🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(252వ రోజు):--
సమస్య క్రైస్తవమతం బోధించడం వల్ల వచ్చినదికాదు, వ్యక్తి స్వాతం త్ర్యంకంటే కుటుంబసౌభాగ్యానికే ఎక్కువ విలువనిచ్చిన తరతరాల హిందూసంస్కృతిని ఛిన్నాభిన్నం చేయటానికి అది తోడ్పడటం వల్లనే సమస్య ఎదురైంది. చాలా చిన్నది గా అనిపించే ఈ వ్యత్యాసం భారత సమాజవ్యవస్థను అనూహ్యమైన రీతిలో దెబ్బతీసింది. సాంప్రదాయ కంగా, భారతదేశంలో అనాధాశ్ర మాలూ, పేదలకు సంక్షేమపథకాలూ ఎప్పుడూ అవసరంకాలేదు. అట్టి అవసరం లేకపోవటంచేత, దేవా లయవ్యవస్థ అటువంటివిషయాలు పట్టించుకోనవసరం లేకపోయింది.
కాని, 20 వ శతాబ్దిలో వ్యక్తి సంస్కృతికే ప్రాధాన్యమిచ్చే పాశ్చా త్య/ క్రైస్తవ నాగరికతనే దేశవాసుల పై రుద్దటంచేత అనాథాశ్రమాలు, ఆరోగ్యరక్షణ, క్షామబాధానివారణ, విద్య మొదలైన సంక్షేమకార్యక్రమా లు అవసరమయ్యాయి. కొత్తగా ఏర్పడిన దేశపు ఆర్థికపరిస్థితిని ఈ ఖర్చులు మరింత కృంగదీసాయి.
దేశపు నవీన నాయకులందరూ వారి గత యజమానుల పాలనా సూత్రాలనే అనుసరించారు: కొద్ది మంది పాలకులూ, చాలామంది పాలితులూ. ఈ కొద్దిమందికీ అతి త్వరగా ధనికులుకావాలనే మనస్ తత్వం, పాశ్చాత్యవస్తువుల మీద వ్యామోహం పెరిగాయి. దేశపరిస్థితి పై తన అభిప్రాయాలు వెల్లడించ టానికి స్వామీజీ ఎన్నడూ వెనుదీయ లేదు:
సమసమాజ నిర్మాణానికే బద్దుడి నైన నేను సంపదను అందరికీ పంచాలని నమ్ముతున్నాను. కాని, అది ధనవంతులనుంచే సహజ మైన రీతిలో ప్రారంభంకావాలి. వారి లాభాల్ని బలవంతంగా తీసుకో కూడదు ; తమకున్నది అందరితో నూ పంచుకొనటంలో ఉన్న ఆనందం, అందరూ ఒకటిగా ఉండ టంలోని వేదాంతం - ఇటువంటి నైతిక విలువలను వారికి విద్యలో భాగంగా బోధించాలి. అందరూ ఒకే కుటుంబానికి చెందినవారనీ, అంద రిదీ ఒకే సంస్కృతనీ, ఒకే మతమనీ, ఒకే వేదాంతమనీ వారు గ్రహించేలా చెయ్యాలి. అప్పుడే స్వలాభాపేక్ష తగ్గి సమాజావసరాలకు తగిన స్పందన లభిస్తుంది.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment