Friday, October 24, 2025

 


🦚జ్ఞాన ప్రసూనాలు🚩

1) శివునికి ఆగ్రహం - అనుగ్రహం రెండూ ఉండవు.
ఎందుకంటే ఆయనకు అన్యం లేదు కాబట్టి.

2) భగవంతుడు నీకేం కావాలి?
భక్తుడు : నువ్వే కావాలి.
అని అన్నవాడే నిజమైన భక్తుడు.

3) దుశ్శాసునుడు ద్రౌపతీ వస్త్రాపహరణ చేయకుంటే మహాభారతం జరిగేదా?
రావణాసురుడు సీతాపహరణం చేయకుంటే రామాయణం జరిగేదా? ప్రతి పాత్రా అవసరమే ఈ జగన్నాటకానికి.

4) 'జగన్మాత' అంటే-జగత్తుకు మాత అని కాదు.
జగత్తే మాత అని అర్థం.

5) సముద్రం ఉపరిల భాగమే “అలల” కల్లోలం. అంతర్భాగం అంతా మహా నిశ్చలత.
బ్రహ్మం యొక్క ఉపరితల భాగమే “కలల” కల్లోలం. అంతర్భాగం అంతా మహా అచలత.

6) 'గిరిప్రదక్షిణం' పూర్తయితే గూటికెళతాం. 'జీవిత ప్రదక్షిణం' పూర్తయితే కాటికెళతాం..
'ఆత్మ ప్రదక్షిణం' పూర్తయితే ముక్తికెళతాం.

No comments:

Post a Comment