Tuesday, July 23, 2024

ఆజాద్ చంద్రశేఖర్ జయంతి శుభాకాంక్షలు

 *ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
ఆజాద్ చంద్రశేఖర్ జయంతి శుభాకాంక్షలు 
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

*ఒక బాలుడు కాశీలో చదువుకొంటూ ఉన్నాడు. పేదవాడు కావడం వల్ల వారాలు చేసుకొనేవాడు. 
అవి స్వాతంత్య్ర పోరాటం ముమ్మరంగా జరిగే రోజులు. సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. స్వాభిమానం, దేశభక్తి నిండుగా ఉన్న ఆ పేదబాలుడు ఉత్సాహంగా ఉద్యమంలో పాల్గొన్నాడు.పేరు చంద్రశేఖర్‌. రక్షకభటులు ఆ బాలుడిని బంధించి న్యాయాధిపతి ముందుంచారు.*

*‘నీ పేరేమిటి?’ ప్రశ్నించాడు న్యాయాధిపతి. 
‘ఆజాద్‌!’ ఆ బాలుడు నిబ్బరంగా జవాబు చెప్పాడు. ఆజాద్‌ అంటే ‘స్వేచ్ఛ’ అని అర్థం! ఈ జవాబుతో న్యాయాధిపతికి బాలుడిపై ఏదో అనుమానం వచ్చింది.*

*‘నీ తండ్రి పేరు?’*

*‘స్వాధీన్‌!’ బాలుడి సమాధానం విని న్యాయాధిపతి కనుబొమలు ముడివడ్డాయి. స్వాధీన్‌ అంటే స్వాతంత్య్రం అని అర్థం.*

*‘మీ ఊరు ఏది?’*

*‘చెరసాల!’ అన్నాడు బాలుడు ఠక్కున.*

*ఈ జవాబుతో న్యాయాధిపతికి బుర్ర గిర్రున తిరిగింది. కోపంతో ‘16 కొరడా దెబ్బలు’ శిక్ష విధించాడు. కాశీ కేంద్ర కారాగారంలో శిక్షను అమలు చేశారు. ప్రతి దెబ్బకు ‘వందే మాతరం’ అన్నాడు ఆ బాలుడు. అతడి ధైర్యానికి రక్షకభటులు ఆశ్చర్య చకితులయ్యారు. నాటినుంచి అతడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ అనే పేరుతో ప్రఖ్యాతిచెందాడు. ఇటువంటి ధీరత్వమే మన స్వాతంత్య్రయోధులను ముందుకు ఉరికించింది...చంద్రశేఖర్ ఆజాద్ భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఉద్యమకారుడు.
 జూలై 23,1906లో జన్మించాడు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో భగత్ సింగ్ ముఖ్య అనుచరుడిగా కొనసాగినాడు...
ఈరోజ చంద్రశేఖర్ ఆజాద్ జయంతి.*

No comments:

Post a Comment