Monday, April 20, 2020

పాప పుణ్యాలు


ఒక శరీరంతో చేసిిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు. ఒకరు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా పూర్వ జన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. అతడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా, పూర్వ జన్మలో చేసిిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూంటాడు. ఇదే పునర్జన్మలున్నాయన్న దాన్ని తెలుపుతుంది.

జీవుడు తన జీవ పరిణామదశలో అనేక జన్మలెత్తుతూ ఉంటాడు. మానవ జన్మలలో స్త్రీగాను, పురుషునిగాను జన్మిస్తుంటాడు. ఇక జంతు జన్మల్లో పశు పక్ష్యాది జన్మలు కూడా ఎత్తవచ్చును. కర్మ ఫలితాలను బట్ట్టి చర్యకు ప్రతిచర్యగా ఈ జన్మలు ఏర్పడుతుంటాయి. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే కిందటి జన్మ యాక్షన్‌కు రియాక్షనే ఈ జన్మ. స్త్రీ జన్మ ఎ త్తితే వారికి సంబంధించిన ధర్మాలు, పురుషునిగా జన్మిస్తే ఆ ధర్మాలు ఆచరించాల్సి ఉంటుంది. ఈ రెండు వర్గాల వారికి శారీరక ధర్మా లు కూడా వేరుగా ఉంటాయి. పునర్జన్మ అంటే సూక్ష్మ శరీరం కొనసాగుతూ స్థూల శరీరాన్ని మరల మరల తెచ్చుకోవడం. పునరపి జననం పునరపి మరణం అనగా మళ్ళీ మళ్ళీ పుట్ట్టడం, మళ్లిd మళ్ళీ మరణించడం. పుణ్య కర్మల వల్ల్ల సుఖాలు, పాపాల ఫలితంగా దు:ఖాలు వస్తాయన్న విషయం తెలిసిందే. అయితే అందుకు విరుద్ధంగా పుణ్యం చేసేవారికి బాధలు, పాపాలు చేసే వారికి సుఖాలు కలగడం అక్కడక్కడ చూస్త్తుంటాం. పుట్టుకతో అంధుడైన వ్యక్తి, ఆగర్భ శ్రీమంతునిగా జన్మించిన వ్యక్తి ఆ జన్మలో ఎప్పుడు పుణ్యంగాని, పాపంగాని చేసి ఉండదు కదా అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం చెప్పేదే పునర్జన్మ సిద్ధాంతం. పూర్వ జన్మ కృతం పాపం వ్యధి రూపేణ, పూర్వ జన్మ కృతం పుణ్యం భోగరూపేణ అంటారు. అంటే పూర్వ జన్మలో చేసిిన పాపం రోగ రూపంలోను, గత జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో సుఖాలకు కారణమవుతుందని దీని అర్థం. ఒక శరీరంతో చేసిిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు. ఒకరు ఈ జన్మలో ఎన్ని పాపాలు చసినా పూర్వ జన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్త్తూఉంటాడు. అతడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా, పూర్వ జన్మలో చేసిిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూంటాడు. ఇదే పునర్జన్మలున్నాయన్న దాన్ని తెలుపుతుంది.
పురాణ తిహాసాల్లోను పునర్జన్మల ప్రస్తావన ఉంది. అర్జునుడు కన్నప్పగాను, భీముడు మధ్వాచార్యులుగాను జన్మించారని చెప్పేవారున్నారు. గజేంద్ర మోక్షం లోని గజేంద్రుడు గత జన్మలో ఒక మహారాజు. 3,4 సంవత్సరాల వయస్సు పిల్లలు పూర్వ జన్మ విషయాలను వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. షిిరిడీ సాయి బాబా ఒక చోట పాము – కప్పల వైరాన్ని వారి పూర్వ జన్మకు సంబంధించినదిగా పేర్కొ నడం, రెండు బల్లులు కలిసినప్పుడు అవి గత జన్మలో అక్కా చెల్లెళ్లు అని చెప్పడం గమనార్హం. