Saturday, July 20, 2024

 #భారతదేశ_బాహుబలి_దేవాలయం 
#తంజావూరు #బృహదీశ్వరాలయం...!!🥰🥰🥰

చోళులు నిర్మించిన ఆలయం #తంజావూరు #బృహదీశ్వర_ఆలయం తమిళనాడు లో ఉంది. వేయి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఆలయం. 

ఈనాటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా లేని నాటి కాలంలో ఎటువంటి ఇనుమును కానీ, సిమెంట్ కానీ ఉపయోగించకుండా,అధునాతన యంత్రాలు కూడా లేని రోజుల్లో కట్టిన ఒక దేవాలయం.

ఆలయం ప్రత్యేకతలు:
రాజ రాజ చోళుడు క్రీ.శ. 1010 వ సంవత్సరంలో చరిత్ర లో నిలిచిపోయే రీతిలో గ్రానైట్ రాతితో నిర్మాణం జరిగింది...!!

విచిత్రం ఏమిటంటే చుట్టూ ఉన్న 100కీమీ రేడియస్ లో గ్రానైట్ కొండలు లేవు...!!

ఆలయం ప్రాంగణం పోడవు 793 అడుగులు.... గోపురం ఎత్తు 216 అడుగులు, వెడల్పు 393 అడుగులు....!!

ఆలయ గోపురం పైకప్పు నిర్మాణానికి 80టన్నుల బరువు ఉండే ఏకశిల ను ఉపయోగించారు...!!

ఆలయ నిర్మాణంలో లో ఎలాంటి పూత పూయలేదు. పునాదులు మెదలు పీఠాలు, గోపురం, శిఖరం.... ఇలా అన్నీ పూర్తిగా రాయి మీద రాయిగా పేర్చి నిర్మించారు...!!

మరో విశేషం ఏమిటంటే... గోపురం యొక్క నీడ మధ్యాహ్న సమయంలో  ఏక్కడ కనిపించదు...!!

1954 లో భారతదేశంలో తొలి వెయ్యి నోటు పై బృహదీశ్వరాలయం బొమ్మను ముద్రించారు....!!

ముఖ్యమైన విషయాలు :
 
1.ఎక్కడా సిమెంట్ వాడలేదు, ఉక్కు వాడలేదు.. 
2. త్రుప్పు నివారణకై ఏ రసాయనిక చర్యలూ తీసుకోలేదు.. కేవలం గ్రానైట్ రాయిని ఉపయోగించి నిర్మించిన వేయి సంవత్సరాల కట్టడం.. ఈ తంజావూరు బృహదీశ్వరాలయం.. 
3. చోళరాజుల నిర్మాణ కౌశల్యత్వానికి మచ్చుతునక.. అందుకే ఇది ప్రపంచ వారసత్వ సంపద అయింది.. 
4. ఈ ఆలయాన్ని క్రీ.శ 1004లో ప్రారంభించి 1009 లో పూర్తి చేసారు. కేవలం ఐదు సంవత్సరాలలో ఇంతపెద్ద ఆలయాన్ని నిర్మించడం అప్పటి రాజుల నిర్మాణకౌశల్యతకు నిదర్శనం. అవును ఈ ఆలయాన్ని నిర్మించి వేయి సంవత్సరాలయింది. బహు పురాతన ఆలయమిది.. అందుకే ప్రపంచ వారసత్వ సంపద వారు దీనిని రక్షిత ప్రదేశంగా పరిగణించారు... 
5. ఇది చాలా సువిశాల మైన ప్రదక్షిణా మండపాలు కలిగిఉన్న ఆలయం. 
6. ఈ దేవాలయంలో ప్రధాన దైవం అయిన "లింగం" 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. మొదట్లో కేవలం రాజు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించుకునే వాడట.. తర్వాత్తరాత దీనిని సామాన్య జనం కూడా దర్శించుకునే విధంగా తీర్చిదిద్దారు... 
7. అంత పెద్ద శివ లింగానికి  నందీశ్వరుడు కూడా భారీగా ఉండాలనుకున్నారో ఏమో అతి పెద్ద నంది విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మించారు. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2, 6 మీటర్ల పొడవు మరియు 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.
ఈ దేవాలయ ప్రాకారం ఎంత పొడవంటే దాదాపు 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. అంటే నాలుగు ప్రదక్షిణాలు చేస్తే ఒక కిలోమీటరు దూరం నడిచినట్లు... ఔరా ఎంత పెద్దగా ఉండి ఉంటుంది గుడి... 
8. ఎంత సువిశాలంగా ఉన్న ఇక్కడ ప్రతిధ్వని ఉండదు.. అదే మన ప్రాచీన భారతీయ ఇంజనీర్ల ప్రతిభ.
9. ప్రధాన దేవాలయ గోపురకలశం మొత్తం ఒకే శిలతో రూపుదిద్దుకుని 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినది. అంత ఎత్తుకు ఇంత పెద్ద గోపుర కలశాన్ని వేయి ఏళ్ళ క్రితం ఎలా తీసుకెళ్ళారో చాలా అద్భుతంగా ఉంటుంది... 
10. ఈ ఆలయ గోపురాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు(ఎందుకంటే దాదాపు ఏడు అంతస్థుల భవనమంత ఉంటుంది మరి)
11. ఈ ఆలయ నిర్మాణమంతా కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు మరియు వాస్తుశిల్పి చే చేయబడినది.
12..ఇక్కడ ఈ ఆలయాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన రాళ్ళు పరిసర జిల్లాలలో కనపడవు.. అంటే వేరే ప్రదేశం నుండి తరలించినది..
ఇది కూడా విచిత్రమే...
ఈ ఆలయ పరిసరాలలోనే వివిధ భాషలలో తాళపత్ర గ్రంథాలను చూసాము... ఇక్కడ అతి పెద్ద పురాతన గ్రంథాలయం... మ్యూజియం.. మహళ్ళు చాలా బావుంటాయి.. ఒకరోజు పూర్తిగా సరిపోయేంత దర్శనీయ స్థలాలున్నాయి.

రాజ రాజ చోళుడు 6 వ పరిపాలనా సం.లో కట్టించినట్లు చరిత్ర చెబుతుంది.

No comments:

Post a Comment