Wednesday, July 3, 2024

*****కపిల మహర్షి - బోధ - కాలం

 *ఓం నమో భగవతే వాసుదేవాయ*
*శ్రీహరి లీలామృతం 27వ భాగము*
*(సంక్షిప్త భాగవత గాథలు)*
🌸🌸🌸🌸🙏🕉️🙏🌸🌸🌸🌸
*తృతీయ స్కంధం*
*10వ భాగము*
🌸🌸🌸🌸🙏🕉️🙏🌸🌸🌸🌸

*🌻కపిల మహర్షి - బోధ - కాలం🌻*

🍃🌺మాతా! ఈశ్వరుడు జీవునిలో అనుప్రవేశించి వుంటాడు. ఆయనను యోగం లేక భక్తిచే గాని పొందవచ్చు. ఆయన ప్రకృతిపురుషులతో కలిసి కర్మలు చేయిస్తున్నట్లు కనబతాడు. ప్రకృతికి పరుడై కర్మలు చేయనివాడై ఉ ండు లక్షణమే భగవంతుని లక్షణమై ఉన్నది. ఈ భగవత్ రూపమే అద్భుత ప్రభావశాలియైన కాలంగా వెలసింది. ఈ కాలమే తత్వాలకు, జీవులకు భయాన్ని కలిగిస్తుంటుంది. అందుచేతనే సకల జీవరాశికి ఆశ్రయమై, వాటిలోనే ఉంటూ, ఒక ప్రాణిని మరొక ప్రాణిచే అంతం చేయిస్తుంటుంది.

🍃🌺విష్ణువు కాలరూపుడై, జీవులను తన ఆధీనంలో ఉంచుకొని ప్రభువై ప్రకాశిస్తుంటాడు. ఆయనకు ఎవరి పట్ల భేదభావం లేదు. అందరిలో ఆవేశించి వుండి, అజాగ్రత్తపరులను అంతం చేస్తాడు. ఆయన భావం చేతనే గాలి వీస్తుంది. సూర్యుడు వేడినిస్తాడు. ఇంద్రుడు వాన కురిపిస్తాడు. చంద్రుడు ప్రకాశిస్తాడు. ఋతు ప్రకారంగా వృక్షజాలం పూవుల్ని అందిస్తాయి. నదులు ప్రవహిస్తాయి. సముద్రాలు హద్దులో ఉంటాయి. అగ్ని మండుతుంది. భూమి భారానికి క్రుంగిపోదు. ఆకాశం సకల జీవరాసులకు స్థానం కల్పిస్తుంది.

🍃🌺త్రిగుణాలతో కూడిన బ్రహ్మాదులు సృష్టి కార్యాలలో మెలకువగా ఉంటారు. తల్లిదండ్రులు బిడ్డల్ని కంటారు. కాలస్వరూపుడు సంహరిస్తుంటాడు. సకలమూ భగవంతుని ఆధీనంలో ఉంటుంది. ఆయన శక్తిని ఎవరూ తెలుసుకోలేరు.

🍃🌺మూఢుడైన మానవుడు అశాశ్వతమైన వాటిని శాశ్వతమని భ్రమించి, అనేకదేహాల్ని ధరిస్తుంటాడు. ఐనా విరక్తి చెందడు. నరకం అనుభవించినా, దేహాభిమానాన్ని వదలడు. భార్యాబిడ్డల సంరక్షణలోనే కృశిస్తాడు. ఇంద్రియ లోలుడై, స్వార్థపరుడై, సోమరియై, బలహీనుడై, వ్యాధులపాలైనా దేహాభిమానాన్ని వదలలేడు. ఏ పరివారం కోసం శ్రమించాడో, ఆ పరివారమే అతనినిన అంతిమ దశలో ఈసడించుకొంటుంది. చివరకు యాతనా శరీరంలో వేశిస్తాడు. యమభటులు ఈడ్చుకొని వెళతారు. చిత్రహింస చేయడానికి ఎదురు చూస్తుంటారు. అతడు తామిశ్రం, అంధతా మిశ్రం, రౌరవం అనే నరకాల్లో పడి, దుర్భర బాధలను అనుభవించిన తరువాత, రియొక శరీరాన్ని ధరిస్తాడు. ఇలాగే అన్నీ పునరావృతమౌతుంటాయి.

*🌻పిండోత్పత్తి క్రమం🌻*

🍃🌺జీవుడు పూర్వజన్మల ఫలంగా మళ్ళీ దేహాన్ని పొందుతాడు. జీవుడు నుష్యుని వీర్యబిందు సంబంధంతో స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఏడవ రోజుకు బుద్బుదమంత, పదవ రోజుకు రేగుపండంత, తరువాత మాంసపిండమై, గ్రుడ్డు ఆకారంలోకి వస్తాడు. ఒక నెలకు శిరస్సు, రెండవ నెలకు కాళ్ళు చేతులు, మూడవ నెలకు గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, చర్మము, నవరంధ్రాలు ఏర్పడుతాయి. నాల్గవ నెలకు సప్త ధాతువుల కలుగుతాయి. అయిదవ నెలకు ఆకలి, దాహం ఏర్పడతాయి. ఆరవ నెలలో మావి చేత కప్పబడి, తల్లి గర్భంలో కుడివైపు తిరుగుతుంటాడు. తల్లి ఆహారంతో తృప్తి చెందుతాడు. మలమూత్రాల గుంటల్లో పొర్లుతూ, క్రిములచే బాధింపబడతాడు. తల్లి తినే ఘాటు వస్తువులు తపింప చేస్తాయి. 

🍃🌺మావిచే కప్పబడి, ప్రేగులచే చుట్టబడి, తల్లి పొట్టలో తలదూర్చి, ముడుచుకొని బంధాలు ఈ పడివుంటాడు. పంజరంలో పక్షివలె ఉంటాడు. సుఖమనేది లేకుండా బాధపడుతుంటాడు. ఏడవ నెలలో జ్ఞానం కలుగుతుంది. కదలికలు ఉ ంటాయి. తన దుస్థితికి విలపిస్తూ, సర్వేశ్వరుని ఇలా ప్రార్థిస్తాడు. "సర్వేశ్వరా! నీ పాదాలను భక్తితో ఆరాధిస్తాను. నేను ఆత్మస్వరూపుడను. నాకే లేవు. కాని ఇలా బంధింపబడటానికి నా పూర్వజన్మ పాపాలే కారణం. హే భగవాన్! పరంజ్యోతీ! ఓ పరమాత్మా! ఈ గర్భ నరకం నుండి నన్ను కాపాడి శాంతిని ప్రసాదించు ప్రభూ!” అంటూ అనేక విధాల ప్రార్థిస్తాడు.

🍃🌺ఈ విధంగా చెప్పిన కపిల భగవానుని తల్లి దేవహూతి ఇలా అడుగు తుంది. "ఓ మహితాత్మా! ఎవని మాయచే మానవుడు మోహంలో చిక్కుకొని, తల్లి గర్భంలో కొట్టుకుంటుంటాడో, ఆ దేవదేవుని కృపలేకుండా, ఆయన గుణగణాలను స్మరించాలని, వానికి తోస్తుందా?” అన్న ఆమె ప్రశ్నకు కపిల మహాముని ఇలా జవాబు చెప్తున్నాడు. "తల్లీ! భగవానుడు సర్వదా అంతర్యామియై ఉండటం చేత, కర్మవర్తనులైన వారి కల్మషాలను నివారించు కోవడానికి ఆయననే ఆశ్రయించాలని, ఆయనే స్ఫురింపజేస్తాడు. తల్లి గర్భంలో పడే యాతననుండి తనను బయటకు పంపేవారెవరున్నారాయని ప్రార్థిస్తుంటాడు. పరమాత్ముని అనుగ్రహంతో, చైతన్యంతో పాటు, పూర్వస్మృతులు కూడ వస్తాయి. ఆ పరమాత్మ రక్షించాలని తెలుసుకొంటాడు. కాని ఆ పరమాత్మకు తానేమి అర్పించలేడు. నమస్కరించగలడు మాత్రమే కదా?

🍃🌺అప్పుడు ఇలా అనుకొంటాడు : “నేను కేవలం జీవుడను. వచ్చే జనమలో, యోగసాధనలతో, ఆ వెలుగులో సర్వేశ్వరుని చూస్తాను. ఇలా ఈ గర్భనరకంలో పడకుండా చూసుకొంటాను. ఇలా భావించినవాడై, జీవుడు తొమ్మిది మాసాలు గడిపి, పదవ నెల తలక్రిందులుగా తిరిగిపోతాడు. ఉక్కిరిబిక్కిరి అవుతాడు. అప్పటివరకు తనలోని జ్ఞానం, పూర్వస్మృతులు నశించిపోతాయి. నెత్తురుతో బయటపడి రోదిస్తాడు. తన మాట ఎరుకలేనివారిచే పోషింపబడతాడు.

అక్కడినుండి అన్ని దశల్లోనూ పాప సంచయాలు పెంచుకొంటూ చరిత్రను పునరావృతం చేసుకొంటాడు.

🍃🌺దుష్టసాంగత్యంతో సద్గుణాలు నశిస్తాయి. ఓ మాతా! దేహాన్నే ఆత్మ అని అవివేకులు భావిస్తారు. పెంపుడు జంతువుల్లా జీవిస్తారు. పరస్త్రీ సాంగత్యం గర్హనీయం. బుద్ధిని స్థిరం చేసుకొని నా పద్మాలను ఆశ్రయించినవారు విషయవాసనలను నరకప్రాయంగా చూస్తారు. జీవుడు ఇవన్నీ అనుభవిస్తూ, మళ్ళీ మళ్ళీ జన్మించాలను కోరుకొంటాడు. కర్మఫలాలను అనుభవించక తప్పదు. జీవునకు ఆధారంగా లింగదేహముంటుంది. కర్మఫలాలను అనుభవించడానికి మళ్ళీ దేహధారణ చేస్తుంది. ఆ దేహాన్ని లింగశరీరం విడిచి వెళ్ళడమే మరణం. నిజానికి జీవికి జననమరణాలు లేవు. మానవుడు జీవుని యదార్థ తత్వాన్ని తెలుసుకొని, వైరాగ్యాన్ని అలవరచుకొని దేహాసక్తిని వదలాలి. దేహం నశించేదే. సూక్ష్మదేహాన్ని వదిలించుకొంటే (లింగశరీరాన్ని) ఇక మిగిలేది ఆత్మ మాత్రమే. పరమాత్మ కరుణా కటాక్షాల ద్వారా సాధనతోనే సూక్ష్మ దేహం తొలగిపోయేది. సుఖదుఃఖాల మనోమయాలు కనుక మనస్సును సంస్కరించు కోవాలి. అపుడు అవి దరిచేరవు. శాశ్వతమైన ఆత్మ యందు ఏకమవడమే మానవజన్మ సాఫల్యం అని గ్రహించాలి. భగవానుని అనుగ్రహాన్ని అర్థించాలి.

🌹☘️🌻🌻🌻🙏🌻🌻🌻☘️🌹
         *🙏ఓం నమో వేంకటేశాయ🙏*
🌹☘️🌻🌻🌻🙏🌻🌻🌻☘️🌹

No comments:

Post a Comment