సోహం అంటే అతనే నేను లేదా నేనే అతను, నేనే బ్రహ్మం , బ్రహ్మం నేనే సః అంటే అతను (బ్రహ్మము ) అహం అంటే నేను. ఈ మంత్రం అన్ని మంత్రాల కంటే గొప్పది.ఇది పరమ హంసలైన యోగుల మంత్రము. ఇది అభేద బోధ వాక్యం అని అంటారు. ఇది జీవ బ్రహ్మ ఏకత్వాన్ని సూచిస్తుంది. ఈ మంత్రం సోహమస్మి అనే ఈశావాశ్య ఉపనిషద్ నుండి తీసుకొనబడింది .
సోహం ఓం రెండు ఒకటే. సో అనే అక్షరంలో స ని తీసివేస్తే ఓ ఉంటుంది హం లో హ ని తీసివేస్తే o ఉంటుంది. రెంటిని కలిపితే ఓం అవుతుంది. ఓం కారం కంటే సోహమే సులభమైంది. శ్వాసతో కలిపి మనసుతో భావన చేయాలి. అందుకే ఇది సోహం ధ్యానం కాదు సోహం భావన లేదా హంస భావన అని అంటారు. ఈ జపాన్ని కష్టపడి చేయాల్సిన పనిలేదు కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టి, ఉచ్వాస నిశ్వాసాలను గమనిస్తే చాలు.
హంసోహం అని పునరావృతమవుతూ ఉంటుంది. దానికంటే ముందు నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనే వేదాంత వాక్యం ద్వారా ఈ దేహం నేను కాదని, "నాహం ఇదం శరీరం" దేహాన్ని మరియు పంచ కోశాలను నేను కాదని నిరసించాలి. నేను పాంచ భౌతికమైన దేహం కాదు నేను ఆత్మను, పరమాత్మా స్వరూపమని భావించాలి.
ఈ మంత్రాన్ని లోపలున్న జీవుడు లేదా ఆత్మ రోజుకి 21,600 సార్లు పునరావృతం చేస్తూ ఉంటుంది. గాఢనిద్రలో కూడా దానంతట అదే ఈ అజప జపం జరుగుతూ ఉంటుంది.
ఉచ్వాస నిశ్వాసాలను ఏకాగ్రతతో గమనిస్తే ఈ మంత్ర శబ్దం వినవచ్చు. గాలి లోపలకి పీల్చినపుడు ఉచ్వాసంలో సో అని వదిలినపుడు హం అనే శబ్దం వినిపిస్తుంది.
దీనినే అజప జపమని అంటారు ఎందుకంటే నోరు తెరవకుండా పెదవులు కదపకుండా మనసుతో భావన చేసేది.
సహజంగానే పరమాత్మ మనకొక వరం ఇచ్చారు. సంధ్యాకాలంలో మనం కనుక మేలుకొని హంసను గమనిస్తూ వుంటే, మన ప్రాణాన్ని గమనిస్తూ వుంటే, సుషుమ్న నాడిలో హంస కొట్టుకోవడం గమనించవచ్చును. ఇడా పింగళ, మధ్యలో సుషుమ్న నాడి వుంటుందన్నమాట. ఆ సుషమ్నా నాడిలో ఒక్క క్షణం పాటు హంస కొట్టుకుంటుంది. ఎప్పుడూ అందులో కొట్టుకోదు, ఇడాపింగళలో కొట్టుకుంటుందన్నమాట. ఈ సుషుమ్నానాడిలో ఆ క్షణం పాటు ఎప్పుడైతే కొట్టుకుంటుందో, ఆ కొట్టుకునే క్షణంలోనే మనం తెలుసుకోగలమట ఆత్మజ్ఞానాన్ని. ఆత్మసాక్షాత్కారం అప్పుడు జరుగుతుంది. ఒక్క క్షణంలో, ఒక్క రెప్పపాటులో జరిగిపోతుంది అది. ప్రతిరోజూ వుంది మనకు ఆ అవకాశం. ఎవరు చెప్పినా అదే. 6 గంటలకు చేయండి, 5.30కు చేయండి. బ్రహ్మముహూర్తంలో లేవండి, ఏమిటి? లేచి ఏం చేయాలి? ఇది చేయాల్సిన పని. ఐదు గంటలకు లేచానండి, మళ్ళా అటూ ఇటూ దొర్లానండి. అది కాదండీ అక్కడ విషయం.
