Tuesday, July 23, 2024

 *గాయత్రీ మహావిజ్ఞానము* 


జ్ఞానము అయితే ఉండవచ్చు కానీ, జ్ఞానానికి తగినటువంటి క్రియాశక్తి మనలో లేదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను థాట్ పవర్ గురించి చెప్తున్నాను. The Power of Thought. జ్ఞానము ఉంది మనకి. 

ఏంటి జ్ఞానం ఉంది మనకి? కంట్రోల్డ్ ఫుడ్, కంట్రోల్డ్ హ్యాబిట్స్ (controlled food, controlled habits) ఉంటే బ్లడ్ ప్రెషర్ మనని ఏమీ చేయలేదు. It can be eradicated.  కానీ భోజనం దగ్గర కూర్చున్నాం అనుకోండి.....


 మాకు సిగరెట్ మానాలని ఉంది మాస్టారు అని ఎంతమంది అడిగారో నన్ను. ఇలా ఆశీర్వాదం ఇచ్చేయండి మాస్టారు -  నేను మానేస్తాను.‌ జరగదు అది.

" అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే|
 తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం వహామ్యహమ్||" 
 (భ.గీత...9/22)

నువ్వు నీ చిత్తంలో -  చిత్తము అంటే ఇందాక ఏ ప్లేన్ ఆఫ్ మైండ్ అని చెప్పాను? చిత్తము -  సబ్కాన్షియస్ మైండ్ - అచేతన మనస్సు.‌  నీ అలవాట్లు, దె డామినేట్ ఆల్వేస్ (They dominate always). నీకు ఎంత జ్ఞానముతో, ఎంత నీ బుర్రలో, ఇది తప్పు నాయనా చెయ్యకు అని చెప్పబడుతున్నా, నీకు నీ సబ్కాన్షియస్ మైండ్లో కంట్రోల్ లేదు.‌ నీకు చిత్తము మీద కంట్రోల్ లేదు.‌ Helpless. 
"అవశం  ప్రకృతేర్వశాత్ " వశం అయిపోతాం. 

 ఆ చిత్తంలోకి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి హాబిట్స్ ని  మార్చగలిగేటటువంటి శక్తి గాయత్రీ మంత్ర అక్షరాలలో ఉంది. అందుచేత మీరు మెకానికల్ గా రోజుకి కనీసం ఒక గంట సేపు గాయత్రీ మంత్ర జపం చేసుకుంటూ ఉంటే, మెల్లిమెల్లిగా మీరు శ్రద్ధా -  విశ్వాసము అనేటటువంటి శక్తికి దగ్గరవుతారు.  శ్రద్ధా - విశ్వాసము అంటే చిత్తము - అహంకారము. లేకపోతే సబ్కాన్షియస్ మైండ్ - సూపర్ కాన్షియస్ మైండ్.

                ----- *మాస్టర్ R.K* 

 జై గురుదేవ్
🙏🙏🙏

No comments:

Post a Comment