*అర్థం పర్ధం లేని ఈ జీవితాన్ని వ్యర్ధంగా గడిపి మరుజన్మకు మనమే పునాది వేస్తున్నాం.*
ఈ సృష్టిలో సుఖంగా శాంతంగా ఉండేది ఇద్దరే ఇద్దరు ఒకటి, పసిపిల్లలు, రెండు, మహర్షులు.
మొదటివాడు ఏమీ తెలియని అజ్ఞాని రెండవ వారు అన్ని తెలిసిన జ్ఞాని మొదటివాడు ఏమి తెలియకుండా ప్రశాంతంగా ఉన్నాడు.
రెండవ వారు అన్నీ తెలిసి ప్రశాంతంగా ఉన్నారు. ఇక మధ్యలో ఉన్న మనమే అటు కాకుండా ఇటు కాకుండా ఈ అంతులేని కోరికలతో హద్దులేని ఆశలతో సతమతమైపోతున్నాం.
అన్నీ నాకే తెలుసు అన్నా అహంకారం ప్రతి ఒక్కరిని ఆవహించి ఉంటుంది. అందుకే నేను అన్న అహంకారాన్ని గురుకృప చే తొలగించుకుని ఈ జన్మ పరంపరాన్ని ఇక్కడితోనే ముగించుకుందాం.
మన తాత ముత్తాతలు ఎందరో వచ్చారు. వెళ్లిపోయారు వారు తీసుకొచ్చిందేంటి తీసుకుపోయింది ఏంటి.
ఏమీ లేదు కదా రేపు మనం కూడా అంతే కంటికి కనిపించే దాని కోసం కాదు మన ఆరాటం కంటికి కనిపించని శక్తిని గురించి ఆరాటపడదాం.
కంటికి కనిపించేదంతా నశించిపోయేదే ఈ శరీరమైన ఈ జగమైన. కంటికి కనిపించనిదే శాశ్వతమైనది. కంటికి కనిపించని దాన్ని ఎవరు చూపిస్తారు అని అంటారా. అందుకే కదా సద్గురు దేవుడు ఉన్నది.
మనిషి సంపాదించుకోవాల్సింది ఆస్తి అంతస్తులు కాదు సద్గురువులను. రామచంద్రమూర్తికి ఆస్తులు లేక కాదు వశిష్టుల దగ్గర శిష్యరికం చేసింది.
కృష్ణుడు తనకు ఆస్తులు లేక కాదు సాందీపుని దగ్గర శిష్యరికం చేసింది. అంతటి మహనీయులకే గురువుల అవసరమైనప్పుడు మానవులం మనం ఎంత.
ఒకసారి ఆలోచిద్దాం ఈ జన్మని కడ తేర్చుకుందాం. ఒక మనిషి చనిపోయినప్పుడు మనం చూస్తాం కదా అంతవరకు కదులుతున్న మనిషి కదలకుండా నిర్జయం నిర్జీవంగా పడి ఉండడానికి గల కారణం ఏమిటి.
కంటికి కనిపించని శక్తి తన లోపల నుండి వెళ్లిపోయిందనే కదా అర్థం మరి అలాంటప్పుడు ఆశక్తి లేదని ఇలా అనుకుంటే సరిపోతుందా మానవునికి మాత్రమే
ఇన్ని తెలివి తేటలిచ్చాడు ఆ భగవంతుడు వాటిని ఆస్తులు సంపాదించుకోవడానికి మంది కొంపలు ముంచడానికి కాకుండా తనని తను కడుతెర్చుకోవడానికి ఉపయోగించుకుందాం.
No comments:
Post a Comment