లేచిన తరువాత ప్రాణాన్ని గమనించవయ్యా! ఇడ, పింగళ, సుషుమ్న పైకి క్రిందకి ఎలా కొట్టుకొంటోంది? కుడిలోంచి వెళ్ళింది. ఎడమకు తిరిగి వచ్చింది. మళ్ళా ఎడమలోంచి వెళ్ళింది, కుడికి తిరిగి రావాలి. కానీ అలా రావడం లేదు. ప్రయత్నం చేసి అలా శ్వాసను త్రిప్పుకో. తిప్పుకుంటే మధ్యలో సుషుమ్నా నాడి అలా తగుల్తుందన్నమాట. తగిలినప్పుడు నీకు ఆ స్పర్శయొక్క భేదం తెలుస్తుంది. ఇడా పింగళలో హంస పనిచేస్తే ఎలా వుంది? సుషుమ్నలో వుంటే ఎలా ఉందొ తెలుస్తుంది? మనలో చాలా మందికి ఉదయం అస్సలు ధ్యానం కుదరడంలేదని సమస్య. అయితే మనం అప్పుడే ధ్యానం వగైరాల జోలికి వెళ్ళకూడదు. ముందు ప్రాథమిక ప్రయత్నం చేయాలి. మన అందరికీ ఏమిటంటే, అక్షరాభ్యాసం లేదు పై క్లాసువుంది. ఈ అక్షరాభ్యాసం లేకుండా ఆ పై క్లాసు రాదు. ముందు మనకు ప్రాధమిక అభ్యాసం set right అవ్వాలి.
శాన్తాయ దాన్తయ గురుభక్తాయ హంస హంసేతి|| (హంసోపనిషత్)
- హంస హంస అను పరబ్రహ్మ స్వరూపము జితేంద్రియుడగు గురుభక్తునకు తెలియబడుచున్నది.
భావాభావాతీతమైన సొగసా
ఊపిరిని వదలని గొలుసా
నీకు ముడిపడినది మనసు తెలుసా
ఈ కనుల మెరుపులా వరస
బాహ్య మధ్య అంతర రభస కలమేలకవైనదేమో బహుశా
ఇది మలుపు వెలుగుల దశ
నీవేలే పైకి కిందకి ఎగిరే హంస
అందుకొని గగనపు కొనలే చూసా
ఇంకేమి అవసరం లేదు
గురువాక్యమిది చాలు
ఇడా పింగళ నాడుల మధ్యన సుషుమ్న నాడి ఉంటుంది.
ఈ ఇడా పింగళ
రెండు నాడులు రెండు శబ్దాలను చేస్తాయి.
నాభి చక్రమైన అనాహతం నుండి ప్రాణ వాయువు సుషుమ్న నాడి యందు ప్రవిశించినపుడు , మనకి జీవుడు చేసే శబ్దం లేదా అజపం వినపడుతుంది.
అదే సోహం.
ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు బోధించే మంత్రమిది.
ఇదే ఆఖరి మంత్రం , అత్యున్నత మంత్రం,
అజపా మంత్రం, హంస అని అంటారు. జీవాత్మా పరమాత్మతో ఐక్యమవడానికి ఉపయోగపడే మంత్రమిది.
సోహం = సః + అహం
సః" అంటే ఆ పరమాత్మా / తాను ,
ఇడా నాడి చేసే శబ్దం
అహం" అంటే జీవాత్మ / నేను.
పింగళ నాడి చేసే శబ్దం.
సః అహం ఈ రెండు కలవడమే జీవబ్రహ్మాఇక్యం.
అదే చిన్ముద్ర సూచన , చూపుడు వేలు బొటన వేలితో కలిపి మౌన వ్యాఖ్య చేస్తారు.
జీవుడు లోపల నిరంతరం సోహం సోహం అని ధ్యానిస్తూ ఉంటాడు.
ఉచ్చ్వాస- ముక్కులోకి శ్వాస పీల్చినపుడు "సో" అని
నిశ్వాస- శ్వాస వదిలినపుడు " హం" అని లోపల వినపడుతుంది , కాబట్టి మనసులో నిత్యం స్మరించాలి ,
నోటితో జపించరాదు , పలకరాదు.
ఏమీ తెలియదని తెలుసుకోవడమే జ్ఞానం
హంస భావనే అభ్యాసం
గుర్తెరిగే శరీరం ఏమి లేదనుటే వైరాగ్యం
ఆత్మ / పరమాత్మ నేనని అనుభవమే ఆరూఢమ్
చిత్తము నిలుపుటే యోగం
అంతా ఉత్తదనుటే ఉత్తమం
వాదులాడక ఉరుకుంటే సుఖం
నిశ్శబ్దమే భజన
మౌనమే బ్రహ్మ ధ్యానం
నిద్దురలో నిద్దూరే బ్రహ్మ నిర్వాణం
నిర్వికల్ప సమాధిలోనే బ్రహ్మ తత్త్వం
ఆత్మానుసంధానమే మోక్షం
జన్మ రహితమే పరమార్థం
జీవజగదీశులు స్వప్నం
నీవేకమని గుర్తెరిగితే ఆనందం
స్వానుభవమే సత్యం.
మనసే బంధం
మరుపే మరణం
గురువే దైవం.

No comments:
Post a Comment