Wednesday, July 3, 2024

 *ఆలయంలో భారీగా బంగారు నిధి ఉందని అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది కేరళ లో గల అనంత పద్మనాభస్వామి వారి ఆలయం*.

*తాజాగా అదే ఆలయం తరహాలో మరో ఆలయం వెలుగులోకి వచ్చింది. అనంతపద్మనాభ స్వామి దేవాలయం తరహాలోని ప్రముఖ క్షేత్రం జగన్నాథ ఆలయంలోనూ అపార సంపద ఉందని చాలా మంది నమ్ముతున్నారు. ఆ గుడిలోని రత్న భాండాగారంలో అంతుచిక్కని నిధినిక్షేపాలు ఉన్నట్లు సమాచారం.*

*దాదాపు 40 ఏళ్ల నుంచి ఆ నిధి ఉండే గది తెరవలేదు. దీంతో అప్పటి నుంచి ఆ భాండాగారంలో ఏ స్థాయిలో నిధులు ఉన్నాయని తెలుసుకోవాలనే ఆసక్తి భక్తుల్లో ఉండేది. ఏళ్ల తరబడి చేసిన భక్తుల నిరీక్షణకు తెరపడింది. జులై 7 తర్వాత స్వామివారి ఆలయంలోని ఈ ఖజానాను తెరవనున్నట్టు పురావస్తుశాఖ బుధవారం ప్రకటించింది. అంతేకాక లోపల మరమ్మత్తులు చేపడతామని పేర్కొంది.*

*ఇటీవల ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసింది. ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన వాగ్ధానం ప్రకారం.. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాలు తెరిచి భక్తులను అనుమతించింది.*

*తాజాగా, రత్నభాండాగారంపై ఒడిశా ప్రభుత్వం దృష్టిసారించింది. 2019 ఫిబ్రవరి 4న నిపుణుల కమిటీ రత్నభాండాగారం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించి విఫలం అయ్యింది. తాళం చెవి కనిపించకపోవడంతో లోపలికి వెళ్లలేకపోయారు. గోడలు, పైకప్పు బలహీనంగా మారి, పగుళ్లు ఏర్పడినట్లు కమిటీ సభ్యులు గుర్తించారు. ప్రస్తుత మరమ్మతులు జరుగుతాయని ఆలయ అధికారులు వివరించారు. స్వామివారి ఆభరణాల లెక్కింపు అంశంపైనా అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.*

*ఇక ఈ ఆలయ విషయానికి వస్తే..అక్కడి రత్నా భాండాగారాన్ని 1976లో తెరిచి సంపదను లెక్కించి..వాటి వివరాలను భద్రపర్చారు. ఈ జగన్నాథ ఆలయంలోని ఏడు గదుల్లో విలువైన నగలు, వజ్రవైడూర్యాలు ఎన్నో ఉన్నాయని సమాచారం. కొన్నేళ్ల నుంచి అనేక మంది రాజులు, భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కిస్తుంటారు.అలానే తిరిగి భద్రపరచాలని 1984లో అప్పటి ఆలయ అధికారులు భావించారు.*

*ఈ క్రమంలోనే తొలుత మొదటి మూడు గదులను తెరచి సంపదను లెక్కించారు. నాలుగవ గది దగ్గరకు వచ్చేసరికి అక్కడ నుంచి పాములు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించాయి. దీంతో మిగిలిన గదులను తెరవకుండా లెక్కింపును ఆపేశారు. అప్పడు మూసిన తలుపులు దాదాపు 40 ఏళ్ల పాటు ఇప్పటి వరకు తెరవలేదు.*

No comments:

Post a Comment