*🕉️🙏సత్సంగం అంటే?...🕉️🙏*
*🕉️🙏సంస్కృతంలో*
*'సత్' అంటే...*
*సత్యము🕉️🙏*
*🕉️🙏'సంగ్' అంటే...*
*సాంగత్యం,*
*కలిసి ఉండటం.*🕉️🙏
*🕉️🙏 కాబట్టి సత్సంగం అంటే,*
*సత్యంతో కలిసి ఉండడము' (ఆయనే సత్యము, భగవంతుడు సత్యము).🕉️🙏*
*🕉️🙏కాబట్టి, మనము ఏకాంతంలోనైనా ధ్యానం చేసుకుంటున్నప్పుడు,*
*ఐదు వందలమంది, లేదా పదివేలమంది* *కూర్చున్నప్పటికీ వారిలో ప్రతిఒక్కరూ సత్యంతో,*
*ఆ అనంత సతత్వంతో* *సాంగత్యం కలిగి ఉన్నప్పుడు మాత్రమే, అది సత్సంగం కాగలదు.🕉️🙏*
*🕉️🙏కాబట్టి ఒక సత్సంగం, నిజంగా సత్సంగం కావాలంటే, ఆ సత్సంగం ద్వారా లాభాన్ని పొందాలంటే, ఆ పరతత్వంతో అనుసంధానం నెలకొని ఉండాలి. ఎందుకంటే, మనము సత్సంగ్ లో కూర్చొని, వారి కృపతో అనుబంధాన్ని ఏర్పరచుకున్న ప్రతిసారీ, మనము ఎన్నో శక్తిసామర్థ్యాలను సాధిస్తాము. మనము త్వర త్వరగా అనుసంధానాన్ని ఏర్పరచుకోగలుగుతాము.* *ఆ అనుబంధం అంతకంతకూ దృఢంగా మారుతూ, చివరికి ఏదో ఒకరోజు అది అత్యంత దృఢమైన, శాశ్వత సంబంధంగా మారుతుంది.🕉️🙏*
*🕉️🙏సత్సంగానికి కారణాలు:*🕉️🙏
*🕉️🙏సోదరత్వాన్ని పెంపొందించడం:🕉️🙏*
*🕉️🙏మనము ఒకచోట కలిసినప్పుడు, మనము తరచుగా కలుసుకుంటున్నప్పుడు, ఒక విధమైన పరస్పర సంబంధం పెరుగుతుంది. పెరగాలి కూడా! మనము ఒక వ్యక్తిని పదే పదే కలిసినప్పుడు అతనితో స్నేహం పెంపొందుతుంది. ఇక్కడ మనము కేవలం స్నేహితులమే కాదు, మనము సోదరీ, సోదరుల్లా ఉండాలి. ఎందుకు? ఎందుకంటే మనము ఒక వ్యక్తి ని గుర్తిస్తాము. మనము ఒకే లక్ష్యం వైపు పయనిస్తున్నాము. మనం ఒకే మార్గాన్ని అనుకరిస్తున్నాము.*
*మనందరిదీ ఒకటే గమ్యం అని భావించే ఆ గమ్యంవైపు మనమందరం ముందుకు సాగిపోతున్నాము. కాబట్టి మనలో సోదరభావాన్ని పెంపొందించుకోవడానికి ఇదొక ప్రముఖమైన మొదటి కారణం.*🕉️🙏
*ఒక వ్యక్తి విడిగా ధ్యానం చేసినప్పటికంటే, మనందరం వందా, రెండొందలమంది కూర్చొని ఒక్కసారే ధ్యానం చేసినప్పుడు, దివ్యత్వాన్ని లేదా దివ్యకృపను మనవైపు ఆకర్షించే శక్తి మిక్కుటమౌతుంది. ఒక్కొక్క వ్యక్తి విడివిడిగా కూర్చొని చేసే ప్రయత్నాల ఫలితాన్నంతా కలగలిపి చూసినా, అందరూ కలిసి ఏకకాలంలో సామూహికంగా ప్రయత్నించినప్పుడు దాని ప్రభావం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది.🕉️🙏*
*కుల, మత, భాష, జాతిపరమైన భావాల నిరూపణ విస్మరించి, అందరినీ ఒకే త్రాటిపైకి తెచ్చి ఆయన పదే పదే చెబుతూ ఉంటే “మతాలు మనుషులను విడదీస్తే "ఆధ్యాత్మికత వారిని కలుపుతుంది”* అనే సత్యాన్ని అక్షరాలా ఋజువు చేసి చూపడం, *వారి సాధనలో ఒకానొక ఘనమైన అంశం. "మతం. అంతమైనచోట "ఆధ్యాత్మికత" ప్రారంభమౌతుంది" 🕉️🙏*
*🕉️🙏 "ఇదే సనాతన ధర్మం (హిందూ ధర్మం )నేర్పిస్తుంది"* 🕉️🙏
*🕉️🙏జై శ్రీరామ్ 🕉️🙏*
No comments:
Post a Comment