నేటి జీవిత సత్యం.
పూర్వం ఒక దేశంలో కరువొచ్చింది. తినడానికి కూడా ఏమీ దొరకని రోజులు దాపురించాయి. ఆకలికి ప్రాణం పోయే పరిస్థితిలో ఒక పండితుడు దారివెంట నడుస్తున్నాడు. అదే దారిలో ఓ రాయిపై కూర్చొని శనగలు తింటున్న బాటసారిని గమనించాడు. ‘ఆకలితో ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మీరు తినేదాంట్లో నాకు కొంత ఇస్తారా’ అని అడిగాడు.
‘ఇవి తప్ప నా దగ్గర వేరే ఏమీ లేవు. చూస్తే పండితుడిలా ఉన్నారు. ఎంగిలివి ఎలా పెట్టను?’ అన్నాడు బాటసారి.
‘ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంగిలివి తిన్నా తప్పులేదు’ అన్నాడు పండితుడు. బాటసారి తన దగ్గర ఉన్న శనగల్లోంచి కొన్ని అతనికి ఇచ్చాడు. పండితుడు అందులో కొన్ని మాత్రమే తిన్నాడు.
‘నా ఆకలి కాస్త తగ్గింది. ఇంట్లో నా భార్య ఆకలితో చనిపోయేలా ఉంది. ఇవి ఇస్తే తన ప్రాణం కూడా నిలబడుతుంది’ అన్నాడు పండితుడు.
‘ఎండిపోయిన శనగలు అంత తేలిగ్గా గొంతు దిగవు’ అని చెప్తూ తాగమని పండితుడికి నీళ్లు ఇచ్చాడు.
‘ఎంగిలి నీళ్లు కదా వద్దులే!’ అన్నాడు పండితుడు.
‘ఇందాక తిన్న శనగలు ఎంగిలివే కదా!’ ఆశ్చర్యంగా అడిగాడు.
‘శనగలు తినకముందున్న స్థితి ఇప్పుడు లేదు. ప్రాణం కాస్త కుదుటపడింది’ అని అతనికి కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయాడు.
‘ఆత్మశుద్ధిలేని ఆచారమదియేల?’ అన్నారు వేమన. అది నిజమే అయినా దానికీ మినహాయింపు ఉంటుందని ధర్మశాస్త్రం చెప్తున్నది. ఆకలితో ప్రాణం పోయే పరిస్థితి ఉన్నప్పుడు అంటు, ఎంగిలి అని చూడకుండా ఏది దొరికితే అది తిని ప్రాణం కాపాడుకోవాలని శాస్త్రం చెప్తున్నది. అభిమానంతో ఎవరైనా, ఏదైనా పెడితే ఎంగిలి అని నిరాకరించొద్దని కూడా శాస్త్ర వచనం. శబరి ఎంతో అభిమానంతో ఇచ్చిన ఎంగిలిపండ్లను రాముడు తిన్నాడు కదా! శబరికి మోక్షం ప్రసాదించాడు. ధర్మం కోసం ఏది చేసినా అది ధర్మమే. ధర్మాన్ని విస్మరిస్తే పాపమవుతుంది. పండితుడు శనగలను తీసుకువెళ్లి తన భార్యకు ఇచ్చాడు. అప్పటికే ఆమె ఊరంతా తిరిగి కొంత భిక్ష తెచ్చింది. ఉన్నదాంట్లో భర్తకు కొంచెం పెట్టి తాను కొంచెం తిన్నది. భర్త తెచ్చిన శనగలను దాచిపెట్టింది.
మరుసటి రోజు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు కరువు నుంచి బయటపడటానికి యజ్ఞం తలపెట్టాడు. అక్కడికి వెళ్లి తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తే ఎంతో కొంత గిట్టుబాటవుతుందని భావించాడు ఆ పండితుడు. కానీ, అక్కడిదాకా వెళ్లడానికి శక్తిలేదు. పండితుడి భార్య అంతకుముందురోజు దాచిన శనగలను ఇచ్చింది. దారిలో అవి తిని రాజు దగ్గరికి వెళ్లాడు. పండితుడి విద్వత్తును గుర్తించిన రాజు అతణ్ని సత్కరించి, కొంత ధనం ఇచ్చి పంపించాడు. ఆయన అన్ని సమస్యల నుంచి బయటపడ్డాడు. జీవితం గాడినపడింది. సంతోషంగా జీవించసాగాడు.
ఆచార వ్యవహారాలు జీవితాన్ని ఉన్నతమార్గం వైపు నడిపించాలి. అంతేకానీ, మూఢంగా పాటించడానికి కాదు. చేపలు, కప్పలు ఎంగిలి చేశాయని గంగాజలంతో అభిషేకం మానుకుంటామా? తుమ్మెదలు ఎంగిలి చేశాయని పూలను పరమాత్మకు సమర్పించకుండా ఉంటామా? విశ్వాసాలు జీవితాన్ని తీర్చిదిద్దాలే కానీ, పాతాళానికి కూలదోసేవిగా ఉండకూడదు. అందుకే, గుడ్డి ఆచారాలు పాటించొద్దని శాస్త్రమే సెలవిచ్చింది. భుక్తి లేకపోతే ముక్తి లేదు అన్నది శాస్త్రవచనమే. అలాగే ప్రాణావసరానికి ఎంత కావాలో అంతే తినాలి. ఆకలిగా ఉన్నప్పుడు ఆబగా తినకుండా మనపై ఆధారపడినవారి గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉండాలని ఈ కథ మనకు చెప్తున్న మరో నీతి. ధర్మంగా ఆలోచించాడు కాబట్టే ఆ పండితుడు ఎంగిలి గురించి పట్టించుకోలేదు. ఆ ఆహారం ఆసరాతోనే కష్టాల నుంచి బయటపడ్డాడు. ధర్మపరుడు చేయాల్సింది ఇదే కదా!
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment