*సతీ సావిత్రి - 2*
రచన : శ్రీ సముద్రాల లక్ష్మణయ్య
*ఒక సంవత్సరంకంటే బ్రతకడు :*
అయినా కీడెంచి మేలెంచమని పెద్దలంటారు. అందువల్ల నత్యవంతునిలో వున్న లోపం కూడ తెలియజేస్తాను. “ఈ దినం మొదలు సరిగా ఒక సంవత్సర కాలానికి అతడు మరణిస్తాడు. ఈ సంగతి తెలిసి కూడ నీకు చెప్పకపోవడం మంచిది కాదని చెబుతున్నాను.” అన్నాడు నారదుడు.
అప్పుడు రాజు కుమార్తెతో "తల్లీ! మునీంద్రుడి మాట విన్నావు కదా ! ఈ మహామభావుడికి తెలియని దేవరహస్యాలు ఏవీ లేవు. ఈయన మాట తిరుగులేనిది. సంవత్సర కాలానికి మృత్యువువాతపడే భర్త నీకెందుకమ్మా! నా మాట విని మరొక వరుణ్ణి ఎన్నుకో " అని అన్నాడు.
అప్పుడు సావిత్రి " నాన్నా! నా మనన్సు నత్యవంతుడి మీద దృఢంగా లగ్నమై వుంది. ఒకరి పై వున్న ప్రేమను మరొకరి పైకి మళ్లించడం కులకన్యలకు ఎంత మాత్రం తగదు. ఏది ఏమైనా నరే నా మనోనిశ్చయం మారదు. నేను త్రికరణశుద్ధిగా సత్యవంతుణ్ణి పరించాను. ఏ పరిస్థితిలోనూ మరొకరిని వరించలేను" అని నిక్కచ్చిగా చెప్పింది. ఆ మాటలు విని రాజు విభ్రాంతి చెందాడు. సావిత్రి మనోనిశ్చయానికి నారదుడు ఆశ్చర్యపడ్డాడు. ఆమె సౌశీల్యానికి మెచ్చుకొన్నాడు. కుమార్తె నిర్ణయం పట్ల ఏమి చేయాలో తోచక మౌనంగా తన్ను చూస్తూ వున్న రాజుతో ఆయన ఇలా అన్నాడు-
"నరేంద్రా! నీ కూతురు మహా గుణవతి. పవిత్రమైన ఈమె నిశ్చయాన్ని మార్చటం మన వల్ల కాదు. ఈమె కోరిక మన్నించి సత్యవంతుడితో వివాహము జరిపించు. ఈమె చేసిన పుణ్యం వల్ల చివరికి మేలే జరుగుతుంది"
రాజు మునీంద్రుడి మాటలకు సమ్మతించి ఆయనకు నమస్కరించాడు. నారదుడు తండ్రినీ, కుమార్తెను దీవించి దేవలోకానికి తిరిగి వెళ్లాడు.
*ఆశ్రమానికి ప్రయాణం:*
అశ్వపతి ఒక మంచి రోజున సావిత్రిని వెంటబెట్టుకొని ద్యుమత్సేన మహా రాజు దగ్గఱికి బయలుదేరాడు. బంధువులూ, మంత్రులూ, పురోహితులూ రాజు వెంబడి పయనమయ్యారు. పెండ్లికి కావలసిన వస్తువులన్నీ తీసుకొని అరణ్యమార్గం ద్వారా చివరికి వాళ్లందరూ ద్యుమత్సేనుడు నివసించే ఆశ్రమం చేరుకొన్నారు.
అంధుడై రాజ్యం పోగొట్టుకొని అడవిలో నివసిస్తున్న ద్యుమత్సేనుడికి తనను వెదుక్కుంటూ మద్రదేశపు రాజు రావడం ఆశ్చర్యం కలిగించింది. అశ్వపతి రాకకు సంబరపడి ఆయన ఉచిత మర్యాదలు చేసి కుశలం అడిగాడు. అంత దూరం శ్రమపడి రావడానికి కారణమేమని ఆప్యాయతతో ప్రశ్నించాడు.
