Wednesday, July 3, 2024

 [6/23, 00:26] +91 95027 88539: *శ్రీ విష్ణు పురాణం.* 
 *భాగము -- 11* 

కశ్యపుని రెండవ భార్యయైన దితియందు హిరణ్యకశిపు హిరణ్యాక్షులు, సింహిక పుట్టారు. సింహిక విప్రజిత్తి అనే రాక్షసుని భార్య అయింది. హిరణ్యకశిపునకు
ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు
అనే నలుగురు
కొడుకులు పుట్టారు. వారిలో ప్రహ్లాదుడు పరమభాగవతుడు. అతని చరిత్ర
మనసుకి మాటకీ అందని మహనీయ గుణవిశిష్టం. అతని చరిత్ర నాకు
అందినంత చెప్తాను విను.
హిరణ్యకశిపుడు బ్రహ్మను గూర్చి చాలాకాలం తపస్సు చేసి ముల్లోకాలకూ తన దొరతనం కలిగేట్టు బ్రహ్మవల్ల వరం పొందాడు. సకలలోక భీకరంగా పరిపాలన సాగిస్తూ యజ్ఞభాగాలు తానే తీసుకునేవాడు.
దానితో దేవతలు సుఖస్థితీ గతీ లేనివారయ్యారు.
అలా ఉండగా ఒకనాడు మద్యపానమత్తుడై దివ్యమణిమయ
సౌధమునందు కొలువుతీరి గురువులతో, కొడుకును ప్రహ్లాదుణ్ణి రప్పించి
కుమారా! గురువులేమి చెప్తున్నారు? శ్రద్ధగా రాజనీతి చదువుతున్నావా?
ఏదీ ఒక పద్యం చదువు - అని అనగా ప్రహ్లాదుడు చదువవలసినది చదివాను.
విష్ణుభక్తి కన్న, విష్ణుస్తోత్రం కన్న నేర్వవలసింది ఏముంటుంది నాయనా! అని తేలికగా అన్నాడు. కొడుకుమాట ఆ తండ్రికి శూలముతో పొడిచినట్టు వినిపించి కోపించి
కళ్లెర్రచేసి - కొడుకుకి దగ్గరగా ఆసనాసీనుడైన గురువుని చూసి అన్నాడు...
ఏమయ్యా! నువ్వు గురువువా? జాతికి బ్రాహ్మణుడవుగాని నీతికి కావు. పసిపాపనికి నువ్వు చెప్పిన చదువు ఇదా? దనుజకంటకుడైన ఆ విష్ణువును
గురించి చెప్తున్నావా? ఏమనాలి నిన్ను? కుటిలమతీ!...
హిరణ్యకశిపుని కరకు మాటవిని ఆ గురువు దనుజాధిపా! విను
నేను చెప్పేది. నీ కొడుకు సంగతి తోడి బాలురకు తెలుసును. నేను నీ
సంబంధమైన రాజనీతే చెప్తున్నాను. వింటున్నట్టు నటిస్తాడు. పాఠం అయిన
తరువాత ఆవలకు పోయి దనుజ బాలురకు విష్ణువు గురించే చెప్తూ
ఉంటాడట. ఏమి చెయ్యమన్నావు. నా తప్పేమీ లేదు అని చెప్పగా
హిరణ్యకశిపుడు కొడుకుని అదలించి - ఇదిగో యీనాటి నుంచి గురువు
చెప్పినది బుద్ధిగ నేర్చుకుంటూ ఉండు. మనవంశానికి విరోధి అయిన ఆ
విష్ణువు ఘోష నీకు తగదు. మనయింటా వంటా లేని బుద్ధి - ఇది మంచిది
కాదు. ఆ విష్ణువు నాకన్నా గొప్పవాడా? నీ వెర్రికాని... అని బుద్ధి చెప్పి
గురువుతో పంపించాడు.
