Monday, March 9, 2020

స్వదేశీ వస్తువులను వాడదాం స్వాభిమానంతో జీవిద్దాం

ఒక మంచి విషయము

నేను ద్రాక్ష (అంగూర్) పండ్లను కొంటానికి మార్కెట్కు వెళ్ళాను ।

నేను : బాబు కిలో ఎంత...?
అతను : "కిలో 80 సర్।"
పక్కనే విడి విడిగా ఉన్న ద్రాక్ష పండ్లను చూసాను.... ।
నేను అడిగాను : " మరి వీటి ఖరీదెంత?"
పండ్లతను : "30 రూపాయలకు కిలో సర్"
నేను అడిగా : "ఇంత తక్కువగాన..?
పండ్లతను : "సర్, అవి కూడా మంచివే..!!
కాని... కాని అవి గుత్తి నుండి విడి పోయాయి ...అందుకే అంత తక్కువ రేటు।"

అప్పుడు నాకు అర్థమైంది... సమాజము,సంఘముమరియు కుటుంబమునుండి వీడి పోతే .....మన జీవితము కూడా సగానికన్న తక్కువకు పడిపోతుంది।

దయ చేసి మీ కుటుంబము సమాజము మరియు మిత్రులతోఎప్పుడు టచ్ లో ఉండండి.....

పవిత్రమైన స్నేహాన్ని స్నేహం లాగే చూడండి దానికి ఎటువంటి చెడుని ఆపాదించకండి....


🍃ఈ జన్మకే....🐾

🔱 ఈ జన్మకే వాళ్ళు మన అమ్మా నాన్నలు...

🎈ఈ జన్మకే వాళ్ళు మన కొడుకూ కూతుళ్ళు...

🎉ఈ జన్మకే వాళ్ళు మన జీవిత భాగస్వాములు...

🎊ఈ జన్మకే వాళ్ళు మన అక్కా చెల్లెల్లు, అన్నా తమ్ముళ్ళు...

🎁ఈ జన్మకే వాళ్ళు మన స్నేహితులు, సన్నిహితులు...

🎉ఈ జన్మకే, కేవలం ఈ జన్మకే!

🎁మహా అయితే ఇంకో పదీ.. ఇరవై ..........సంవత్సరాలు !

🍃తప్పు చేసినా క్షమిద్దాం ,అనందంగా భరిద్దాం, ప్రేమిద్దాం!

🍂పోయాక ఫోటోను ప్రేమించే కన్నా,
ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మిన్న!

🌳👌All is well✋🌿

బంధుత్వాలు తెంచుకోవడం నిముషం.

అదే నిలుపుకోవాలంటే ?

ప్రియమిత్రులందరికీ వందనములు

తను చిన్నతనంనుండీ కనీసం చదువు కోవడానికి
డబ్బులేక . తమ కనీస అవసరాలు కూడా తీర్చు
కోలేక , వారు గడిపిన భయంకర అవస్థలు తమ
పిల్లలకు రాకూడదని , తమ పిల్లలు కూడా నలుగురిలో ఉన్నతంగా బ్రతకాలనే తాపత్రయంతో
కన్నవాళ్ళు తను సామాన్య జీవితాన్ని గడుపుతూ ,
ఆస్థులు కూడ బెట్టి తమ పిల్లలకు ఇస్తే ,

తమ తల్లిదండ్రులు బతికి ఉండగానే కొందరు

తమ తల్లిదండ్రులు కాలం చేసాక కొందరు

" పెద్దాడికి ఎక్కువ ఇచ్చి మా నాన్న మాకు అన్యాయం చేసాడనో ,

నా స్వార్జితం నాకు దారిన పోయే దానయ్య కైనా
రాసే హక్కు నాకుంది అంటూ మా నాన్న తన
ఆస్థి అంతా మా అక్కకు రాసారనో ,

మా ఇంట్లో ఉంటూనే మా అమ్మ తన జవహరి
అంతా ఇద్దరు కూతుళ్ళకు దోచి పెట్టి కోడళ్ళకు
అన్యాయం చేసిందనో ,

ఇలా వివిధ రకాల కారణాలతో రక్త సంబంధీకులందరూ శాశ్వతంగా దూరమవుతూ ,
బ్రతికి ఉండగా మాట్లాడు కోకుండా , మొహాలు కూడా
చూసుకోకుండా తమ జీవితాంతం వరకు ఒకరి నొకరు
ద్వేషించుకుంటూ , ఆ ద్వేషాలు తమ వారసత్వంగా
తమ పిల్లలకు కూడా బదిలి చేస్తూ , తన అశాంతితో
జీవిస్తూ తన వారిని కూడా అశాంతి పాలు చేస్తున్నారు .

ఎవరి కోసం ?
ఎందు కోసం ?

దాని వల్ల ఒరిగే ప్రయోజనము ఏమిటి ?
జీవితాంతం ఒక రక్తం పంచుకున్న అన్న దమ్ములు ,
అక్క చెల్లెళ్ళు . అన్నా చెల్లెళ్ళు పరస్పరం
అశాంతితో ద్వేషించుకుంటూ ఒకరి నొకరు చూడకుండా
జీవిస్తూ శాశ్వతంగా దూరమయి , వివాహాలకు
కూడా పిల్చుకోకుండా , హాజరుకాకుండా , ఎవరు
ఎవరికి హాని చేస్తారోనని అనుక్షణం భయపడుతూ ,

చివరకు ఎవరో ఒకరు కాలం చేసాక తట్టుకోలేని
శోకతప్తులై గుండెలు బాదుకుని కుమిలి కుమిలి
విలపిస్తే ఆ చనిపోయిన వారిని తిరిగి పొందగలమా?
ఆ ఖాళీ అయిన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.

