🌹గుడ్ మార్నింగ్ 🌹మనము ఎక్కడనుండి వచ్చామో మనకు తెలియదు. చివరిలో ఎక్కడకు వెళతామో మనకు తెలియదు. ఇక్కడకు ఇలాగే ఎందుకు వచ్చామో తెలియదు. ఈ శరీరముతో ఈ పరిస్థితులలో ఎందుకు ఇలాగే జీవిస్తున్నామో తెలియదు. మన శరీరపు లోపలి పని తీరు - శరీర ఎదుగుదల మన ప్రమేయము లేకుండా దానంతట అదే ఎందుకు - ఎలా జరిగిపోతున్నదో తెలియదు. మన చుట్టూ ఉన్న అనంత విశాల సృష్టి మనకు అన్ని సమకూరుస్తూ, మనను, మనతో సహా అనేక జీవరాసులను ఎందుకు పుట్టించి, పోషించి,తనలోనే ఎందుకు లయింప చేసుకుంటున్నదో తెలియదు. బ్రతికే ప్రతి సెకను ముందు ఏమి జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఎంతకాలము ఉంటామో తెలియదు ... ఇలా తెలియనవి ఎన్నో ....
తెలియని ఇన్నిటి మధ్య నేను అని తెలిసే శరీరం - అనుభవాలు, బంధాలు, అనుబంధాలతో అన్నీ తెలుసుకుంటున్న మనసు - జీవితముపై అనేక ఆశలతో ఏవేవో కావాలంటూ తెలుస్తూ కదలాడే మనసు... ప్రతి విషయములో తప్పు - ఒప్పు తెలుసుకుంటున్న బుద్ది - అసలు తప్పే చేయకూడదు - మంచిగా మాత్రమే జీవించాలని తెలియచేప్పే జ్ఞానము...
తెలియని వాటి గూర్చి తలలు పాడు చేసుకోకుండా - తెలిసిన వాటితో, తెలిసినంతలో, మంచిగా జీవించటం తప్ప నిజముగా మనం ఏమి చేయగలము? భక్తి,
ఆధ్యాత్మికము, ఆత్మజ్ఞానము అని ఎన్ని తెలుసుకున్నా... ఎంత తెలుసుకున్నా.... అది భావరూప అంతర్గత జ్ఞానమే....
ఇప్పుడు ఇక్కడ ఈ శరీరముతో ఇలా జీవించక తప్పదు. అది తెలుస్తున్న మంచితో మాత్రమే జీవించటం ఆధ్యాత్మికము...
No comments:
Post a Comment