Friday, March 13, 2020

పిరమిడ్

పిరమిడ్


గణిత శాస్త్ర ప్రకారం 'ఒక సమతల ఆధారం పై సమతల పార్శ్వాలు ఒక బిందువు వద్ద కలిసే ఒక ఘనాకృతి'ని "పిరమిడ్'' అని పిలుస్తారు.
పిరమిడ్ గ్రీకు పదం. 'పైరా' అంటే 'అగ్ని', 'మిడ్' అంటే 'మధ్యభాగం' (కేంద్రం) అని అర్ధం. భూతద్దం కాంతి కిరణాలను ఏ విధంగా ఏకం చేస్తుందో, అదే విధంగా పిరమిడ్ అనే సాధనం విశ్వప్రాణశక్తిని (cosmic energy) ఏకం చేస్తుంది. విశ్వప్రాణశక్తిని నిరంతరం నిలవ ఉంచే ఒక గది పిరమిడ్ అని చెప్పుకోవచ్చు.

✳ గిజా పిరమిడ్:-
మన ప్రపంచంలోని అన్ని పిరమిడ్లు కంటే పెద్దది, ఈజిప్టులోని కైరో నగరానికి 16 కి.మీ. దూరంలో నిర్మితమైన గిజా పిరమిడ్.
ఈ గ్రేట్ పిరమిడ్ యొక్క కొలతలు సుమారుగా కింద భాగపు పొడవు (Base) 756 అడుగులు, వాలు పార్శపు పొడవు (Side) 725 అడుగులు, ఎత్తు 485 అడుగులు. ఇది సుమారుగా 13 ఎకరాల భూమికి పైగా ఆక్రమించినది. దీని బరువు 10 కోట్ల టన్నులు పైనే. దీని ముందు భాగం నలువైపులకు 51°51" వాలి ఉంది.
➡ ఈ మహా పిరమిడ్ యొక్క నాలుగు భుజాలు సరిగ్గా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలకి అభిముఖంగా ఉన్నాయి.
➡ ఆ గ్రేట్ పిరమిడ్ సరిగ్గా భూమికి మధ్యభాగంలో నిర్మింపబడినది. దీని కేంద్రం నుండి సమాంతర రేఖను గీస్తే ప్రపంచంలోని ఐదు ఖండాలను, సముద్రాలను సమంగా విభజిస్తుంది.
➡ దీని నిర్మాణం మొత్తం రేఖగణిత, ఖగోళ శాస్త్ర పరిజ్ఞానంతో జరిగింది. రాజు గారి గదిని 'పైథాగరస్' సిద్ధాంతం ఉపయోగించి కట్టగా, రాణిగారి గదిని 'పై' విలువను ఉపయోగించి కట్టారు.
➡ ఇవియే కాక పిరమిడ్ లోని పాసేజ్, గ్యాలరీ ఇవన్నీ కూడా గణిత, ఖగోళ శాస్త్ర పరిజ్ఞానంతోనే నిర్మించారు.
➡ దీని కొలతలు వంద కోట్లతో పెంచినట్లయితే భూమికి సూర్యునికి మధ్య దూరం వస్తుంది.
➡ ఈ పిరమిడ్ కట్టిన స్థలం కింద ప్రపంచాన్ని నాశనం చేయగల అగ్ని ఉన్నది.
➡ దీని శిఖరం నుండి స్థిర విద్యుత్ ఎల్లప్పుడు వెలువడుతునే ఉన్నది.
గిజా పిరమిడ్ లోని నిర్మాణాలు:-
1) రాజుగారి గది
2) రాణి గాది
3)గాలి పోవడానికి మార్గాలు
4) రాజుగారి ప్రక్క గది
5) ఆరోహణ మార్గము
6) రాణి గదికి మార్గము
7) చిన్న గది (బావిలో)
8) పాతాళ గృహము
9) బావి లాంటి గొయ్యి
10) దిగే మార్గము

