Saturday, July 13, 2024

 _*భక్తుడి కోసం నిరీక్షించిన భగవంతుడు*_

🙏🥀🌹🪷🌻✳️🪷🌻🥀🌹🙏

🪷  పూరీ జగన్నాథుడి పరమభక్తులలో అగ్రగణ్యుడు సాలబేగ్♪. అతని తండ్రి ముస్లిం, తల్లి ఒడియా బ్రాహ్మణ మహిళ. తండ్రి లాల్ బేగ్ మొఘల్ సైన్యంలో సుబేదారుగా పనిచేసేవాడు♪. తల్లి కృష్ణ భక్తురాలు. ఆమె ద్వారా చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణలీలల గురించి వింటూ పెరిగాడు సాలబేగ్♪.

🪷 సాలబేగ్ తల్లి లలిత బాలవితంతువు♪. లాల్‌బేగ్ మొఘల్ సేనలతో పాటుగా కళింగప్రాంతం వచ్చాడు♪. పూరీ సమీపంలోని దండముకుందపూర్ గ్రామం మీదుగా గుర్రంపై వెళుతుండగా, చెరువులో స్నానం చేసి, దగ్గర్లోని గోపీనాథ ఆలయానికి వెళుతున్న లలితను చూశాడు♪. ఆమెను బలవంతంగా గుర్రంపైకి ఎక్కించుకుని తీసుకుపోయి, పెళ్లి చేసుకున్నాడు♪. కటక్ నగరంలో కాపురం పెట్టాడు. సాలబేగ్ ఒక్కడే వారి సంతానం♪. పెళ్లి తర్వాత కూడా సాలబేగ్ తల్లి ఇంట్లో తన పూజలు యధావిధిగా కొనసాగిస్తూనే ఉండేది♪. భక్తిగీతాలు పాడేది♪. కొడుకుకు పురాణగాథలు చెప్పేది♪.

🪷 సాలబేగ్ యువకుడయ్యాక తండ్రికి తోడుగా తానూ సైన్యంలో చేరాడు♪. బెంగాల్ లోని ఆఫ్ఘాన్ సైనికులు మొఘల్ సేనపై తిరుగుబాటు ప్రకటించడంతో, తిరుగుబాటును అణచివేయాలంటూ జహంగీర్ సుబేదారైన లాల్ బేగ్ ను ఆదేశించాడు♪. తండ్రి లాల్‌బేగ్ తో కలసి సాలబేగ్ అఫ్ఘాన్ సేనలపై యుద్ధానికి వెళ్లాడు. ఆ యుద్ధంలో లాల్ బేగ్ మరణించాడు♪. సాలబేగ్ తీవ్రంగా గాయపడి, ఇంటికి చేరుకున్నాడు♪.. గాయాలతో మరణమే శరణ్యం అనుకున్న పరిస్థితికి చేరుకున్నాడు♪. తల్లి బాలముకుంద అనే సన్యాసిని ఆశ్రయించి, తన కొడుకును కాపాడమని ప్రార్థించింది♪. ఆ సన్యాసి ఇంటికి వచ్చి, సాలబేగ్ తలపై విబూది చల్లి, మంత్రజపం చేశాడు♪. సాలబేగ్ కొంత తేరుకున్నాడు♪. తల్లి సూచనతో సాలబేగ్ మంచంపై కదల్లేని స్థితిలోనే శ్రీకృష్ణ నామజపం కొనసాగించాడు♪. ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల్లోనే గాయాల నుంచి కోలుకుని, పూర్తి స్వస్థత పొందాడు♪.

🪷 దేవదేవుడైన మహావిష్ణువే శ్రీకృష్ణుడిగా పూరీలో జగన్నాథుడి రూపంలో కొలువై ఉన్నాడని, ఆర్తితో ప్రార్ధించే భక్తులను తప్పక రక్షిస్తాడని తల్లి ద్వారా తెలుసుకుని, జగన్నాథుడి దర్శనం కోసం పూరీ శ్రీక్షేత్ర ఆలయానికి వెళ్లాడు. ముస్లిం అయినందున పూజారులు అతణ్ణి ఆలయం లోపలకు దర్శనానికి అనుమతించలేదు. పూరీలోని మఠాల్లో తలదాచుకునేందుకు సైతం నిరాకరించారు. దాంతో రథయాత్ర సాగే 'బొడాదండా' మార్గంలోనే ఒక పక్కగా చిన్న పూరిపాక కట్టుకుని, అందులో తలదాచుకున్నాడు.

🪷 ఏనాటికైనా జగన్నాథుడి దర్శనం లభించకపోతుందా  అని ఎదురు చూడసాగాడు. ఈలోగా కటక్ సుబేదారు మీర్జా అహ్మద్ బేగ్ పూరీపై దండయాత్రకు సిద్ధపడ్డాడు. సంగతి తెలుసుకున్న సాలబేగ్, అతడి వద్దకు వెళ్లి నచ్చజెప్పి దండయాత్ర ప్రయత్నాన్ని విరమింపజేశాడు. సాలబేగ్ చేసిన సాయానికి పూరీరాజు నరసింగదేవ్ ఆనందభరితుడయ్యాడు. ఏం కావాలో కోరుకొమ్మంటే, తనకు జగన్నాథుని దర్శనం చాలన్నాడు సాలబేగ్. అతడికి ఆలయ ప్రవేశం కల్పించాలని పూరీ రాజు స్వయంగా కోరినా, ఆనాటి ఛాందస పూజారులు అందుకు నిరాకరించారు♪.

