*ఆచమనం మంత్రాల భావం*
*ఓం కేశవాయ స్వాహాః*
కేసి అనే రాక్షసుని చంపిన
దైవానికి నమస్కారం
*ఓం నారాయణాయ స్వాహాః*
చుట్టూ నీటి మధ్యలో ఉన్న
దైవానికి నమస్కారం
*ఓం మాధవాయ స్వాహాః*
మాధవి (లక్ష్మీదేవి) భర్తకు
నమస్కారం
*ఓం గోవిందాయ నమః*
గోవులను రక్షించు
దైవానికి నమస్కారం
*ఓం విష్ణవే నమః*
విశ్వమంతా నిండిఉన్న
దైవానికి నమస్కారం
*ఓం మధుసూదనాయ నమః*
మధు అనే రాక్షసుని చంపిన
దైవానికి నమస్కారం
*ఓం త్రివిక్రమాయ నమః*
3 లోకాలను ఆక్రమించిన
దైవానికి నమస్కారం
*ఓం వామనాయ నమః*
వామన అవతార రూప
దైవానికి నమస్కారం
*ఓం శ్రీధరాయ నమః*
లక్ష్మీని వక్షస్థలాన ధరించిన
దైవానికి నమస్కారం
*ఓం హృషీకేశాయ నమః*
ఇంద్రియాల అధిపతి
దైవానికి నమస్కారం
*ఓం పద్మనాభాయ నమః*
నాభిలో పద్మం కలిగిన
దైవానికి నమస్కారం
*ఓం దామోదరాయ నమః*
కడుపు చుట్టూ తాడు
కడుపులో లోకాలున్న
దైవానికి నమస్కారం
*ఓం సంకర్షణాయ నమః*
ప్రళయాన అన్నీ ఆకర్షించి
మింగే దైవానికి నమస్కారం
*ఓం వాసుదేవాయ నమః*
వసుదేవ సుతునికి నమస్కారం
*ఓం ప్రద్యుమ్నాయ నమః*
తేజో రూపునకు నమస్కారం
*ఓం అనిరుద్దాయ నమః*
ఎవరూ జయించ లేని
దైవానికి నమస్కారం
*ఓం పురుషోత్తమాయ నమః*
ఉత్తమ దైవానికి నమస్కారం.
*ఓం అధోక్షజాయ నమః*
భూమి ఆకాశం మధ్యవున్న
దైవానికి నమస్కారము
*ఓం నారసింహాయ నమః*
నర+సింహ రూపంలో ఉన్న
దైవానికి నమస్కారము
*ఓం అచ్యుతాయ నమః*
నశించని దైవానికి నమస్కారం
*ఓం జనార్ధనాయ నమః*
జనులు మేలు కోరి పూజించే
దైవానికి నమస్కారము
*ఓం ఉపేంద్రాయ నమః*
ఉప+ఇంద్ర = ఉపేంద్ర
ఇంద్రుని తమ్మునికి నమస్కారం
*ఓం హరయే నమః*
ప్రళయాన అంతా
విష్ణువుకు నమస్కారం
*ఓం శ్రీకృష్ణాయ నమః*
అంతా ఆకర్షించు నల్లని
దైవానికి నమస్కారం
🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment