Tuesday, July 16, 2024

అమృత వాక్కు

🌺 *అమృతం గమయ* 🌺

*అమృత వాక్కు - ప్రతి నిత్య దీక్ష*

బాధలో ఉన్న సాటి జీవికి నీకు చేతనైనంతలో చేయూతనివ్వు.  నాకెందుకులే అన్నట్టు ఉంటే, నీ బాధల్లో అత్యవసరానికి కూడా నీ పక్కన ఎవరూ ఉండరు.

అజ్ఞానమనే అంధకారాన్ని తీసివైచి, జ్ఞానమనే వెలుగుని నింపి నీ జీవితాన్ని సత్య మార్గంలో నడిపించేదే విద్య. 

ధనం వలన అహంకారం, లోభత్వం ఏర్పడితే, ఆ ధనం దరిద్రం అవుతుంది కానీ సంపద మాత్రం కాజాలదు. 

ఆశ ఎక్కువయ్యే కొలది అడ్డదారులు ఎక్కువ అవుతాయి.

మనశ్శాంతి లేని ఇల్లు ఎంత రాజ భవంతి అయినా దండగే.

సర్వే జనా సుఖినో భవంతు.

--సత్ చిత్

No comments:

Post a Comment