దీనిని పూర్తిగా గ్రానైట్ తో నిర్మించారు. ఇందులో రెండు మిలియన్ లకి (20 లక్షలు) పైగా గ్రానైట్ బ్లాకులున్నాయి. ఒక్కొక్క బ్లాక్ ఎక్కడ చూసినా 2 నుంచి 70 టన్నుల బరువు ఉంటాయి. ఈ గ్రానైట్ బ్లాకుల మధ్య కనీసం బ్లేడు కూడా దూరని కళానైపుణ్యంతో అమర్చారు. ఈ గ్రానైట్ రాళ్ళు కనీసం 1000 మైళ్ళ దూరంలో ఉన్న అశ్వన్ అనే ప్రదేశం నుండి తెచ్చారు. పిరమిడ్ రాళ్ళను కాల నిర్ణయం ద్వారా పరీక్ష చేస్తే 71 వేల సంవత్సరాల కిందటివని, కానీ దీనిని నిర్మించి సుమారు 4000 సంవత్సరాలు పట్టినదని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.
ఈ గ్రేట్ పిరమిడ్ కట్టడానికి భూలోకవాసులకు ఎంత టెక్నాలజీ ఉపయోగించినా కనీసం కొన్ని వందల సంవత్సరాలు పట్టును. అందువల్ల శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం దీనిని గ్రహాంతరవాసులే కట్టారని అభిప్రాయం. దీనిని వారు విశ్వరహస్యం, విశ్వసందేశం అందించే నిమిత్తం మరియు భూమ్యాకర్షణ కేంద్రాన్ని సమతుల్యంగా ఉంచడానికి నిర్మించినట్లు ప్రతిపాదించారు. అప్పటి కాలంలోని రాజులకు దీని విశిష్టత తెలియక తమ మరణాంతర దేహాలను దానిలో భద్రపరిచారు. కొన్ని వేల సంవత్సరాలు దాటిన ఆ మృత శరీరాలు కుళ్ళక పోవడం పరిశోధకుల బృందాన్ని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా చనిపోయిన శరీరం వెంటనే కుళ్ళడం ప్రారంభిస్తుంది. తరువాత అందులోని రక్త మాంసాలను పీల్చేసే సూక్ష్మజీవులు దానిని శిధిలం చేస్తాయి. ఫలితంగా అస్థిపంజరం మాత్రం మిగులుతుంది. కానీ మృత దేహం కుళ్ళిపోకుండా ఎండి పోవడాన్ని పరిశోధకులు గమనించారు. పిరమిడ్ పై చేసిన ప్రయోగాలు, అధ్యయనాల ద్వారా పిరమిడ్ కు రెండు విశిష్ట లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు.
1. పిరమిడ్ యొక్క రేఖాగణిత ప్రభావం వల్ల, దీనిలో అపారమైన అత్యంత శక్తివంతమైన విశ్వశక్తిని ఇది గ్రహిస్తుంది అని ( 51°51" కొలతలు)
2. గ్రహించిన ఆ ప్రాణశక్తిని బయటకు పోనివ్వకుండా ఉంచుతుందని కనుగొన్నారు.

