Monday, March 2, 2020

ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరికి ఎరుక -ఆ పరమాత్మకే ఎరుక

ఓం నమశ్శివాయ🙏
ఫ్రెండ్స్ మనకి కష్టం వస్తే
కష్టాలు మంచి వాళ్లకే వస్తాయి అంటాం తప్ప
మనం ఏమైనా తప్పు చేసామా
ఆ తప్పు యొక్క ఫలితం
మనం పడుతున్న కష్టాన్ని కారణం అనుకోము
కానీ అదే కష్టాలు ఎదుటి వారికి వస్తే మట్టికి
చేసిన పాపాలు ఉరికెనే పోతాయా అని
పాపం వారి నిందిస్తాం పాపం కదా అలా అనటం
ప్రతి మనిషి తప్పు చేస్తాడు
తన తప్పు తాను తెలుసుకొని
ఎదుటి వారి కష్టాన్ని సానుభూతితో
అర్థం చేసుకున్న వారే గొప్పవారు
ఫ్రెండ్స్ తప్పు అనేది మన జీవిత పుస్తకంలో
ఒక పేజీ లాంటిది బంధాలు మొత్తం పుస్తకమే,
అవసరం అనుకుంటే ఆ తప్పు అనే పేజీని
చించేయండి కానీ ఆ పేజీ కొరకు
మొత్తం పుస్తకాన్ని పోగొట్టుకోకండి
అలాగే తప్పులు చేసేస్తూ ఒక్కోపేజీని చించేస్తూ
అట్టనే మిగిల్చి కోకండి.
తెలిసో తెలియకో జరిగిన తప్పులకు సంఘటనలాకు ప్రతికూల ఆలోచనలు జోడించి జీవితాన్ని మరింత ఇబ్బందిగా మార్చుకోకండి
వీలైనంత సానుకూల ఆలోచనలను ఆలోచిస్తూ
ఆ బాధ నుంచి ఆలోచనలా నుంచి బయటపడండి
భగవంతుడు మనకిచ్చిన ప్రతిక్షణం అద్భుతమైనది
ఆ క్షణాలనూ పిచ్చి పిచ్చి ఆలోచనలతో
చేతులారా పాడు చేసుకోకండి
ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరికి ఎరుక
ఆ పరమాత్మకే ఎరుక
అందుకే ప్రతి క్షణం వీలైనంత వరకు
మనకు నచ్చిన భగవన్నామ స్మరణ చేస్తూ
ఆ తండ్రి మనతో మన పక్కన ఉన్నాడు
అన్న నమ్మకంతో ఆనందంగా ఉందాం
ఆ తండ్రి పాదాల చెంత చేరు వరకు
ఓం నమశ్శివాయ🙏

శివయ్య అందరినీ చల్లగా చూడు తండ్రి🙏

No comments:

Post a Comment