అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-185.
266d3.2510e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣8️⃣5️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
*భగవద్గీత*
➖➖➖✍️```
(సరళమైన తెలుగులో)```
*7. విజ్ఞాన యోగము.*
(ఏడవ అధ్యాయము)
_________________________
*7. వ శ్లోకము:*
*”మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ ।*
*మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ” ॥7 ॥*
“నాకంటే (అంటే పరమాత్మ కంటే) ఇతరమైనది, శ్రేష్టమైనది మరొకటి లేదు. దారము మణులన్నిటినీ కూర్చి, ఒక హారంగా చేసినట్టు, ఈ సమస్త జగత్తు నా చేత ఒక హారంగా కూర్చబడినది.”```
ఈ చరాచర జగత్తు అంతా పరమాత్మ నిండి ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. కాబట్టి పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న లేదు. ఎక్కడ లేడు అనే సమాధానము వస్తుంది. మట్టి నుండి కుండ వచ్చింది. మట్టి ఎక్కడ ఉంది అంటే కుండ అంతటా మట్టి ఉంది. కాని మనకు కనపడేది కుండ మాత్రమే. అలాగే బంగారు అభరణంలో అంతటా బంగారం ఉంది కాని మనకు అది ఒక ఆభరణం రూపంలో కనపడుతూ ఉంది. బంగారం తీసేస్తే ఆభరణం లేదు. మట్టి లేకపోతే కుండ లేదు. అలాగే ఈ జగత్తు అంతా పరమాత్మ అంతర్లీనంగా వ్యాపించి ఉన్నాడు. కంటికి కనిపించని పరమాత్మ లేకపోతే ఈ మన కంటికి కనిపించే ఈ జగత్తు లేదు. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పాడు పరమాత్మ.
మణులతో కూర్చిన మాలలో కనపడకుండా దారం ఉంటుంది. అలాగే పూలమాలలో కూడా కనపడకుండా దారం ఉంటుంది. మణులు, పూలు బయటకు కనపడుతుంటాయి. వాటిని అన్నిటినీ కూర్చి ఒకటిగా చేసిన దారం బయటకు కనపడదు. అలాగే ఈ సృష్టికి మూలకారణమైన పరమాత్మ ఎవరికీ కనిపించడు. దారం లేకపోతే మణులు కానీ పూలు కానీ నిలువవు. ఎన్ని రకాల మణులు ఉన్నా, ఎన్నిరకాల పూలు ఉన్నా అందులో ఉండే దారం ఒక్కటే. ఆ దారమే మణులకు, పూలకు ఆధారము. అలాగే జీవులలో ఆత్మ స్వరూపుడుగా ఉండే పరమాత్మ ఒక్కడే. భేదభావము మనం కల్పించుకుంటున్నాము. పూలలో దారం లేకపోతే పూలు నిలువవు, అలాగే మణిమాలలో దారం లేకపోతే మణిమాల నిలువదు అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము, ఆ దృష్టితో అంటే జ్ఞానదృష్టితో చూస్తేనే పరమాత్మ ఉనికి మనకు గోచరిస్తుంది కానీ మామూలు కళ్లకు కనపడదు.
కాని కొందరు మానవులు దేవుడు ఏడీ! ఉంటే మాకు ఎందుకు కనిపించడు. కాబట్టి దేవుడు లేడు అని వితండంగా వాదిస్తుంటారు. పూలలో దారం లేదు అని అంటే వాడిని పిచ్చివాడంటారు కానీ దేవుడు లేడు అనే వాడు గొప్పవాడు, శాస్త్రవేత్త. ఇదే మన అజ్ఞానం. కాబట్టి పరమాత్మ ఈ అనంత విశ్వం అంతా చైతన్యరూపంలో ఆవరించి ఉన్నా మన కంటికి కనిపించడు కాబట్టి దేవుడు లేడు అనడం అజ్ఞానం.