✳ పిరమిడ్ - విశ్వ ప్రాణశక్తి:-
ఒక జీవి జీవించటానికి శక్తి అవసరమని, ఆ శక్తి తగ్గితే రోగాలు సంభవించునని లేదా పూర్తిగా బయటికి పోతే మరణం సంభవించునని మనందరికీ తెలుసు. సృష్టిలోని చేతన, అచేతన, ప్రాణసహిత, ప్రాణరహితమైన అన్నింటిలోనూ శక్తి వ్యాపించి వుంది. ప్రాణుల్లో అది చైతన్యవంతంగాను, రాళ్ళ వంటి వాటిలో అచేతనంగాను వుంటుంది. ఈ శక్తి అనునది ఉష్ణం, కాంతి, అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్, రేడియోధార్మిక, ఎక్స్ రే, ఆల్ఫా, బీటా, గామా, అణుధార్మిక కిరణాలలోనే కాక ఇంకా ఎన్నో రూపాలలో విడుదల అవుతోంది.
స్థూలంగా చెప్పాలంటే మన ఈ సృష్టిలో అనుకూల శక్తులు (positive energy) మరియు అననుకూల శక్తులు (negative energy) అనేవి రెండు మాత్రమే కలవు. ఈ రెండింటి సమ్మేళన చర్యతో ఏర్పడినదే "విశ్వమయ ప్రాణశక్తి".
ఉదాహరణకు ఒక బల్బు వెలగాలంటే విద్యుచ్ఛక్తి అవసరం. విద్యుచ్ఛక్తి అనునది ఒక అనుకూల శక్తి (+ve terminal) మరియు ఒక అననుకూల శక్తి (-ve terminal) కలయికతోనే ఏర్పడుతుంది. ఏ ఒక్క శక్తితో బల్బు వెలగదు. రెండూ కావలసినదే. అనగా అనుకూల శక్తి, అననుకూల శక్తుల యొక్క కలయిక వల్ల ఏర్పడిన విశ్వప్రాణశక్తి వల్లే బల్బు వెలుగుతుంది. (విశ్వప్రాణ శక్తి విద్యుచ్ఛక్తిగా రూపాంతరం చెందుతుంది.)
మన భూగ్రహం 23.5 డిగ్రీలు ఏటవాలుగా వాలి ఈశాన్య, నైఋతి దిశలుగా ప్రయాణిస్తుందని మనకు తెలుసు.
అందువలన శూన్యం నుండి ఈశాన్య దిశకు +ve energy, నైరుతి దిశకు -ve energy భూగ్రహం గ్రహిస్తుంది. అందువలన మన పూర్వీకులు వాస్తు శాస్త్రం లో ఈశాన్య దిక్కునకు ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చారు.
పిరమిడ్ యొక్క నిర్దిష్ట ఆకృతి (51°51") వల్ల అనుకూల, అననుకూల శక్తులు ఎల్లప్పుడూ ఈ రెండింటినీ ఆకర్షింప చేసి, దీని అంతర్భాగంలో సమ్మేళన చర్య ద్వారా విశ్వప్రాణ శక్తి లేక జీవ శక్తిని నిరంతరం విడుదల చేయడమే కాక దీనిలోనే విలీనం (దాచుకోవడం) చేసుకోగలదు. విశ్వప్రాణశక్తి విడుదలయ్యేటప్పుడు ఆ శక్తి శిఖరం అగ్రభాగం ద్వారా ఉష్ణరూపంలోను, అడుగు భాగంలో శీతల రూపంలోను విడుదలవుతుంది.

పిరమిడ్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీ. (Organic Chemistry) ఆర్గానిక్ కెమిస్ట్రీ లో అణువులన్నీ దగ్గరకు చేరతాయి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో (Inorganic Chemistry) అణువులన్నీ ఎక్కడికక్కడే విడిపోతాయి. అందువలన పిరమిడ్ లో శక్తి యొక్క అణువులన్నీ దగ్గరకి చేరి శక్తి క్షేత్రం అవుతుంది. పిరమిడ్ లోని కోణం వల్ల ఈ శక్తి దీనిలోనే నిలువ వుంటుంది.

శక్తిని బోవిస్ యూనిట్లలో కొలుస్తారు.

0 బోవిస్ - శక్తి రాహిత్య స్థితి
6500 బోవిస్ - సామాన్య మానవుని శక్తి
6500 to16000 బోవిస్ - ప్రకృతి లోను, పిరమిడ్ లోను, కొన్ని కొన్ని గర్భగుళ్ళలోను కేంద్రీకృతమైన శక్తి.

