Saturday, July 13, 2024

దివ్యత్వముకు వున్న ప్రత్యేకత ఏమిటి??*

                *_నేటి మాట_*

*దివ్యత్వముకు వున్న  ప్రత్యేకత ఏమిటి??*

" సృష్టి , స్థితి ,  లయము!!..." ఈ మూడింటికీ  , ముగ్గురు ప్రధానులు న్నారు!!...
సమస్త జీవుల చేత, సమస్త నియమములను, పాటింపజేయుటే ఈ సృష్టి యొక్క ఘనత. 
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఈ బాధ్యత అప్పగించబడింది... 
ఈ త్రిమూర్తులకు , అధిపతి దైవము , *ఆయనే GOD*
ఈ ముగ్గురూ కేవలం మినిష్టర్స్ వంటి వారు మాత్రమే...
వారందరి పై, అధికార, ఆధిపత్యము వహించినవాడు, దేవుడు మాత్రమే...
ఈ దైవము, అణు స్వరూపుడై, సర్వత్రా  వ్యాపించి  యున్నాడు. 
ఇతని పేరే ఆత్మ , ఇదే యావత్ సృష్టినంతా పరిపాలన జరుపు చున్నది!!...
కేవలం సాక్షీభూతుడుగా ఉన్నాడు కాని, ఫలము మాత్రమూ మనకు మనమే అనుభవించాలి...
*మరి మనము ఏమి చేయాలి???*
ఈ త్రిమూర్తులతో మనం స్నేహం సంపాదించు కోవాలి, వారిని ప్రసన్నం గావించుకొనే, నిమిత్తమై, నామస్మరణ, జపము, ధ్యానము చేయాలి!!...

దైవము ధర్మ స్వరూపుడు, ఏ రూపమునైనా, ధరించవచ్చు ,  కాబట్టి సాకారం, నిరాకారముగాను కూడా దైవమే ఉంటుంది ( మట్టి, కుండ,లాగ ) ఐతే, మన హృదయము, దైవ భావముతో, సంపూర్ణముగా నింపుకుని, డైరెక్ట్ గా దైవముతోవే సంబంధ బాంధవ్యాలు కల్పించు కోవాలి. 
*ఎలా?*
అదే శరణా గతి, ఇప్పుడు మనం చేసే భజనలు సాధనలు, జపములు , తపములు, అన్నీ ( కోరికలతో చేస్తే )ఒక డిపార్ట్మెంట్ కు మాత్రమే పరిమిత మౌతాయి!!....
(కోరికలు) మన ప్రవర్తన బాగుంటే, ప్రార్థన హృదయపూర్వకముగా ఉంటే, అపుడు దానికి సంబంధించిన "డిపార్ట్మెంట్ కు" తాను తెలియజేసి కర్మ యొక్క, దుష్ట ఫలితాలను రద్దు చేయిస్తాడు!!... 
అదే దివ్యత్వము యొక్క ప్రత్యేకత...

               *_🌹శుభమస్తు.🌹_*
 *🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*

No comments:

Post a Comment