Saturday, July 13, 2024

 *నా దేశం ఎదుగుతున్నది...*

ఇపుడు నా దేశం జనాభాతో నిండి ఉంది
ఉద్యోగాలకై ప్రపంచమంతా ఉరుకుతున్నది...

ఇపుడు నా దేశం మతాల మంటలు ఆర్పుతున్నది
మత సామరస్యత బుద్ధితో సాగుతోంది...

ఇపుడు నా దేశం కులాలతో కూడి ఉంది
కులవృత్తులకు జీవం పోస్తున్నది...

ఇపుడు నా దేశం రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకుంది
అభివృద్ధి మంత్రం అందిస్తే 
ప్రపంచ పటంపై ప్రగతి అమృతంగా నిలబడబోతుంది...

ఇపుడు నా దేశం  రేపటికై పరుగుతీస్తూ ఉంది
ప్రపంచ పటంలో ప్రథమం కావాలని ప్రయత్నం చేస్తోంది...

ఇపుడు నా దేశం జనాభాలో కాదు
అన్నింటా ముందుకు ఉరుకుతున్నది
ఉరకాలే....
నా భరతమాత  140 కోట్ల పిల్లలే
ప్రపంచానికి తూర్పు జ్ఞాన విజ్ఞాన అభివృద్ధి ఆనంద ఆదర్శ ఆరోగ్య దిక్సూచై నిలవాలని 
ఆశీస్తూ....
*ప్రపంచ జనాభా శుభాకాంక్షలు...*

*అభిరామ్ 9704153642*

No comments:

Post a Comment