✳ పిరమిడ్ తయారీ:-
పిరమిడ్ నిర్మాణానికి మనకు 4 సమద్విబాహు త్రిభుజాలు కావాలి. అనగా Side = Base × 0.95
ఈ నిష్పత్తిలో 4 సమద్విబాహు త్రిభుజాలను తయారుచేసి, వాటిని ఆనించినప్పుడు 51°51" డిగ్రీల కోణం రావడం ముఖ్యం.
వీటిని మనం ఏ మెటీరియల్ తోనైనా తయారు చేయవచ్చు. ప్లైవుడ్, ప్లాస్టిక్, గాజు, రాగి, Rcc, Card board, ఇనుము ఇలా దేనితోనైనా తయారుచేయవచ్చు. అన్ని తమ శక్తి మేర ప్రాణశక్తిని గ్రహించును. శాస్త్రజ్ఞుల అధ్యయనం ప్రకారం రాగి ఎక్కువ శక్తిని గ్రహించునని, ఇనుము తక్కువ శక్తిని గ్రహించునని కనుగొన్నారు. భూమి మీద కట్టే పిరమిడ్ కు భూశక్తి కూడా కలిసి ఎక్కువ శక్తిని ఉత్పన్నం చేయును.
పిరమిడ్ ముఖాలు ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిశలకి అభిముఖంగా చూస్తున్నట్లు దిక్సూచి సాయంతో నిర్మించాలి. తర్వాత ఆధారం నుండి శిఖరం వరకు వున్న ఎత్తులో 1/3 వంతు దూరంలో కింగ్స్ ఛాంబర్ ను (kings chamber) నిర్మించుకోవాలి. ఇది శక్తి క్షేత్రంలోనే ఒక అత్యంత శక్తివంతమైన ప్రదేశం. ఆధారం నుండి కింగ్స్ చాంబరుకు మధ్యలో క్వీన్స్ ఛాంబర్‌ను నిర్మించుకోవాలి. దీనిని చిన్న పిరమిడ్ లో నిర్మించలేం. చివరిగా పిరమిడ్ శిఖర అగ్రభాగమందు క్రిస్టల్ ను (స్పటికం) అమర్చాలి. క్రిస్టల్ ను అమర్చడం వల్ల హీలింగ్ పవర్ పెరుగుతుంది. ఆ క్రిస్టల్ ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత హీలింగ్ పవర్ పెరుగుతుంది.

✳ పిరమిడ్ - పరీక్ష (Test):-
1) ఒక కప్పు తేనెను పిరమిడ్ లోపల కింగ్ ఛాంబర్ పై 5 రోజుల పాటు కదపకుండా ఉంచాలి. ఆరవ రోజున తేనెను పరీక్షించిన అది ఘనీభవించును. తేనె కప్పును బోర్లించినా ఒక్క చుక్క కూడా కింద పడకపోతే పిరమిడ్ సజీవంగా ఉందని, బాగా పనిచేస్తుందని గ్రహించాలి.
2) పిరమిడ్ శిఖరం నుండి శక్తి వెలువడుతున్నది, లేనిదీ తెలుసుకోవాలంటే ఒక చిన్న లోలకాన్ని శిఖరం పై భాగంలో వేలాడదీయాలి. అప్పుడు ఆ లోలకం అటూ, ఇటూ ఊగుతుంది. ఏదో బలమైన శక్తి తోస్తున్నట్లు అర్థమవుతుంది.

✳ పిరమిడ్ - రంగులు:-
పిరమిడ్ కి ఆయా రంగులు వేయటం ద్వారా వెలువడే కాస్మిక్ శక్తికి ప్రత్యేక శక్తి కలిగి కొన్ని రకాల రోగాలను నయం చేయవచ్చునని పరిశోధకులు నిరూపించారు. పిరమిడ్ లకు ఈ రంగులు లోపల, బయట కూడా వేయాలి.

ఎరుపు, నారింజ, పసుపు:-
ఇవి ఉష్ణ కిరణాలను (Infra red rays) జనింపచేస్తాయి. ఇవి శరీరాన్ని ఉత్తేజపరిచి, శీతల వ్యాధులను తగ్గిస్తాయి. ఎనీమియా (రక్తం పేరుకుపోవడం) జలుబు, బ్రోంకైటిస్, ఆస్తమా, నీరసం,బద్ధకం, మూర్ఖత్వం, క్షయా, అజీర్ణం, మలబద్దకం, గాల్ బ్లాడర్ లో రాళ్ళు, కేన్సర్ ముందు స్టేజీలు వంటి రోగాలకు పై రంగు గల పిరమిడ్లు తగ్గిస్తాయి.

