శ్రీమద్రామాయణము.
(223 వ ఎపిసోడ్),
చాలా మంది నేను కాబట్టే మా వాళ్లకి ఇంత ఖర్చుపెట్టి వైద్యము చేయించానని డప్పు కొట్టుకునే వాళ్లు అక్కడక్కడ కనపడుతుంటారు. సహనము లేక ఒకరినొకరు వాదించుకుంటారు. నిజమే మగవాడు ఖర్చుపెట్టి వైద్యము చేయిస్తాడు.స్త్రీ జీవితకాలమంత ఇంటి పనులతో సంసారజంఝాటములో కొట్టుమిట్టాడుతుంది.ఇక్కడ ఎవరు గొప్ప అనే ప్రశ్నకన్నా రోగాలు వచ్చినప్పుడు లేదా కష్టాలు కలిగినప్పుడు రోగికి లేదా కష్టము కలిగినవారికి ఎంతగొప్పగా సేవ చేసామని విశ్లేషణ చేసుకోవడమే ఉత్తముల లక్షణము.
"""గత జీవస్య పునః కిమౌషధైః""",
ఎవ్వరైనా ఎవ్వరికైనా బొందిలో ప్రాణములుండగనే సరియైన వైద్యము చేయించిగానీ చేసిగానీ రోగిని రక్షించాలి. అంతేగానీ ఉపాధి నుండి జీవుడు నిష్క్రమించిన తర్వాత చేసే లేక చేయించే అత్యంత విలువైన వైద్యాలకి ఉపయోగముండదు గదా?.
రామాయణము యుధ్దకాండములో రావణాసురునికి విభీషణుడు హితవు పలుకుతూ అన్నా మన శరీరములలో జీవశక్తి యుండగనే అపహరించి తెచ్చిన సీతను రామునికి అప్పగించుట శ్రేయోదాయకము.ఉపాధి నుండి జీవుడు వెళ్లిపోయిన తర్వాత పశ్చాత్తాపంతో ఉపయోగముండదు.
"" ఏతన్నిమిత్తం వైదేహ్యా భయం
నః సుమహద్భవేత్|,
ఆహృతా సా పరిత్యాజ్యా కలహార్ధే
కృతేన కిమ్.""|,,( 9-16),,
లంకలో సీతామాత ప్రవేశించిన మరుక్షణమే మనకి భయము చుట్టుముట్టినది.ఈ మృత్యుభయము ఉండగనే సీతను రామునికి అప్పగించుట సముచితము.వినాశనము జరిగిన తర్వాత వగచిననూ ఉపయోగముండదు'అని విభీషణుడు రావణాసురునికి హితవు పలుకుతాడు.
రావణబ్రహ్మకి రాబోయే కష్డాన్ని గుర్తించి విభీషణుడు యన అన్నకి హితవు పలికాడు. ఇక్కడ తప్పుచేసాడని అన్నని ఆక్షేపణ చేయకుండ మంచి మాటలతో బుజ్జగించటమనే విజ్ఞతని మనము గమనించుకోవాలి.
తరుణము గమనించుకొని అనవసర గొడవలకి పోకుండగ పట్టువిడుపులు కలిగి బుధ్దికుశలత ఉపయోగించుకోవాలని రామాయణము మనకి తెలియచేస్తున్నది.
No comments:
Post a Comment