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం తెలిసిన వాడు రాబోయే జన్మలలో మరింత సుఖ భోగాలుం డేలాగున అనేక పుణ్య కార్యాలు చేయవచ్చును. మనం చేసే ప్రతి పనిలోని (కర్మ) స్పంద నలు వాయు మండలంలో నిక్షిప్తమవుతాయి. వాయు మండలంలో బాధామయ స్పందనలు, ఆనందమయ స్పందనలు జనిస్తాయి. దుష్కర్మల వల్ల్ల బాధలు జనిస్తాయి. ఈ రకంగా కర్మ ఫలితం చర్యకు ప్రతిచర్య రూపం దాలుస్తుంది. క్షమాగుణం కలిగిన వారు కర్మ చక్రాన్ని ఆపగల శక్తి కలిగి ఉంటారు. పుణ్య కర్మల చేత దేవతలుగా, మిశ్రమ కర్మలచేత మానవులుగా, పాప కర్మల చేత పశు పక్షి క్రిమి కీటకాదులుగా పుట్ట్ట డం జరుగుతూంటుందనేది స్థూలంగా కర్మ సిద్ధాంతం. కర్మ వల్ల్లనే పుట్ట్టడం, పెరగడం, మరణించడం జరుగుతోంది. కర్మయే ఈ సృష్టికి కారణమని తెలుస్తోంది. పుణ్యకర్మలు చేసిన వారు దైవ గుణాలు, పాప కర్మలు చేసే వారు ఆసురీ గుణాలు కలిగి ఉంటారు. మానవుడు పూర్వ జన్మల్లో చేసిన కర్మలు వ్యర్థం కావు. దైవ గుణాలు సంసార బంధం నుంచి విడుదలకు హేతువు అవుతాయి. ఆసురీ గుణాలు జనన మరణాలకు కారణమైన కర్మ బంధాన్ని పటిష్టం చేస్త్తుంటాయి. ఒక జన్మలో ఒకరు ఒక విషయంలోపొందిన శిక్షణ మరు జన్మలో అతని గుణంగా రూపాంతరం చెందుతుంది.
ఆసురీ గుణాలు
కామం…
అన్ని రకాల దేహేంద్రియ భోగ సంబంధమైన కోరికలను కామం అంటారు.
క్రోధం…
క్రోధం అంటే కోపం. దీని వల్ల్ల మనిషిి గొప్పతనం సన్నగిల్లుతుంది. బ్రతుకు దుర్భరమవుతుంది. విపరీతమైన కోపం వచ్చిన వానికి పిచ్చి వానికి తేడా ఉండదు. ఆరోగ్యం క్షీణిస్తుంది.
లోభం…
లోభం కలవాడు తనకు ఉన్న దానిని ఎవ్వరికీ ఇవ్వడానికి ఇష్టపడడు, అనగా అతనికి దాన గుణం ఉండదు.
మోహం…
మోహం అంటే పుత్ర మిత్ర కళత్రాదులందు, ధన ధాన్య వస్తు వాహనాదుల పట్ల మిక్కుటమైన ప్రేమ. యుక్తాయుక్తాలు ఎరుగని చిత్త వృత్తి.
మదం…
ఇది ఎనిమిది విధాలు. అవి కలం, బలం, ధనం, రూపం, ¸°వ్వనం, విద్య, రాజ్యం, తపస్సు.
మాత్సర్యం…
ఎందులోనైనా తన కంటె ఇతరులు ఎక్కువగా ఉండటాన్ని ఓర్వలేక పోవటమే మత్సరం.
రాగము…
ఎదుట వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇతరులపై కలిగే ఇష్టం రాగం.
ద్వేషం…
ఒకరు తనకు అపకారం చేశారని మరల వారికి అపకారం చేయాలనే చిత్త వృత్తి.
ఈర్ష్య…
తనకు మాత్రమే కష్టాలు కలుగుతున్నాయని, ఇతరులకు ఎందుకు కలగటంలేదని వారిపై ఏర్పడే కోపమే ఈర్ష్య.
అసూయ…
తనకు మాత్రమే సుఖం కలగాలని ఇతరులకు ఆ సుఖం రాకూడదనే చిత్తవృత్తి.
దంభము…
తను చేసే పనులను ఇతరులు మెచ్చుకోవాలనే చిత్తవృత్తిని దంభము అంటారు.
దర్పం…
నేను సర్వ విషయాల్లో సమర్థుడనని తనకు సాటి అయిన వాడు ఎక్కడా లేడని భావించే చిత్తవృత్తి (అదే గర్వం)
అహంకారం…
అకారణంగా ఇతరులను శిక్షించాలనే తమో గుణాన్ని చిత్తవృత్తి గలవారిని అహంకారులు అంటారు
ఆసురీ గుణాల్ని తొలగించేందుకు సాధన చేయాలి. అప్పుడు ఆ అజ్ఞానం వీడుతుంది. సాధనలకు గురువు సహకారం అవసరం. శాస్త్రాలు కూడా ఏది చేయాలో, ఏది చేయకూడదో నిర్దేశించాయి. ఇక్కడ శాస్త్త్ర ఆదేశానుసారం కర్మ చేయాలి.

Source: whatsapp message

No comments:

Post a Comment