అశ్వపతి సావిత్రి చేత ద్యుమత్సేనుడికి అభివందనం చేయించి ఇలా అన్నాడు. — “రాజేంద్రా ! ఈ కన్యక నాకు ఏకైక పుత్రిక. మా వంశాన్ని ఉద్దరించటానికి ఈమె తప్ప మాకు వేరే దిక్కులేదు. చిరకాలానికి జగన్మాత అనుగ్రహం వల్ల ఈమె మాకు కలిగింది. గుణవంతురాలైన ఈ ముద్దుల బిడ్డను నీ కొడుకు నత్యవంతుడికిచ్చి నీతో వియ్యమంద టానికి నిశ్చయించుకొని వచ్చాను. ఈమెను కోడలుగా పరిగ్రహించి నన్ను ధన్యుణ్ణి గావించు.” అన్నాడు.
ఆ మాటలు విని ద్యుమత్సేనుడు "అయ్యా ! మీ ఆశయం మంచిదే. మీతో వియ్యమందడం కంటే మాకు మాత్రం కావలసిందేమున్నది? అయినా మేమిప్పుడు రాజ్యం పోగొట్టుకొని అడవులపాలయ్యాము. ఈ ఆశ్రమంలో ముని వృత్తితో తపస్సు చేసుకొంటున్నాము. అల్లారుముద్దుగా మీరు పెంచుకొన్న ఈ నుకుమారి మాతో గూడా ఈ అడవులలో ఎలా వుంటుంది? ఇక్కడి కష్టాల కెలా ఓర్చుకొంటుంది?” అని అన్నాడు.
అందుకు అశ్వపతి ఇలా బదులు చెప్పాడు. "రాజా! కలిమిలేములు కావడికుండలు, సంపదకు పొంగడం, ఆపదకు కుంగడం ధీరులకు ఎంత మాత్రం తగదు. నా కుమార్తె మహాధీరురాలు. ఈమె సుఖదుఃఖాలను లెక్కపెట్టదు. మీ బాంధవ్యం మీద ఎంతో ఆశ పెట్టుకొని ఇంత దూరం వచ్చాము. నా కోరిక తిరస్కరించకండి!" అని అన్నాడు.
*కోరుకున్న భర్త దొరికాడు :*
ఆ మాటకు ద్యుమత్సేనుడు సంతసించి వివాహానికంగీకరించాడు. ఇరుగు పొరుగున వుండే ఆశ్రమవానులందరూ పెండ్లికి వచ్చారు. శుభలగ్నంలో సావిత్రీ సత్యవంతుల వివాహం పెద్ద వేడుకగా జరిగింది. వచ్చిన పెద్దలందరూ వధూవరులను నిండు మననుతో ఆశీర్వదించారు. అశ్వపతి కూతురికీ అల్లుడికీ వస్త్రాలూ, ఆభరణాలూ, విలువైన వస్తువులూ విశేషంగా ఇచ్చాడు. తరువాత పరివారంతో సహా తన రాజ్యానికి పయనమైపోయాడు.
సావిత్రి కోరుకొన్న పతి లభించినందుకు ఎంతో సంతోషించింది. నత్యవంతుడు తగిన సతీమణిని చేపట్టగల్గినందుకు చాలా ఆనందించాడు. దాంపత్యం అనుకూలంగా వుంటే సంసారానికి మించిన సౌఖ్యం ఏమున్నది? చిలకా గోరువంకల లాగా అన్యోన్యానురాగంతో కలసిమెలిసి వున్న ఆ నవదంవతులను చూచి ఆశ్రమవాసు లందరూ మెచ్చుకొన్నారు.
సావిత్రి విలువైన వస్త్రాలూ, ఆభరణాలూ వదలిపెట్టి అరణ్యవాసానికి తగ్గట్టు నార చీరలు ధరించింది. ఆ సహజ సుందరికి అవి కూడా అపూర్వమైన అందాన్నే చేకూర్చాయి. మృదువైన ఆమె మాటలూ, భక్తితో ఆమె చేసే సేవలూ అత్తమామలను అలరించాయి. పతి సేవలో ఆమె ప్రాచీనకాలపు మహా పతివ్రతల ను మించిపోయింది. మునిపత్నులు ఆమె వద్ద తాము నేర్చుకోవలసిన సుగుణాలు ఎన్నో వున్నాయని భావించేవారు.
*సమీపిస్తున్న గడువు:*
రోజులు సుఖప్రదంగా సాగిపోతున్నాయి. కాని నారదమహర్షి మాటలు సావిత్రి మనస్సులో ఒక వంక తీరిని వేదన కలిగిస్తూనే వున్నాయి. నీవురు గప్పిన నిప్పులా ఆమె తనలో తాను కుములుతూనే పైకి సంతోషంగా వున్నట్లు కనిపించేది.