ఇంటికి వెళ్లిన తరువాత గురువు బుజ్జగిస్తూ ప్రహ్లాదా! నీ తండ్రి బ్రహ్మను గూర్చి గొప్ప తపస్సు చేసి ముల్లోకాలకూ ప్రభువుగా వరం పొందిన
మహావీరుడు. కనుక ఆ విష్ణువు పేరెత్తితే ఒప్పుకోడు. విన్నావా! ఇక నేను
చెప్పే నీతిశాస్త్రం శ్రద్ధగా చదువుతూ ఉండు.
అని అనగా విని ప్రహ్లాదుడన్నాడు అయ్యా! నా తండ్రికి పుట్టిన
వెర్రితనం నీకూ అబ్బినట్టుంది. సకలలోకాధిపతి విష్ణువును కాదని యింకొకనిని చెప్పడం అజ్ఞానం కాదా? పాపకర్మలు చేసే దనుజులకు
పౌరోహిత్యం చేస్తూన్నందువల్ల వారి గుణాలే నీకూ పట్టినట్టున్నాయి. ఇలాటి
నీ దగ్గర చదువుకోడం తెలివితక్కువతనం. ఒక్కటే నా నిర్ణయం. ఆ విష్ణుదేవుని
కాదని నీ చెప్పే చదువు నేను వినేది లేదు.
ప్రహ్లాదుని మాట విని ఆ గురువు పెదవి కదల్పలేకపోయాడు.
కొన్నాళ్లు అయిన తరువాత హిరణ్యకశిపుడు మేడపై మద్యపానం
చేసి స్త్రీలతో వినోదం చిత్తగిస్తూ కొడుకుని రప్పించి ఊఁ - శ్రద్ధగా నీతిశాస్త్రం
చదువుతున్నావా? ఏదీ చదువు; వింటాను అని అనగా చెప్పాడు కొడుకు.
శ్రీరమణీ మనోహరుడు, సర్వలోకవిఖ్యాత చరిత్రుడు, పద్మనేత్రుడు
అయిన విష్ణుదేవుని భజించిన ధన్యుడను. నాకీ నీతులు గీతులూ ఎందుకు?
అని చెప్పగానే హిరణ్యకశిపుడు ఆపరా? కోపముతో పళ్లు పటపట
కొరికి నిప్పులు రువ్వే చూపుతో కొడుకును చూసి దురాత్మా! వంశానికి ముప్పు తెచ్చే దుర్మార్గుడవైనావు. దనుజ జాతికి మారకుడైన వానిని
భజిస్తున్నావా? ఎంత ధైర్యం? నా ముందు నా పగవానిని పొగడుతున్నావే.
ఇక నిన్ను ప్రాణాలతో ఉంచేది లేదు. చంపవలసిందే. నువ్వు భజించే ఆ దనుజవైరి నిన్ను ఎలా కాపాడుతాడో చూస్తాను అని తాళ్లతోకట్టి ఏనుగులచే
పొడిపించి విషాన్నం పెట్టించి - ఇలాగు ఏవేవో మారణప్రయోగాలు
చేశాడు. వాటికి ప్రహ్లాదుడు మరింత తేజస్సుతో రాణించాడు గాని
క్షీణించలేదు.
హిరణ్యకశిపుడు కుక్కిన పేనులాగా నోరు మూసుకుని వింతగా చింతగా
చూస్తూ కూర్చున్నాడు. ప్రహ్లాదుడు మళ్లీ గురువు వద్దకు వెళ్లిపోయాడు...
కొన్నాళ్లు గడచిన తరువాత హిరణ్యకశిపుడు కొడుకుని రప్పించి ఏమి నీ బుద్ధి మారిందా లేదా? గురువు చెప్పినట్టు కులోచితమైన విద్య
చదువుతున్నావా అని అడిగాడు. నాయనా? నా బుద్ధి ఆ విష్ణుదేవుని భజనకి
అంకితమైపోయింది. లౌకికమైన కులవిద్యకి కట్టుపడదు. ఇదే నా నిర్ణయం
అని ప్రహ్లాదుడు చెప్పగా హిరణ్యకశిపుడు మితిమీరిన కోపముతో చూసి

