Monday, April 13, 2020

ఒక వ్యక్తిలోని మంచిని చూడాలి కానీ లోపాలను పెద్దవి చేయకూడదు

సింహపురి అనే రాజ్యాన్ని సిద్ధార్థుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు
ఆ రాజుకి ఒక కన్ను ఒక కాలు మాత్రమే ఉండేది కానీ చాలా తెలివైనవాడు అంత కంటే ఎక్కువ దయకలిగిన వాడు
అతని పరిపాలనలో ప్రజలంతా ఎంతో ఆరోగ్యంగాను సంతోషంగానూ జీవిస్తూ వచ్చారు .

ఒకరోజు సంధ్యా సమయాన రాజ్యంలో అలా నడుస్తుండగా అక్కడ రాజు తన పూర్వీకుల చిత్రపటాలను చూసాడు
భవిష్యత్తులో తన పిల్లలు కూడా ఇలా ఇక్కడ తిరిగే సమయాన ఈ చిత్రపటాలను చూసి వారి పూర్వికులగురించి తెలుసుకుంటారు కానీ అక్కడ తన చిత్రం లేకపోవడం కాస్త బాధ అని పించింది
తన అంగవైకల్యం కారణంగా రాజు ఎలాంటి అభిప్రాయాలు వస్తాయో అని కానీ చివరికి ఒక చాటింపు వేయించాడు

ఎవరైనా వచ్చి తన చిత్రపటాన్ని అందంగా గీయాలని
ఎంతో మంది చిత్రకారులు వచ్చారుకానీ రాజు అవిటితనాన్ని ఎలా అందంగా రూపం ఇవ్వగలం అది చూసి రాజుకు కోపం వస్తే ఎవరు బలిఅయ్యేవాళ్ళమని

వారి వల్ల కాదని వెనుతిరిగారు
కానీ ఒక్క కళాకారుడు మాత్రం నేను గీయగలను అని ముందుకు వచ్చాడు
ఆ చిత్రపటం కోసం రాజు తో పాటు మిగిలిన కళాకారులు సైతం ఎదురుచూడసాగారు

సుదీర్ఘ కాలం తరువాత చిత్రపటం పూర్తయింది
ఆ పటం చూడగానే రాజు మిగిలిన చిత్రకారులు చాల ఆశ్చర్యపోయారు

రాజు గారి అవిటితనాన్ని ఎంత అందంగా దాచాడంటే ఆ చిత్రకారుడు
రాజు గారు గుర్రం పైన కూర్చుని ఒక కాలు కనిపిస్తూ విల్లు ఎక్కుపెట్టి ఒక కన్ను మూసినట్టుగా చూపెట్టాడు
రాజు గారు చాల సంతోషించి పెద్ద బహుమతిని అతని ఇచ్చాడు

నీతి: మనం ఎప్పుడు మంచి ఆలోచనలే కలిగివుండాలి
ఒక వ్యక్తిలోని మంచిని చూడాలి కానీ లోపాలను పెద్దవి చేయకూడదు
ఎటువంటి పరిస్థితిలోనైనా మనవల్ల కాదు అని నిరాశపడకుండా ఏదైనా సాధించగలం అనే ఆశ నింపుకుంటే చాలు ఏ సమస్యకైనా పరిష్కారం సులభం.

No comments:

Post a Comment