జీవితం చుట్టూ ఉన్న మనుషులతోనే కలిసి సాగుతుంది. వేరే దారి లేదు. ఒక మనిషి అంతరంగ భావాలు వారికి మాత్రమే తెలుస్తాయి. తమ సొంత వారైనా సరే - ఒకరి అంతరంగం ఇంకొకరికి తెలిసేలా సృష్టి ఏర్పాటు చెయ్యలేదు. కేవలం ఎదుటివారు మనకు అర్ధమయ్యేలా మనకు అవగాహనా శక్తిని సృష్టి ఇచ్చింది. ఈ అర్ధం చేసుకోవటం అనేది మన వైపు నుండే ఉంటుంది. మన స్వభావాన్ని బట్టి మనము అర్ధముచేసుకోగలము తప్ప - ఎదుటివారి నిజమైన భావము మనము గ్రహించలేము.
ఎక్కువ అపార్ధాలు వున్నాయి అంటే మనను మనం గమనించుకోవాలి. మనము అనుభవించే సుఖదుఖాలన్నీ మన స్వీయ భావాలే.మన లోపల అంతా మంచే ఉంటే మనకు అందరిలో మంచే కనపడుతుంది. ఒకవేళ నిజముగా చెడు జరిగితే క్షమించే గుణం వస్తుంది. మనను బట్టే ఎదుటివారిని అర్ధం చేసుకుంటున్నాము అన్నది అర్ధమయితే, కొంతైనా మన వ్యతిరేక భావాలు మారవచ్చు. లేదా క్షమా గుణం రావచ్చు. లేదా ఎక్కువ ఆలోచించకుండా వదలివెసే గుణం కలగవచ్చు. లేదా మౌనముగా వుండటము అలవాటు అవ్వవచ్చు. వీటిలో ఏది వచ్చినా మనం కొంతైనా శాంతిగా ఉంటాము.........
🌹god bless you 🌹
No comments:
Post a Comment