నీలం, వయొలెట్, ఆకుపచ్చ:-
ఇవి శీతల కిరణాలను (Ultra violet rays) జనింపచేస్తాయి. ఇవి శరీరాన్ని చల్లపరిచి ఉష్ణ సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి. కళ్లనొప్పి, గొంతునొప్పి, తలనొప్పి, ఎపిండిసైటిస్, మొలలు, సుఖ రోగాలు, జ్వరాలు, బట్టతల, బొల్లి, దంతరోగాలు, కాలిపగుళ్లు, గ్యాస్టిక్ వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, నిద్రపట్టకపోవడం, మానసిక వత్తిడి వంటి రోగాలు పై రంగు గల పిరమిడ్లను ఉపయోగించడం వల్ల తగ్గుతాయి.

పిరమిడ్ విశ్వప్రాణశక్తిని శిఖరం అగ్రభాగం ద్వారా ఉష్ణరూపంలోను, అడుగు భాగం నుండి శీతల రూపంలోను విడుదల అవుతుందని తెలుసుకున్నాము. అందువలన శీతల సంబంధమైన వ్యాధులున్నవారు ఎరుపు, నారింజ, పసుపు పిరమిడ్లను మన కిందభాగంలో ( మంచాల కింద, టేబుళ్ల కింద) పెట్టుకోవాలి. ఉష్ణ సంబంధ వ్యాధులు ఉన్నవారు నీలం, వయొలెట్, ఆకుపచ్చ పిరమిడ్లను మన పైభాగంలో (సంబంధిత అవయవం) అమర్చుకోవాలి. కానీ అన్నింటికన్నా తెలుపు రంగు పిరమిడ్ యే శ్రేష్టం. దీని లోపల కూర్చున్నచో లేదా పడుకున్నచో శిఖరం అగ్రభాగం నుండి ఉష్ణశక్తిని, అడుగు భాగం నుండి శీతలశక్తిని గ్రహించి అన్నిరకాల రోగాల నుండి విముక్తి పొందవచ్చు. అందువల్ల పిరమిడ్ లోపలే అన్నిటికన్నా శ్రేష్టం.

✳ పిరమిడ్ - రకాలు:-
➡ శంఖాకారపు పిరమిడ్ (Cone or Circular Pyramid)
➡ మూడు భుజాలు కలిగిన పిరమిడ్ (Triangular Pyramid)
➡ నాలుగు భుజాలు కలిగిన పిరమిడ్ (Rectangular Pyramid)
➡ మల్టీ పిరమిడ్ (Multi pyramid)
పలు పిరమిడ్ల సముదాయాన్ని మల్టీ పిరమిడ్ అని పిలుస్తారు. ఇవి రెండు రకాలు
ఎ) ఒకే సైజు గల పలు పిరమిడ్లను ఒక దానిలో ఒకటి పెట్టడం.
బి) పలు సూక్ష్మ పిరమిడ్ల పైన ఒక పెద్ద పిరమిడ్ ను అమర్చడం.
➡ అష్టముఖ పిరమిడ్ (Octagon Pyramid)
ఇది రెండు పిరమిడ్ల సమ్మేళనం. ఒకటి ముఖ కూర్పులోను, (తూ, ప, ద, ఉ దిశలుగా) మరొకటి వికరణ కూర్పులోను (ఆ, వా, ఈ, నై) రూపొందించి ఒక దాని పై ఒకటి అమర్చాలి. అప్పుడు ఈ పిరమిడ్ కు 8 ముఖాలు ఉంటాయి. ఇది నయం కాని మొండి రోగాలకు ఉపయోగిస్తారు.
➡ ప్రామాణిక పిరమిడ్ (Hallow pyramid)
లోపలి భాగం బోలుగా ఉన్న పిరమిడ్.

ఇంకా ఇవియే కాక రూఫ్ టాప్ పిరమిడ్స్, టేబుల్ టాప్ పిరమిడ్స్, హాంగింగ్ పిరమిడ్స్, వాటర్ పిరమిడ్స్, పిరమిడ్ క్యాప్స్ ఇలా ఎన్నో రకాలుగా తయారు చేసుకుని మనం వివిధ రకాలుగా లబ్ధి పొందవచ్చు.


