Saturday, July 20, 2024

*****సంసారమంటే.... శ్రీ రమణమహర్షి

 సంసారమంటే....
శ్రీ రమణమహర్షి
‘సాధకుల అంతరాయాలకు సంసారమే కారణమని ఎక్కువమంది ఆరోపిస్తుంటారు. ఇది నిజమేనంటారా స్వామీ?' - అని అడిగాడు శిష్యుడు.
ఆ ప్రశ్నకు రమణ మహర్షులు సమాధానమిస్తూ...
*'సంసారం బయటకు కనిపించేదా, మనలోనే ఉందా?'* అని ఎదురు ప్రశ్నించారు రమణులు.
'ఉహూ మనలోపల కాదు, బయటదే! అది భార్యాబిడ్డల రూపంలో అడ్డు వస్తోంది' అన్నాడతను.
దానికి ఆయన నవ్వి, 'అలాగే అనుకుందాం! కానీ నువ్వు చెబుతున్న సంసారాన్ని వదిలి ఇక్కడుంటే ఇదొక సంసారం కాదా? పోనీ, కమండలం ధరించి కూర్చుంటే అది సంసారం కాదా?' అన్నారు.
శిష్యుడు ఆశ్చర్యపోయి, *'ఇంతకీ సంసారానికి నిర్వచనమేంటి?* అన్నాడు.
*'మనలో జరిగే నిత్య సంఘర్షణ, పోరాటాలే సంసారం. అంటే మనసే అసలైన సంసారం.* ఆ చంచలత్వాన్ని అదుపులో పెట్టలేక కుటుంబసభ్యులను నిందిస్తుంటాం. వాస్తవానికి వారు మనకి ధర్మ సాధనలో తోడ్పడతారు. *భౌతిక సంసారాన్ని సజావుగా నిర్వహించ గలిగినప్పుడే మానసిక సంసారాన్ని అదుపుచేయగలం.*
సంసారాన్ని క్షణంలో వదిలేయొచ్చు. కానీ అది ధర్మశాస్త్రరీత్యా పాపం. అలా చేయ కూడదు' అంటూ వివరించారు రమణులు.

No comments:

Post a Comment