Monday, June 14, 2021

మంచి మాట...లు

శుక్రః%
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం ।
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ॥🙏

లక్ష్మీ శ్లోకః%
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం ।
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం ।
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం ।
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ॥🙏
ఆత్మీయ బంధుమిత్రులకు భృగు వారపు (శుక్రవారం) శుభోదయ శుభాకాంక్షలు💐 మీకు మీ కుటుంబసభ్యులకు లక్ష్మి పద్మావతి గాయత్రీ సావిత్రి సరస్వతి దుర్గా అమ్మవార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ....

శుక్రవారం --: 11-06-2021 :--
ఈ రోజు AVB మంచి మాట...లు

మంచి మనసున్న మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా , ఆనందంగా ఉండాలని నేను మీ అందరిని మనసారా కొరుకుంటూ .

ఉత్త చేతులతో తల్లి గర్బం నుండి మనం వచ్చాం . కాళీ చేతులతో మనం భూమిలో కలుస్తాం మనకు తొలి స్నానం గుర్తులేదు చివరి స్నానం కూడా తెలియదు అందుకే తొలి చివరి స్నానం కు మధ్యలో పది మందికి సహాయం చేసిపోదాం .

మిమ్మల్ని తిడుతూ ప్రేమించే వాళ్ళని ద్వేషించకండి వారే మీకు అసలైనవారు ప్రేమించే వారికే దండించే అధికారం ఉంటుంది వారి ప్రతి హెచ్చరికలో మీ పైన ప్రేమ ఉంటుంది . జీవితం ఎప్పుడూ సవాళ్ళనే విసురుతుంది దానిని ఎదుర్కొని నిలిచినాడే విజేత అవుతాడు .

సమయం ఆరోగ్యం బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు అవి కోల్పోయినప్పుడు వాటి విలువ తెలిసేది అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి బంధాన్ని నిలబెట్టుకోవాలి .

సేకరణ ✒️ మీ ఆత్మీయ బంధువు.. AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

No comments:

Post a Comment