🪷 ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఎంతగా తపించినా, చివరకు రాజు సానుకూలంగా ఉన్న పూజారుల దాష్టీకం కారణంగా జగన్నాథుడి దర్శనం లభించనందుకు సాలబేగ్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఆ నిరాశతోనే శ్రీకృష్ణుడు నడయాడిన బృందావనంలోనైనా కాస్త సాంత్వన పొందుదామనే ఉద్దేశంతో కాలినడకన బృందావనానికి బయలుదేరాడు♪. బృందావనంలో అక్కడి సాధుసజ్జనుల గోష్ఠిలో కాలక్షేపం చేస్తూ, దేవదేవుడైన జగన్నాధునిపై కీర్తనలు రచించి, గానం చేయసాగాడు. ఈలోగా రథయాత్ర తరుణం రానే వచ్చింది♪. రథయాత్రలో కులమతాలకు అతీతంగా ఎవరైనా జగన్నాథుని దర్శనం పొందగలిగే వీలు ఉండటంతో, ఎలాగైనా జగన్నాథుని దర్శనం చేసుకోవాలని బృందావనం నుంచి పూరీ వైపు నడక ప్రారంభించాడు. తోవలో అనారోగ్యానికి లోనయ్యాడు♪. రథయాత్ర నాటికి పూరీ చేరుకోలేకపోయాడు♪. 

🪷 ఆషాఢ శుక్ల దశమినాడు జరిగే తిరుగు రథయాత్ర 'బాహుడా' నాటికైనా పూరీ చేరుకుంటానని, ఒకవేళ తాను రావడం కాస్త ఆలస్యమైతే తన కోసం దయచేసి ఆగమంటూ జగన్నాథుడిని మనసులోనే ప్రార్ధించాడు. తిరుగు రథయాత్ర కోసం జగన్నాథుడిని రథం పైకి ఎక్కించారు. రథం కొద్ది దూరం మాత్రమే ముందుకు సాగింది♪. సాలబేగ్ ఇంకా రాలేదు. అక్కడి నుంచి ఎందరు భక్తులు జయజయ నినాదాలు చేస్తూ లాగినా, రథం అంగుళమైనా ముందుకు కదల్లేదు♪. ఎట్టకేలకు సాలబేగ్ పారవశ్యంతో గానం చేస్తూ రథానికి ఎదురు వచ్చాడు. రథంపై కొలువైన జగన్నాథుడిని తనివితీరా చూసుకున్నాడు. స్తోత్రాలు ముగించి, రథానికి తోవ ఇస్తూ పక్కకు జరిగాడు. అప్పుడు కదిలింది రధం. అంతవరకు కదలని రథం సాలబేగ్ రాక తర్వాతే కదలడంతో, సాక్షాత్తు జగన్నాథుడే తన భక్తుడి రాక కోసం నిరీక్షించాడని భక్తులందరూ అర్ధం చేసుకున్నారు♪. జగన్నాథుని మహిమలను, సాలబేగ్ భక్తితత్పరతలను వారు జయజయ ధ్వానాలతో వేనోళ్ల కీర్తించారు♪. జగన్నాథుని రథం నిలిచిన చోటనే కూర్చొని సాలబేగ్ అనేక కీర్తనలను రచించి, గానం చేశాడు. మరణించిన తర్వాత సాలబేగ్ ను అక్కడే సమాధి చేశారు. ఇప్పటికీ తిరుగు రథయాత్రలో జగన్నాథుని రథాన్ని సాలబేగ్ సమాధి ఉన్న ప్రాంతంలో లాంఛనప్రాయంగా కొద్దిసేపు నిలిపి ఉంచుతారు♪. శతాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది♪.

🪷 సాలబేగ్ ఒడియా, బెంగాలీ, హిందీ, సంస్కృత భాషల్లో జగన్నాథునిపై రచించిన కీర్తనలను నేటికీ గానం చేస్తుంటారు♪. సంస్కృతంలో ఆయన రచించిన 'పతిత పావనాష్టకం' సుప్రసిద్ధం♪. సాలబేగ్ ఒడియా కీర్తనలు ఒడిశా నలుమూలలా ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. సాలబేగ్ కు పూరీ శీక్షేత్రంలోకి ప్రవేశం లభించకపోయినా, ఆయన కీర్తనలు మాత్రం శీక్షేత్రంలో నిరంతరం మార్మోగుతూనే ఉంటాయి♪. సాలబేగ్ జీవిత చరిత్ర విపులంగా ఎక్కడా నమోదు కాలేదు. అతడి జీవితానికి సంబంధించిన కొద్దిపాటి ఆధారాలు అతడి కీర్తనల్లో దొరుకుతాయి♪. మరికొన్ని వివరాలు పద్దెనిమిదో శతాబ్దినాటి ఒడియా కవి రామదాసు రచించిన 'దార్య భక్తి రసామృత' గ్రంథంలో దొరుకుతాయి♪.

        ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩

🙏🥀🌹🪷🌻✳️🪷🌻🥀🌹🙏

No comments:

Post a Comment