Sunday, July 7, 2024

 *షోడషోపచార పూజ అంటే ఇవే!!*  🙏🙏🌹☘️🌸

_మొత్తం 16 ఉపచారాలు_

1. ఆవాహనం- దైవాన్ని ఆహ్వానించాలి

2. ఆసనం-  ఆసనం చూపించాలి (అక్షతలు సమర్పిస్తారు)

3. పాద్యం- పాదాల ప్రక్షాళనకు నీళ్లు సమర్పిస్తారు

4. అర్ఘ్యం- చేతులు కడుక్కోవడానికి నీళ్లు చల్లుతారు

5. ఆచమనీయం- దాహం తీర్చుకునేందుకు నీళ్లివ్వాలి

6. స్నానం- అభిషేకం చేయాలి

7. వస్త్రం- దుస్తులు లేదా అక్షతలు, పూలు సమర్పించాలి

8. యజ్ఞోపవీతం- యజ్ఞోపవీతం లేదా అక్షతలు సమర్పిస్తారు

9. గంధం- గంధంతో అలంకరించాలి

10. పుష్పం- పూలతో అర్చించాలి

11. ధూపం- అగరొత్తులు వెలిగించాలి

12. దీపం- వెలుగుతున్న దీపాన్ని భగవంతుడికి చూపించి నమస్కరించాలి

13. నైవేద్యం- పండ్లు, పానకం, వంటలు నైవేద్యం పెట్టాలి

14. తాంబూలం- ఆకు, వక్క తాంబూలం ఇవ్వాలి

15. నమస్కారం-  సాష్టాంగ నమస్కారం చేయాలి

16. ప్రదక్షిణ- ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి.

No comments:

Post a Comment