*వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు.*
*1.తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు.*
*2.విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు.*
*3.విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారికి తెలియచేయవలెను.*
*4.పార్కులలో గాని స్టేడియంలో గాని విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు.*
*5.ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాదు.*
*6.బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి.*
*7.కరెంటు కు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోరాదు.*
*8.చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి.*
*9.ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు.*
*10.గాలి, దుమారం, వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు.*
*11.ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతనే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టవలెను.*
*12.ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు "డిష్ " కనెక్షన్ తీసివేయవలెను.*
*13.వర్షం పడుచున్నప్పుడు టీవీ, ఫ్రిడ్జ్, వాటర్ మోటర్స్ మరియు కంప్యూటర్ ల యొక్క స్విచ్ లను ఆఫ్ చేయవలెను, లేనిచో వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది.*
*14.కరెంటు లైన్ క్రింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు.*
*15.ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైన డ్యామేజ్ అయినచో సంబంధించిన అధికారి దృష్టికి తీసుకెల్లాలి. ప్రతి కరెంటు వస్తువు కు "ఎర్త్ " తప్పనిసరిగా ఉండాలి.*
ఇట్లు మీ విద్యుత్ శాఖ, APEPDCL.
No comments:
Post a Comment