ఫ్రెండ్స్ మన సంతోషానికి అయినా
మన దుఃఖానికి అయినా
మన అభివృద్ధికి అయినా
మన పతనానికి అయినా మనమే కారణం
వేరొకరు కాదు కాలేరు.
మనసాక్షి తో ఆలోచించండి తెలుస్తుంది
మన ఆలోచనలు మన అవగాహనే పూర్తిగా కారణం
ఒక వ్యక్తి అభివృద్ధిని ఆటంకపరిచే 9 విఘ్నాలు...
1.అలసత్వం-
సోమరితనం..."వర్తమానంలో అవసరమైన ఉపయోగపడే పని విషయంలో ఏకాగ్రత లోపించడం"...
బద్ధకం...."శరీరాన్ని సుఖపెట్టాలనే కాంక్ష " ....
2.దీనత్వం -(ఆత్మ న్యూనత భావం)
3.కృపనత్వం -(బేలతనం ,భయం )
ప్రతిదానికి బేలతనం, భయపడటం
వాళ్లు ఏమనుకుంటారో
వీళ్ళు ఏమనుకుంటారో అని
4.నిద్ర -(అవసరాన్ని మించి రోజుకు 6 నుండి 7 గంటలకన్న ఎక్కువగా నిద్రించడము, నిద్రమబ్బు, కునికిపాట్లు )
5.క్లీబ -(వెనుదీయడం )
ప్రతి దానికి వెనకడుగు వేస్తారు
6.ప్రమీళిక -(సంకోచించదం,సంశయం,అనుమానాలు )
7.ఉద్వేగం -(అవసరాన్ని మించిన ఆవేశం ,టెన్షన్ )
8.అనారోగ్యం-(ఆహార ,వ్యవహారాల్లో క్రమశిక్షణ లోపించడం వల్ల రోగాల బారిన పడడం )
9.జడత్వం- శరీరాన్ని..మనస్సును..బుద్ధిని చురుగ్గా ఉంచుకోకపోవడం(శరీరాన్నీ, మనస్సునూ ఎక్టివ్ గా ఉంచుకోకపోవడం,తగినంత వ్యాయామం లేకపోవడం, నెగటివ్ థింకింగ్..ఆలోచనలు స్తంభించిపోవడం )
ఫ్రెండ్స్ ఆ పరమాత్మ కి మీ అంతరాత్మకు భయపడండి వారు చెప్పిన మార్గం అనుసరించండి మీ అభివృద్ధికి మీరే బాట వేసుకోండి
అప్పుడు ప్రతిక్షణం ఆనందంగా ఉంటారు.
పరమాత్మ ఎప్పుడూ తోడుగా ఉంటాడు
అంతరాత్మ మిమ్మలను మంచి మార్గంలో పెడుతుంది. 🙏
శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి
No comments:
Post a Comment