కొంతమంది తమ తల్లిదండ్రులను కూడా ఈ ఆస్థి
పంపకాల అసంతృప్తితో దూరం చేసుకుంటున్నారు.
ఆ వయసులో కన్నవారు పడే వేదన వర్ణనాతీతం.

మరి ఈ సమస్య కు పరిష్కారము ?

పంతాలు పౌరుషాలు ప్రక్కన పెట్టి అందరూ
కూర్చుని సామరస్యంగా ఆవేశాలకు పోకుండా
మాట్లాడుకుని పరిష్కరించుకుంటే అభిమానాలు
కలకాలం పరిమళిస్తూ అనుబంధాలు పెంపొందే
అవకాశం ఉంటుందేమో నని నా నమ్మకం .
దీనికి కావల్సింది సహనంగా ఆలోచించడం
విచక్షణ పట్టుదలలు సడలించు కోవడం .
ఈ విషయములో పెద్దవారు చొరవ తీసుకోవాలి ...

కోర్టులు పరిష్కరిస్తా యనుకుంటే ఫలితం శూన్యం
ధన నష్టం ఒకరి మీద ఒకరు అబద్దపు వ్యక్తిగత
దూషణలు చేసుకుంటే సన్నని దారులు కూడా శాశ్వతంగా
మూతపడతాయి .

ఓడిన వాడు కోర్టులోనే ఏడుస్తాడు
గెలిచిన వాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు

రెండిటికీ తేడా ఏమీ ఉండదు.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
సర్వేజనా సుఖినోభవంతు
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

దేశాన్ని బాగు పరచడం

మా ఇంటి పక్కన వెంకటరెడ్డి గారని ఒక పెద్దాయన.

రిటైర్ అయి పోయి, ఉన్న కాస్త పొలం కౌలుకిచ్చి పెన్షన్/కౌలు డబ్బులతో కాలక్షేపం చేస్తున్నారు.

ఒకటో తారీఖు అనుకుంటా..
పొద్దున్నే సందు చివర షాప్ కి వెళ్లి 500 రూపాయల సరుకులు కొన్నారు.

ఆ షాప్ అబ్బాయికి కూడా ఒకటో తారీఖు కదా. పక్కన బిరియానీ పాయింట్ లో బిరియానీ తీసుకుని ఇంటికి వెళ్ళాడు.

ఆ బిరియానీ షాప్ ఆయనేమో రోజూ బిరియానీ ఏం తింటాం అనుకున్నాడేమో, పక్కన కర్రీ పాయింట్ లో కూరలు కొనుక్కుని ఇంటికి వెళ్ళాడు.

ఆ కర్రీ పాయింట్ అబ్బాయి ఆ పక్కన ఉన్న కూర గాయాల షాప్ లో ఆ డబ్బులతో కూరగాయలు కొన్నాడు.

కూరగాయల షాప్ అబ్బాయి సాయంత్రం రైతు కి కూరగాయల డబ్బులు ఇచ్చి లెక్క రాసుకున్నాడు.

రైతేమో వెంకటరెడ్డి గారి పొలం కౌలుదారు. పొలం కౌలు డబ్బులు తెచ్చి వెంకటరెడ్డి గారికి ఇచ్చేశాడు.

కథ అయి పోయింది.
🌈🌈🌈🌈🌈🌈
ఒక్క నిమిషం ఈజీ లెక్క కోసం అందరూ తమ దగ్గరికి వచ్చిన 500 పూర్తిగా ఖర్చుపెట్టారు; వాళ్లకు అదే ఆధారం అనుకుంటే...

ఈ కథ లో మొత్తం ఎకనామిక్ ఆక్టివిటీ వచ్చేసి 500x6 = 3000 రూ.
(పేపర్ల వాళ్లు GDP అంటారే.. అది ఇదే)

ఆ 500 రూపాయలు మళ్లీ వెంకట రెడ్డి గారి జేబులోకే వచ్చేసినా, ఊరులో కనీసం 6 కుటుంబాలు లాభ పడ్డాయన్న మాట.

🌈🌈🌈🌈🌈🌈

ఇదే వెంకటరెడ్డి గారు అదే 500 తీసుకెళ్ళి ఏ ఫారిన్ కంపెనీ లోషనో కొన్నార నుకోండి..

ఆ మిగిలిన 5 కుటుంబాలు ఆ రోజుకు పస్తన్న మాట.

🌈🌈🌈🌈🌈🌈

"చైనా వాడి GDP మనకన్నా ఎక్కువ ఉంది. అమెరికా is very developed. What is India doing?" అని బాధ పడకుండా..

వీణ్ణీ వాణ్ణీ తిట్టక్కర లేకుండా..

దేశాన్ని బాగు పరచటం ఎలాగో తెలిసింది కదా...

Be Indian! Buy Indian!! జై స్వదేశీ స్వదేశీ వస్తువులను వాడదాం స్వాభిమానంతో జీవిద్దాం జై జై స్వదేశీ

శ్రీ ధర్మశాస్త సేవాసమితి🐆 విజయవాడ🏹7799797799

💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢

No comments:

Post a Comment