ఈనాటి సైన్సు ప్రకారం ఈ సృష్టిలో ప్రతి వస్తువూ అనేకానేక పరమాణువులతో ఏర్పడింది. ప్రతి పరమాణువులో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఎలక్ట్రాన్లు ఒకదాని చుట్టు ఒకటి తిరుగుతుంటాయి. నిరంతరం చలిస్తుంటాయి. కాబట్టి జడ పదార్థాలలో కూడా చైతన్యం ఉంది అని నేటి శాస్త్రజ్ఞులు నిరూపించారు. పరమాణువులు మనకు కనిపించడం లేదు కాబట్టి అవి లేవు అనలేము కదా!
పరమాణు స్వరూపాన్ని కనిపెట్టడానికి ప్రత్యేక సాధనాలు ఎలా అవసరమో అలాగే మణిమాలలో దారంలా ఉన్న పరమాత్మను చూడటానికి జ్ఞానదృష్టి అవసరము. ఎందుకంటే మన కళ్లతో చూడటం అంటే మనకంటి చూపు పరిమితం. కొంత వరకే వెళుతుంది. 40 ఏళ్లుదాటితే కళ్లజోడు లేకుండా మామూలు వస్తువులనే మనము చూడలేము. మైక్రోస్కోప్ సాయం లేకుండా సూక్ష్మపదార్థాలను మనం చూడలేము. అటువంటిది పరమాత్మను ఎలా చూడగలము. దానికి అంతర్ దృష్టి అవసరము. కేవలం కళ్లతో చూచి నమ్మేవాడు అధముడు. చూచిన దానిని మానసిక దృష్టితో విశ్లేషించి తెలుసుకొనేవాడు మధ్యముడు. జ్ఞాన దృష్టితో చూచేవాడు ఉత్తముడు. దేహము, మనసు, బుద్ధి అన్నీ జడములు, ఆత్మ ఒక్కటే చైతన్య స్వరూపము, చైతన్యం లేక పోతే దేహము అందులో ఉన్న మనస్సు బుద్ధి పనిచేయవు.
ఈ సందర్భంలో జగద్గురువు శంకరాచార్యుల వారి ఆత్మబోధ లో ఒక శ్లోకం మనం చదువుకుందాము...```
*”సర్వగం సచ్చిదానందం*
*జ్ఞానచక్షుర్నిరీక్షతే*
*అజ్ఞానచక్షుర్నేక్షేత భాస్వన్తం* *భానుమన్ధవత్”*```
సర్వవ్యాపకుడుఅయిన పరమాత్మను జ్ఞాన నేత్రముతోనే దర్శించాలి. సూర్యుని గుడ్డివాడు చూడలేడు. అలాగే అజ్ఞాని పరమాత్మను చూడలేడు. అందుకని దేవుడు లేడు అని అంటుంటాడు.
పైన చెప్పిన ఉదాహరణలో ఉన్న పోలికలను చూద్దాము…
పూలు, మణులు మన కంటికి కనపడతాయి. లోపల ఉన్న దారము కంటికి కనపడదు. అలాగే శరీరములు మాత్రమే కంటికి కనపడతాయి. లోపల ఉన్న ఆత్మ స్వరూపము కనపడదు. దారము లేనిదే మణులు పూలునిలువవు. అలాగే పరమాత్మ లేనిదే ఈ సృష్టి లేదు. మన సాధారణ కంటికి దారం కనిపించనట్టే అజ్ఞానములో ఉన్న వాడికి పరమాత్మ కనిపించడు. దారము లేకపోతే పూలు, మణులు నిలువవు అనే తెలివి ఉంటేనే లోపల దారం ఉన్న సంగతి తెలుస్తుంది. అలాగే ప్రతి జీవిలోనూ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అనే జ్ఞానం కలిగితేనే, ఆత్మ దర్శనం కలుగుతుంది.✍️```
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
No comments:
Post a Comment