సరే. ఇక నిన్ను మారణహోమంతో తుదముట్టించవలసిందే అని తన భటులను
చూసి వీడిని ఈడ్చుకుపోయి తాళ్లతో కట్టి సముద్రములో పడద్రోసి పైన ఒకకొండ పడవేసి చంపి రండి - అని శాసించాడు. వారు ప్రహ్లాదుని తోడుకొని
[6/23, 00:27] +91 95027 88539: వెళ్లి తాళ్లతో కట్టి సముద్రములో పడద్రోసి పైన ఒక కొండ వేశారు. ప్రహ్లాదుడు
చలించలేదు. శ్రీహరిని తన హృదయపద్మములో ధ్యానముద్రతో ప్రతిష్ఠించి
స్తుతిస్తూ హాయిగా ఉన్నాడు. గట్టున ఉన్న రాక్షస భటులు వింతగా చూస్తూ
ఉండగా సముద్రం అలలతో పొంగి కొండను ప్రక్కకు తొలగించి ప్రహ్లాదుణ్ణి
అల్లనల్లన గట్టుకి చేర్చింది. ఆ రక్కసులు ఆశ్చర్యానికి అంతు లేదు. సర్వశక్తి
సంపన్నుడైన శ్రీహరి సంరక్షకుడై ఉన్న భక్తునకు కొండలూ బండలూ
ప్రమాదకరము లవుతాయా?... చంపడానికి నిల్చున్న రాక్షస భటులు బెదిరి
కొంతదూరాన ఉన్న చెట్లకిందికి పారిపోయారు. ఆ సమయములో గట్టున
ఉన్న ప్రహ్లాదునకు శ్రీహరి అభయ హస్తముతో ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుణ్ణి
చూసి ప్రహ్లాదుడు పరమానందభరితుడై చేతులు మొగిచి నుతించాడు.
పుండరీకాక్షా! ఆశ్రితపక్షా! అధర్మశిక్షా! ధర్మవర్ధనా! దుర్మతిమర్దనా!
శ్రీపతీ! యోగసద్గతీ! వాసుదేవా! మహానుభావా! నిర్వికారా! సదాధారా!
గోబ్రాహ్మణహితా! త్రిగుణాతీతా! పరమపావనా! బ్రహ్మణ్యదేవా! గోవిందా!
సచ్చిదానందా! సనాకాది యోగీంద్రసన్నుతా! హృషీకేశా! నమస్తే నమస్తే
నమస్తే!ప్రహ్లాదుని స్తుతికి సంతసించి శ్రీహరి దగ్గరగా తీసుకుని అల్లనల్లన
శరీరం నిమిరి ప్రహ్లాదా! బాల్యంలో ఉన్న వాడవే అయినా నీ తండ్రి చేసిన
దారుణకర్మకు బెదరక నన్ను మనసా వదలక భక్తియుక్తుడవై ప్రవర్తిస్తూన్నావుకనుక నువ్వు కోరిన వరం ఇస్తాను అడుగు - అని ఆప్యాయంగా అనగా
దేవా! నేను ఏ జన్మలోనూ నీ పాదభక్తి వదలని మనసు కలవాడనై ఉండేట్టు
వరం అనుగ్రహించు! అని ప్రహ్లాదుడు అడిగాడు.
ప్రహ్లాదా! నీకు మరి జన్మ లేదు. నీ యీ ప్రవర్తన విష్ణుభక్తులకు
మేల్బంతి అయింది. ముక్తి నీ చేతిబంతి. పాపం నీ చుట్టుప్రక్కల చేరదు.
కాబట్టి నాయందు భక్తిని గురించి అలా ఉండనీ. ఇంకొక వరం కోరుకో హనీ నీ విష్ణు అనగా నా తండ్రి అహంకారముతో నిన్ను ద్వేషించి నన్ను హింసించాడు. 

 *సశేషం......*

No comments:

Post a Comment