Sunday, July 7, 2024

 🌹నారికేళ సమాకారా
దృశ్యంతేపి సజ్జనాః
అన్యేబదరికా కారా
బహిరేవ మనోహరాః🌹
     
సజ్జనుడు కొబ్బరికాయ లాగా పైకి కఠినంగా కనపడతాడు.  కానీ,  కఠినమైన కొబ్బరికాయ లోపల రుచికరమైన కొబ్బరి, తియ్య ని నీరు ఉన్నట్లే, సజ్జనుని కఠినత్వం వెనుక అతని మృదువైన మంచి మనసు దాగి ఉంటుంది.  
దుర్జనుడు మాత్రం పైకి చాలా మృదువుగా ఆకర్షణీయంగా రేగిపండు లాగా  కనబడతాడు.  కానీ, మృదువైన రేగిపండు లోపల కఠినమైన గింజ ఉన్నట్లు, దుర్జనుడి మృదుత్వం వెనుక కఠినమైన అతని అంతరంగం ఉంటుంది.🌹

No comments:

Post a Comment