. ఎన్నాళ్లో మథనపడగా అకస్మాత్తుగా రాజుకు సత్యం స్ఫురించింది. క్షణంలో ముడివిడిపోయింది.

గురువు చెప్పింది
ఆయన పోయాక రమ్మని కాదు... ‘నేను’ వచ్చానని కదా రాజు చెప్పాడు. ఆ నేను పోయాక వస్తే తనకు ఉపదేశిస్తానని అన్నాడు. ఇంతే విషయం!. ఎప్పుడైతే ఈ ఎరుక కలిగిందో రాజుకు ఆనందం ఉబికివచ్చింది.

మూసి ఉంచిన గదిలో చీకటిని తరిమేయడానికి దీపానికి క్షణం చాలు. ఏళ్లు పట్టదు. తనలోని గుజ్జు, పోగులు
సమస్తం కాలి పోయాక వెదురు వేణువుగా మారుతుంది.

రాజు విషయంలో జరిగిందదే.
‘నేను’ అని తాను భావిస్తున్నది తొలగిపోయే సరికి కథ సుఖాంతమైంది.

స్త్రీ లోలత్వం, పానం, జూదం, దుబారా ఖర్చు, వేటపై ప్రీతి, దండ పారుష్యం (దండించడంలో పైశాచికత్వం), వాక్పారుష్యం (మాటలో సౌమ్యత లేకపోకపోవడం) ...

ఈ ఏడింటినీ
సప్త వ్యసనాలు అంటారు. వీటిలో
మొదటి ఐదూ కామజాలు. అంటే కోరికల్లోనుంచి పుడతాయి.

తక్కిన
రెండూ క్రోధజాలు. కోపంలో నుంచి వస్తాయి.

అంటే
అరిషడ్వర్గాలలోని తొలి రెండిటి నుంచే ఏడు వ్యసనాలు పుట్టుకొస్తున్నాయి. మిగిలిన వాటి నుంచయితే లెక్కే లేదు.

ధర్మరాజు జూద వ్యసనం,దుర్యోధనుడి దురభిమానం, ధృతరాష్టుడి మితిమీరిన పుత్ర వ్యామోహం, దక్ష ప్రజాపతి దురహంకారం, రావణుడి కాముకత, కీచకుడి మూర్ఖత్వం, విశ్వామిత్రుడి ద్వేషం, అశ్వత్థామ పగ, కుమార్తె దేవయానిపై శుక్రాచార్యుడి అలవిమాలిన మమకారం ...

ఇలా మనిషి పతనానికి సమాజానికి చేటు కలిగించడానికి కారణమవుతున్న
ఎన్నో స్వభావాలు కలగలిస్తే
నేను_ అవుతోంది.

ఏది మితిమీరినా మనిషి చెడిపోతాడు, సంఘమూ చెడిపోతుంది.

ఇప్పుడు ఆనందం కావాలంటే ఏం చేయాలి?
‘నేను’ లోంచి అరిషడ్వర్గాలను, సప్త వ్యసనాలను, వల్లమాలిన అహంకార మమకారాలను తొలగించాలి.

అప్పుడు మిగిలే ‘నేను’ స్వయంగా ఆనంద స్వరూపుడవుతాడు.

పై చెప్పిన వన్నీ సుఖాన్నో, సంతోషాన్నో అందించగలవుగానీ శాశ్వతమైన అవసరమైన ఆనందాన్ని మాత్రం అందించలేవు.

వీటిలో ఒక్కోదాన్ని విశ్లేషించుకుంటూ, ఒక్కోదాన్నుంచి ‘నేను’ ను విడిపించుకుంటూ మనిషి ఆనంద స్వరూపుడు కావాల్సిన అవసరం ఎంతో ఉంది

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment