Tuesday, April 21, 2020

(చరిత్రలో మిస్టరీ-) కుంభమేళా నాగస్వాములు ఎక్కడ..?

(చరిత్రలో మిస్టరీ-)
కుంభమేళా నాగస్వాములు ఎక్కడ..?
◆ సూక్ష్మ శరీరయానం సాధ్యమేనా..?
◆ నానో టెక్నాలజీ పరిశోధనలు
◆ లక్షల కోట్లు ఖర్చు.!
◆ భారత్ లో వేలాది ఏళ్ళ క్రితమే



కుంభమేళాలో లక్షలాది మంది 'దిగంబర నాగ సాధువులు' ఊహించని రీతిలో వస్తారు. మామూలు రోజుల్లో ఈ సాధువులు ఎవరికీ కనిపించరు. ఎందుకు కనిపించరు.? వీరు ఎక్కడ ఉంటారు.? వీరికి అతీంద్రియ శక్తులు ఉన్నాయా..?సాంకేతికంగా అభివృద్ధి చెంది... ప్రతి అడుగు కెమెరాలలో బంధించే మనిషికి 'దిగంబర నాగసాధువు'ల జాడ కనిపెట్టే శక్తి లేదా..? చరిత్రలో మిస్టరీగా మిగిలిపోతున్న ఈ దిగంబర నాగస్వాములు హఠాత్తుగా రావటం.. అంతే హఠాత్తుగా వెళ్ళటం..పై నేటి మిస్టరీ కథనం 'ఆదాబ్ హైదరాబాద్' అందిస్తుంది.

కుంభమేళా అంటే..:
సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు ఏళ్ళకు ఒకసారి. అర్ధ కుంభమేళా ప్రతి ఆరేళ్ళకు ఒకసారి. పూర్ణ కుంభ మేళా అనేది ప్రతి పన్నెండు ఏళ్ళకు ఒకసారి. పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు ఏళ్ళకు మహా కుంభమేళా ఒకసారి జరుగుతుంది.

ఎక్కడ.. ఏవిధంగా..?:
సూర్యుడు, బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు నాసిక్ లోని త్రయంబకేశ్వర్ లో కుంభమేళా. సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లో... బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ లోను... బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను ఈ కుంభమేళాలలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్థలంలోను కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది.

లక్షలాదిమంది...:
ఈ కుంభమేళాలలో బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో, నదీ తీరాల్లో ఈ దిగంబరులు లక్షల్లో ఉంటారు. మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. మైనస్ డిగ్రీలలో ఏ జీవకణం ప్రాణంతో ఉండదని మనం చదువుకున్న సైన్స్ చెపుతుంది. మైనస్ డిగ్రీలతో ఉండే ఈ హిమాలయాలు కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ పరమ పవిత్ర దైవ కార్యక్రమానికి లక్షలాది మంది నాగసాధువులు రావటం మనం ప్రసార మాధ్యమాలలో చూస్తాం. సూక్ష్మ శరీరయానం (నానో టెక్నాలజీ)తో ఇలా ఒక ప్రాతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడం సాధ్యం.

హఠాత్తుగా.. కనిపించకుండా... ఎలా..?:
కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే... వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా 'ట్రాఫిక్ జామ్' అవ్వాలి కదా.! ఇప్పటి దాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా? ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు ఉంటాయి. ఎక్కడైనా, ఏ ఫోటోగ్రాఫర్ కు అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు కన్పించారా? ఎక్కడైనా ఇంతమంది ప్రత్యేక విమానాల్లో, ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కన్పించాయా? లేదే? సరిగ్గా అందరూ ఒకేసారి, కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్ష మవుతారు? కుంభ మేళా ముగిశాక... తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కన్పించి హఠాత్తుగా ఎలా మాయం అయిపోతారు? కుంభమేళా జరిగే ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కన్పించదు..?

ఈ మర్మం ఛేదించే పరిశోధనలు..?:
ఈ ప్రక్రియను సూక్ష్మ శరీర యానం అంటారు. అదే సాంకేతిక పరిబాషలో 'నానో టెక్నాలజీ' అంటారు. నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం. ఈరోజు సైన్స్ పురోగతి సాధిస్తున్న అంశాల్లో నానో టెక్నాలజీ బాగా ప్రాచుర్యం పొందుతోంది. దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దురదృష్టం ఏమిటీ అంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల ఏళ్ళ నాడే మన భారతదేశంలో ఉంది. ఇప్పటికీ ఉంది. మైనస్ డిగ్రీలలో ఏ జీవకణం బతకదని సైన్స్ చెపుతోంది. మరి అంతకంటే మైనస్ డిగ్రీలతో ఉండే హిమాలయాల్లో... నాగస్వాముల రూపంలో... సజీవంగా సాక్ష్యంగా నిలువెత్తు నిదర్శనం మన ఎదుటే ఉంది. మన ఋషులు, యోగులు, సాధువులు కొన్ని వేల ఏళ్ళ క్రితమే సూక్ష్మ శరీరయానం (నానో టెక్నాలజీ) గురించి చెప్పారు. మనం పుస్తకాల్లో చదువుకున్న 'తపస్సు'నే ఇప్పుడు 'ధ్యానం' అంటున్నారు. ఈ ధ్యానం ద్వారా అమోఘమైన సిద్ధులు సంప్రాప్తిస్తాయి. అందులో ఒకటి సూక్ష్మ శరీరయానం. దీన్ని నానో టెక్నాలజీలో 'అడ్వాన్స్డ్ స్టేజ్' గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేస్తున్న పరిశోధనల లక్ష్యం కూడా అదే. మన ఋషులు, యోగులు కోరుకున్నదే తడవుగా కోరుకున్న చోటికి ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పటి హేతువాదులు దాన్ని నమ్మటానికి సిద్ధంగా లేరు. వారికి 'లాజిక్' నమ్మకంగా దొరికితే సైన్స్. దొరకపోతే మూఢనమ్మకం.


భారతంలో..:
మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం. దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగినప్పుడు, మాన సంరక్షణ కోసం ద్రౌపది శ్రీ కృష్ణుడిని ప్రార్ధిస్తుంది. ఎక్కడో ద్వారకలో ఉన్న కృష్ణుడు తక్షణం అక్కడ ప్రత్యక్షమై... అందరూ కళ్ళప్పగించి చూస్తున్న ద్రౌపదిని ద్రౌపదిలాగే ఉంచుతాడు. దానికి కృష్ణుడు ఎంచుకున్న ప్రయాణ సాధనం 'నానో టేక్నాలజీ'యే. త్రిలోక సంచారి అయిన నారదుడు నిత్యం 'నానో టెక్నాలజీ' ద్వారానే ప్రయాణించే వాడని చెప్పవచ్చు.✍

No comments:

Post a Comment