✳ పిరమిడ్ - ఉపయోగాలు:-
విశ్వ ప్రాణ శక్తిని గ్రహించడానికి సమర్ధవంతమైన సాధనం పిరమిడ్ అని తెలుసుకున్నాము. దీనిని మనం అనేక విధాలుగా ఉపయోగించవచ్చును.

1) వ్యాధి నివారిణి:
ఏ అవయవానికి ఐతే జీవశక్తి తగ్గి రోగం సంభవించునో ఆ అవయవానికి పిరమిడ్ శక్తిని ఉపయోగించి ఆ రోగాన్ని తగ్గించవచ్చు.
గమనిక : పిరమిడ్ - రంగులు లో వ్యాధుల నివారణ గురించి సమగ్రంగా తెలుసుకున్నాం.

2) ద్రవ పదార్థాలు :
పిరమిడ్ ఛార్జీడ్ వాటర్ : పిరమిడ్ అంతర్భాగంలో ఉంచిన నీరు, సుమారు 6 - 8 గంటలలో విడుదలయ్యే పిరమిడ్ శక్తిని ఆకర్షించి విలీనం చేసుకుంటుంది. ఈ జలాన్నే పిరమిడ్ వాటర్ అని పిలుస్తారు. ఇది కలుషితమైన నీటిని సైతం శుభ్రపరుస్తుంది. ఈ నీటిని క్రమం తప్పకుండా వినియోగిస్తే చర్మ ఆరోగ్యం, సౌందర్యం పెంపొందటమే కాక జీవకాంతిని కూడా పొందవచ్చు. ఈ నీటిని ముఖం శుభ్రం చేసుకునే లోషన్ గా వాడి అందం పెంచుకోవచ్చు. ఈ నీటిని త్రాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెంపొందించుకోవచ్చు. ఇవి కడుపులో కలిగే కొన్ని రుగ్మతలను (ప్రత్యేకించి ప్రేగుల వ్యవస్థకు) నయం చేస్తాయి. ఈ నీటిని మొక్కలకు పోసినచో అత్యున్నత ప్రమాణాలు గల మేలైన అధిక దిగుబడిని సాధించవచ్చు.
పిరమిడ్ లోని పాలు త్వరగా పెరుగు అవును. కాఫీ, వైన్, పళ్ళరసం మొదలైన ద్రవ పదార్థాలు ఎన్ని పెట్టినా రుచి మరింతగా పెరగడమే కాక ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

3) ఘన పదార్థాలు:
పిరమిడ్ లో పెట్టే ఏ ఘన పదార్థమైనా ఉత్తర, దక్షిణ దిశలుగా ఉంచడం మంచిది. పిరమిడ్ లో ఉంచిన ఆహారం ఎన్ని రోజులయినా చెడిపోదు. సపోటా, ద్రాక్ష మొదలైనవి నీటిని కోల్పోయినా వాటి రుచి చెడక, పైగా అవి మరింత రుచి పెరుగుతాయి. కానీ పదార్ధాలు బరువును కోల్పోతాయి.
4) బ్లేడును గడ్డం గీచుకున్న పిదప పిరమిడ్ లో ఉంచినట్లయితే ఎక్కువ సార్లు వుపయోగించవచ్చును.
5) బ్యాటరీలను పిరమిడ్ లో పెట్టి త్వరగా రీ - చార్జి చేయవచ్చును.
6) పిరమిడ్ లో కూర్చోవడం వల్ల తెలివితేటలు, చురుకుదనం పెరుగుతాయి.
7) పిరమిడ్ లో నిద్రించడం వల్ల ఆయుష్షు వృద్ధి చెందుతుంది.
8) దీనిని ఆఫీసులో వుంచితే ప్రశాంత స్థితి చేకూరడమే కాక సక్రమమైన నిర్ణయాలను తీసుకొని అమలు చేయవచ్చు.
9) దీంతో వాస్తు దోషాలను సరిచేయవచ్చు. (వాసన దోషాలు సరి చేయలేము)
10) ఇది సాధ్యమైన, న్యాయమైన కోరికలను తీరుస్తుంది. (సంకల్ప శక్తితో)

