Saturday, March 7, 2020

శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలో కౌసల్యా సుప్రజారామా అంటూ శ్రీరాముని గురించి ఎందుకు వస్తుంది?

ధర్మసందేహం-సమాధానం

సందేహం:- శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలో కౌసల్యా సుప్రజారామా అంటూ శ్రీరాముని గురించి ఎందుకు వస్తుంది? దీని లోని అంతరార్థం ఏమిటి?

సమాధానం:- శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలోని మొదటి శ్లోకం కౌసల్యా సుప్రజారామ వాల్మీకి రామాయణ శ్లోకం. తన యాగ సంరక్షణ నిమిత్తం శ్రీరాముణ్ణి వెంట తెచ్చుకున్న విశ్వామిత్ర మహర్షి ఆయనను నిద్ర మేల్కొలిపిన సంధర్భంలోని శ్లోకం ఇది.

ఇక వేంకటేశ్వర సుప్రభాతంలోని రెండో శ్లోకం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద అంటూ శ్రీకృష్ణుని మేలొలుపుతుంది.

ఇరవై నాలుగవ శ్లోకం మీనాకృతే దశావతార స్వరూపుడైన శ్రీవేంకటా చలపతిని మేల్కొలుపుతుంది.

శ్రీవేంకటేశ్వరుడే మహావిష్ణువు అని అర్థం. ఆ మహావిష్ణువు ఎత్తిన పది అవతారాల సమాహార స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు.

శ్రీవాల్మీకి రామాయణంలోని మొదటి శ్లోకం మానిషాద ప్రతిష్ఠాంత్వ లో శ్రీరాముడే శ్రీనివాసుడుగా పెద్దలు నిరూపించారు.

తిరుమల కలియుగ వైకుంఠం. తిరుమల వాసుడైన శ్రీనివాసుడు సాక్షాత్తూ వైకుంఠవాస శ్రీమన్నారాయణుడే.

==============================

No comments:

Post a Comment