*🍁ఖాళీ పడవ*🍁
✍️ మురళీ మోహన్
*👉ఒక ముని ప్రశాంతంగా ధ్యానం చేసుకుందామని ఒక చిన్న పడవను తీసుకుని, తన ఆశ్రమానికి దూరంగా వెళ్ళి, సరస్సు మధ్యలో ఆపి, ధ్యానంలో నిమగ్నమౌతాడు.*
*నిరాటంకంగా కొన్ని గంటల పాటు ధ్యానం చేసిన తర్వాత, తన పడవను మరొక పడవ ఢీకొట్టడంతో, ధ్యానానికి భంగం కలిగేసరికి, అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.*
*తన ధ్యానానికి భంగం కలిగించిన వాడిని శపించాలన్నంత కోపంతో కళ్ళు తెరుస్తాడు.*
*కానీ, అక్కడ ఒక ఖాళీ_పడవ మాత్రం ఉంటుంది. అందులో మనుష్యులు ఒక్కరూ లేకపోయే సరికి ఆశ్చర్యపోతాడు.*
*అది గాలువాలుకు కొట్టుకు వచ్చిందేమోనని అనుకుంటున్న క్షణంలోనే, అతనికి ఒక సత్యం గోచరిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.*
*అసలు ''కోపం'' తనలోనే ఉందని, కేవలం బయట నుండి ఒక కుదుపు కారణంగానే అది బయట పడిందని గ్రహిస్తాడు.*
*అప్పటి నుండి, ఆ ముని తనకెవరైనా కోపం తెప్పించినా, చిరాకు కలిగించినా, 'అవతలి వ్యక్తి ఒక ఖాళీ పడవ మాత్రమే. కోపం తనలోనే ఉందన్న ఙ్ఞానాన్ని గుర్తెరిగి ఆవేశం చెందకూడదని గ్రహిస్తాడు.*
*అందుకే, మనం కూడా* *అప్పుడప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మనకు ఎదురయ్యే సమస్యలను ఒక సమగ్ర దృష్టితో విశ్లేషించి సమాధానం కనుక్కునే ప్రయత్నం చేయాలి.*
*“ఖాళీ పడవ" అనేది ఒక గొప్ప నానుడి. ఖాళీ పడవ మంచిదే. మనను మనకు పరిచయం చేస్తుంది* 🤘
No comments:
Post a Comment