నారదుడు చెప్పిన నాటి నుండీ ఆమె తన భర్త ఆయుఃప్రమాణం లెక్క వేనుకొంటూ వచ్చింది. గడువు సమీపించే కొద్దీ ఆమెలో దిగులు ఎక్కువయింది. అయినా ఆమె ఎంతో నిబ్బరంతో వున్నట్లు కనిపించింది.
*మూడు రోజుల ఉపవాస వ్రతం:*
ఆ తుది రోజులు రానే వచ్చాయి. ఇక నాల్గు దినాలలో సత్యవంతుడు మరణించనున్నా డు. సావిత్రి తీవ్ర భక్తితో భగవంతుణ్ణి ధ్యానించింది. నిష్ఠతో మూడు దివాల ఉపవాస వ్రతం చేపట్టింది. కోడలు ఉపవాస ముంటున్నదని తెలిసి అత్త మామలు..
"అమ్మా ! ఎందుకింత కఠినమైన వ్రతం చేస్తున్నావు?" అని అనునయంతో ఆమెను ప్రశ్నించారు.
ఆమె వినయంగా ఇలా అన్నది - "మీరు నా వ్రతం విషయమై విచారించకండి ! ఒక మేలు కోరి నేనీ వ్రతం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానో తర్వాత మీకే తెలుస్తుంది.”
అన్నది.
ఈ మాట విని పెద్దలిద్దరూ ఏమీ అనలేక ఊరకుండిపోయారు-
మూడు రోజులూ గడచిపోయాయి. దారుణమైన ఆ చివరి దినం రానే వచ్చింది. ఆ రోజు సావిత్రి బ్రహ్మముహూర్తానికి ముందే మేల్కొన్నది. జరగబోయే విపత్తు ఆమె కళ్ల ముందు కదలింది. కట్టలు తెంచుకొంటున్న దుఃఖాన్ని దిగమ్రింగుకొని ఆమె దినకృత్యాలు నెరవేర్చింది. భర్తకూ, అత్తమామలకూ పరి చర్యలు చేసింది. పెద్దలందరకూ నమస్కరించి వాళ్ల దీవెనలు గ్రహించింది.
అప్పటికి జాము ప్రొద్దెక్కింది.
"మూడు దినాలూ గడచిపోయాయి. ఇక
వ్రతం పూర్తి చేయ” మని ద్యుమత్సేనుడు సావిత్రితో చెప్పాడు. ఆ దినం కూడా
సూర్యుడు అస్తమించే వరకూ భోజనం చేయకూడదన్న తన విశ్చయాన్ని ఆమె ఆయనకు తెలియజేసింది.
ఇంతలో సత్యవంతుడు సమిధలూ, దర్భలూ, పండ్లూ తేవటానికి అడవికి ప్రయాణమైనాడు. సావిత్రి “నేనూ మీతో కూడా అడవికి వస్తాను, తీసుకుపోండి!" అని భర్తను ప్రార్థించింది.
"నీవు మూడు దినాల నుండి ఉపవానం చేసి చాలా నీరసంగా వున్నావు. నాతో రాలేవు. అడవిలో నడవడం చాలా కష్టం," అని నత్యవంతుడన్నాడు.
అందుకు ఆమె " నాథా ! ఉపవానం వల్ల నాకు ఏ విధమైన శ్రమా లేదు. మీతో నడుస్తుంటే ఎక్కడైనా నాకు కష్టమనిపించ దు. అడవిలో ఎన్నో రకాల పూలూ, పండ్లూ, తీగలూ, మృగాలూ, పక్షులూ వుంటాయని విన్నాను. ఆ వింతలన్నీ కళ్లారా చూడాలని ఎన్నో దినాల నుంచీ అనుకొంటున్నాను. ఈ దినం ఎలాగైనా మీతో రావాలని నిశ్చయించు కొన్నాను. తప్పక నా కోరిక తీర్చండి!" అని బ్రతిమాలుకొన్నది.
సత్యవంతుడు ఆమె కోరికకు నమ్మతించాడు. సావిత్రి అత్తమామలకు నమస్కరించి భర్తతో అడవికి వెళ్లటానికి అనుమతించమని ప్రార్థించింది. కోడలు ప్రియంగా అడిగిన ఆ ఒక్క కోర్కెను కాదనలేక వాళ్లూ అందుకు అంగీకరించారు.
💐
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment