Sunday, March 8, 2020

ఆధ్యాత్మిక పరిపక్వత

ఆధ్యాత్మిక పరిపక్వత

🌷1. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
మీరు ఇతరులను మార్చాలనే ప్రయత్నం మాని మీరు మారడంపై దృష్టి పెట్టడం .

🌷2. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
మీరు ప్రజలను వారు ఉన్నవిధంగా అంగీకరించడం .

🌷3. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
ప్రతిఒక్కరు చేసేది వారి స్వంత దృష్టికోణంలో సరియైనదేనని భావించడాన్ని నేర్చుకోవడం .

🌷4. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
మీరు జరుగనున్నది సంఘర్షణ పడక జరగనివ్వడాన్ని నేర్చుకోవడం .

🌷5. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
మీరు ఇతరులతో సంబంధాలు నెరిపేటప్పుడు , వారినుండి ఏమీ ఆశించకుండా , మీరు ఇవ్వడం నేర్చు కోవడం .

🌷6. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
మీరు చేసే పనులన్నీ మీ స్వీయ శాంతి కొరకే అని అర్ధం చేసుకోవడం .

🌷7. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
మీరు ప్రపంచానికి తెలివైనవారిగా నిరూపించే ప్రయత్నాలను మాని వేయడం .

🌷8. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
ఇతరులు నీచర్యలను సర్వత్రా ఆమోదించాలని ఆశించకూడదని నేర్చుకోవడం .

🌷9. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
మీరు ఇతరులతో పోల్చుకోవడాన్ని మాని వేయడం .

🌷10. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే మీ అంతరంగంతో మీరు శాంతితో మనుగడ సాగించడం .

🌷11. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
మీరు "అవసరానికి" మరియు “కోరికలకు " ​​మధ్య బేధమెరిగి ఉండి ,మీ “కోరికలను వదలివేయడం .

🌷12. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
మీరు భౌతిక విషయాలలోని సంతోషంతో అనుబంధాన్ని వదలి వేయడం .🙏

No comments:

Post a Comment