Thursday, March 5, 2020

గెలవాల్సిన చోట ఓడిపోతే..

గెలవాల్సిన చోట ఓడిపోతే.. నా ఖర్శ ఇంతే అని సరిపెట్టుకోవద్దు,ఎక్కడ పొరపాటు జరిగిందో ఆలోచించుకొండి.. ఇక జీవితంలో ఓటమికే ఆస్కారం లేకుండా చేసుకొండి.

మొదటి అడుగు వేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించడంలో తప్పులేదు. కానీ ఒకసారి నిర్ణయం తీసుకుని అడుగు వేశాక,వందమంది చెప్పినా, వెనక్కి తిరిగి చూడకండి...
గెలుపు అయినా,ఓటమి అయినా,మనం మొదట వేసే ఆ ఒక్క అడుగులోనే ఉంటుంది..

మనసులో నిజాయితీ ఉన్నప్పుడు, మన వ్యక్తిత్వం యొక్క ప్రకాశం మన ముఖంలో కనబడుతుంది.. వెనక్కి అడుగు పడకూడదు. వందమంది లాగిన సరే ధైర్యంగా అడుగులు వేయడమే.. ఒంటరిగా మన అడుగు ఆ వందమందికీ దారి చూపేవిధంగా ఉండాలి.

మనందరికి ప్రేరణ కలిగించే మహాకవి శ్రీశ్రీ గారి మాటలు..

జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా.. ఎందరు విభేదించినా... కన్నవాళ్ళే విభేదించినా ... తోబుట్టువులే కాదన్నా.. స్నేహితులే ఆటంకపరచినా.. గెలుపు తలుపు తెరిచేవరకు ఆగిపోకు. కష్టాలు నిన్ను బలవంతుడిగా తయారు చేయడానికే వచ్చిన సోపానాలు.. క్రూరమైన మనుషుల మాటలు నీ గుండెను కఠిన పాషానం చేయడానికే.. ఆగిపోయావో అదే చివరిరోజు.. అదే ప్రయత్నిస్తూవున్నావో .. ఓటమి అనుక్షణం నిన్ను చూసి భయపడుతుంది.

కొన్ని వందల మందికి వెలుగునిచ్చేవాడికి ఎంత బలం ఉండాలి ..వాడి గుండె ఎంత బలంగా ఉండాలి.. అందుకే... అందుకే .. భగవంతుడు నిన్ను ఎంచుకున్నాడు. నీకు కష్టాలు వస్తున్నాయంటే , కఠినమైన మాటలను నువ్వు వినవలసివస్తుందంటే నువ్వు ఉన్నత స్థితిలోకి వెళ్ల బోతున్నావని అర్ధం. ఆగిపోకు..అలసిపోకు.. రాకాసి అలలా ఉత్సాహంగా ఎగసిఎగసిపడు.....!!
👏👏👏

No comments:

Post a Comment