ఏదైనా ప్రదేశంలో పిరమిడ్ ను స్థిరంగా వుంచినట్లయితే, అందులోంచి శక్తి ప్రవాహంలా పొంగి ఆ ప్రదేశం మొత్తం వ్యాపించి, గాలిని శుభ్రపరచి, క్రిముల్ని సంహరించి, ఆ ప్రదేశంలో నివసించే వారి ఆరోగ్యాలను సంరక్షించడమే కాక వారి ఆలోచనల్ని పదును పెట్టి, ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. ఆ ప్రదేశం మొత్తం శక్తి కేంద్రంగా పరిణమిస్తుంది.

✳ పిరమిడ్ - ధ్యానం :
ధ్యానం చేయడానికి పరిశుద్ధ పర్యావరణం, నిశ్శబ్ద వాతావరణం అవసరం. అవి పిరమిడ్ లో చక్కగా లభ్యమవుతాయి. పిరమిడ్ లో శిఖరానికి సరిగ్గా కింద నుండి 1/3 వంతు ఎత్తున కింగ్స్ చాంబర్ పై కూర్చోని ధ్యానం చేస్తే త్వరితగతిలో ఏకాగ్రత కుదురుతుంది. మరియు మరిన్ని రెట్లు శక్తిని గ్రహించవచ్చు. ఉత్తర దిశగా కూర్చుని ధ్యానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించవచ్చు.

పిరమిడ్ లో కూర్చుని ధ్యానం చేస్తున్న అందరి అనుభవాలు ఒకే తీరున ఉండవు. వాటిలో కొన్ని--
➡ మానసికమైన అలజడి, ఒత్తిడి నశించడం
➡ కొందరికి పూర్వజన్మ స్మృతులు కలగడం
➡ ఉన్నతమైన శక్తి కలగడం
➡ జ్ఞాపకశక్తి వృద్ధి చెందటం
➡ వింత దృశ్యాలు, కలలు
➡ సంగీత సంకేతాలను చూడడం
➡ ఉన్నత లోకాల నుండి జ్ఞానం పొందడం
➡ టెలిపతి శక్తిని గ్రహించడం
➡ ప్రణవ మంత్రాన్ని, ఇతర మంత్రాలను వినడం
➡ విశాల దృక్పథం అలవడటం
➡ ప్రశాంత చిత్తం కలగడం
➡ అలౌకిక ఆనందం కలగడం
➡ గ్రహాల మధ్య ప్రయాణ అనుభూతి
➡ సూక్ష్మ శరీరం త్వరగా విడివడి సూక్ష్మ లోక యాత్రలు చేయడం
➡ ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడం
➡ శరీరం చాలా తేలికగా అన్పించడం

పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల ప్రశాంత స్థితి, ఇతరులు పట్ల సహన భావం, చురుగ్గా వ్యవహరించడం లాంటివి అందరికీ లభ్యమయ్యే ప్రయోజనాలు. ముఖ్యంగా గుర్తుంచుకోవలసినది ఏమిటంటే నిత్యం ధ్యానం జరిగితేనే ఆ పిరమిడ్ శక్తి త్రిగుణీకృతం అవుతుందని.

భవిష్యత్తులో మానవకోటికి ప్రాణశక్తిని అందించేందుకు జీవన ప్రమాణాన్ని పెంచేందుకు ధ్యానకేంద్రాలు, స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు, నర్సింగ్ హెూంలు, షాపింగ్ కాంప్లెక్స్ లు, క్యాంటీనులు, హెూటళ్లు మొదలైన వాటిలోనే కాక ప్రతి అంశంలోను పిరమిడ్ శక్తి దోహదపడుతుందనడంలో సందేహం లేదు.

ఇక భవిష్యత్తులో శక్తి ఔషధాలకు ప్రతీక పిరమిడ్ మాత్రమే కాగలదు.

No comments:

Post a Comment