Monday, April 6, 2020

మన జన్మ రహస్యం -1


🧘‍♀ మన జన్మ రహస్యం -1

🌹 బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ గారి సందేశము

▪మన ఆత్మ జన్మని, మనమే ఎంపిక చేసుకొని మనమే స్వయం నిర్ణయంతో వచ్చాము

▪భూమ్మీద జన్మకి తీసుకోవాలంటే శరీరం అవసరం కాబట్టి ఇవ్వగలిగే తల్లిదండ్రులు మాత్రమే ఎంపిక చేసుకున్నాము

▪ఏ ప్రదేశంలో జన్మించాలి. అనేది మనమే నిర్ణయం నిర్ణయం తీసుకున్నాము

▪మన భర్త లేక భార్య పిల్లలు బంధువులు స్నేహితులు ప్రతి ఒక్కరినీ మనమే ఎంపిక చేసుకుని భూమ్మీద జన్మ తీసుకొని ఉన్నాము.

▪మన సమస్యలు అన్నీ మనమే ఎంపిక చేసుకున్నాము

▪మన రోగాలన్నీ కూడా మనమే మనమే ఎంపిక చేసుకున్నాము

▪మనలో ఉన్న అన్ని రకాల భయాలు కూడా మనమే ఎంపిక చేసుకుని వచ్చాము

▪ఈ భయాలన్నీ కూడా తీసుకొని, ఆ భయాలను కలిగించే వ్యక్తులను ఎంపిక చేసుకుని, అనుభవించి అధిగమించడం ఈ భూమ్మీద నేర్చుకుంటాం

▪భయాలతో వస్తాము భయాలు అధిగమించి నవ్వుతూ వెళ్తాము.

▪మన భయాల్ని మనము ఎంపిక చేసుకుని తెచ్చుకున్నవే కానీ ఇతరుల వల్ల కలిగేవి కాదు. మీలో ఎలాంటి భయం అయినా మీ ఎంపికే. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు

▪ఈ భూమ్మీద ప్రతిదీ వృత్తి , ఉద్యోగం, వ్యాపారం, సేవ సర్వము మన ఎంపిక మాత్రమే

▪చివరికి ఎప్పుడు ఎక్కడ మనము భూమి మీద నుంచి నిష్క్రమించాలీ అనేది కూడా మన ఎంపికే

▪ఈ విషయాలు సాధన చేసి ఎవరికి వాళ్లు అనుభవాన్ని పొందాలి భౌతికంగా నిరూపితం కాదు.

▪ఓకే మిత్రులారా ఇంకెందుకు ఆలస్యం! సాధన చేయండి జన్మ రహస్యం తెలుసుకోండి

No comments:

Post a Comment