Wednesday, June 7, 2023

 *దేవుడు ఎక్కడున్నాడో తెలుసా*
             

  *అందమైన   జీవితం  అందరికీ ఉండదు ..     కానీ మనస్ఫూర్తిగా అభిమానం పంచే వాళ్ళుంటే ఆ లోటు తెలియదు.*

* భార్య అలక తీర్చే భర్త , భర్త అలసట అర్థం చేసుకొనే భార్య, ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకొని ముందుకు సాగిపోయే బంధమే..వివాహ బంధం!*

 *మనిషి    ఏదైనా నమ్మితే పూర్తిగా నమ్మాలి , "లేదా" పూర్తిగా నమ్మకుండా ఉండాలి . అంతేగానీ సగం సగం నమ్మకాలు ఎప్పుడూ ప్రమాదమే.*

*మనిషికి ఆశ ఎక్కువ .. నచ్చిన ప్రతీదీ కావాలంటుంది మనసు. కానీ కాలం ఎవరికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తుంది.* 

*మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది. ధనవంతుడు.. ఎ సి బోగీలో వెళ్తాడు , మధ్యతరగతి వాడు స్లీపర్ క్లాస్ బోగీలో వెళ్తాడు , పేదవాడు సాధారణ బోగీలో వెళ్తాడు.*

*కానీ ఎలా ప్రయాణం చేసి వెళ్ళినా అందరూ చేరవలసిన గమ్యానికే చేరతారు . అందరూ దిగేది ఒక ప్లాట్ ఫాం మీదకే . రైలు ఎక్కి ప్రయాణం చేస్తున్నంత వరకే ఈ తేడాలు.*

*అలాగే జీవితం కూడా అంతే .  ఈ శరీరంలో ప్రాణం ఉన్నంతవరకే  ఈ తేడాలు. అది గ్రహించుకుని ధన-పేద బేధం లేకుండా అందరితో కలిసి మెలిసి , ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకుంటే అందరూ ఏసీ బోగీ లో ప్రయాణం చేస్తున్నంత ఆనందంగా గడిచిపోతుంది .*

*మనకి డబ్బుందికదా అని దేవుడికి ఇస్తే పుణ్యం వస్తుంది అనుకోవడం పొరపాటు. అదే పేద వాళ్ళకి పెడితే వాళ్ళు పొందే సంతోషంలో దేవుడుంటాడు. అది దేవుడికే     ఇస్తున్నామనే భావన మనలో కలగాలి.  అప్పుడే పేదవాడి కళ్ళల్లో కనిపించే ఆనందం మనకు తృప్తి , దేవుడి ఆశీర్వాదం మనకు లభిస్తుంది.*

*మనం చేసే పని ఎంతమంది చూస్తున్నారు అన్నది ముఖ్యం కాదు ..  అది ఎంతమందికి ఉపయోగ పడుతుంది అన్నది ముఖ్యం.*

*మంచి పని చేసేటప్పుడు మనిషి కనబడక్కరలేదు మంచితనం కనబడితే చాలు.*

* ఇక్కడ మారాల్సింది మనిషి యొక్క మనసు, ఆలోచించే విధానం.*

*మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగానే కనిపిస్తాయి , చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి.*

*అవసరం ఉన్నా .. లేకపోయినా ఒకేలా ఉండాలి.   అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వితం కావు . అర్థం చేసుకొనే ఓర్పు ,  సర్దుకుపోయే నేర్పు , బాధ్యత గల మనస్సూ ఉంటే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగా ఉంటుంది.*

*చదువు ద్వారా సంస్కారం, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్న వారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే జీవిత సత్యం!*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment