Friday, October 24, 2025

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(253వ రోజు):--
         ఈనాటి ప్రపంచంలో ప్రాపం చిక విషయాల్లో నెగ్గుకురావటం తప్పనిసరి. హిందూవేదాంతగ్రంథా లు సంపదను ఎన్నడూ గర్హించలేదు విజయంకోసం చేసే కృషివల్ల మనసు పదునెక్కి దానికి సూక్ష్మమై న జీవనసత్యాలను ఆకళింపు చేసు కొనే సామర్థ్యం లభిస్తుంది. జన్మతః ప్రతివ్యక్తీ ఈ ప్రపంచంలోకి కొన్ని అనుభవాలు పొందటానికే వస్తాడు. ఈ అనుభవాలకోసం చేసే ప్రయత్నం అతనిచేత కొన్నిపనులు చేయిస్తుంది. సరైన మనస్థితితో చేసి న కర్మలు పూర్వజన్మవాసనలనూ, ఈ జన్మలో సంగ్రహించుకున్న వాస నలనూ కరిగించివేస్తాయి. ఆవిధం గా పరిశుద్ధమైన మనసుకే సత్యాన్ని గ్రహించే అర్హత లభిస్తుంది. స్వామీజీ వద్దకు ఎవరైనా ఆధ్యాత్మిక సంబం ధమైన ప్రశ్నలతో వస్తే, వారికి ఆ విషయంలోనే సలహా లభించేది. వ్యాపారసమస్యలతో వచ్చినవారికి కూడా వారికి అవసరమైన సలహా లభించేది ; వారి వ్యాపారం కోసం ఎవరెవరిని సంప్రదించాలో తరుచూ చెప్పేవారు కూడా .
       అంతేకాకుండా, 'సమర్థవంతం గా పనిచేయడం'విజయానికి ఆవశ్య కం కనుక, ఆ విషయంపై స్వామీజీ చాలాసార్లు ఉపన్యాసాలిచ్చారు:
        ఏ పనిలోనైనా విజయం సాధిం చాలంటే మొదట కావలసినది ప్రావీ ణ్యం : విషయజ్ఞానం, సరైన పరికరా లు, వాటిని ఉపయోగించే నేర్పు. వీటితో సిద్ధపడితే, దేన్నైనా సమర్థ వంతంగా చెయ్యటం సాధ్యమౌతుం ది. సమర్థత అంటే చెయ్యాల్సిన పని మీద మనసు పూర్తిగా లగ్నంచేయ గలగడమే. ఇది అంత సులువుగా లభించదు. మనం పనికి సరిగా సిద్ద పడకపోవటంచేత ఆ విషయం యజమానికి తెలుస్తుందని భయ పడుతుంటే, మన మనసు పనినుం డి ఎప్పుడూ చెదిరిపోతూనే ఉంటుం ది. ఆదాయానికి సంబంధించిన సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మన ఆదాయం పిల్లల చదువుకూ, కూతురి వివాహానికీ సరి పోతుందో లేదో మనకు తెలియదు. గతంలో మనకు కలిగిన అపజయా లను గుర్తుచేసుకొని చింతిస్తూoటాం 4 సార్లు అపజయం పొందారా? మంచిదే ! ఇపుడు మీకు అపజయం పొందటమెలానో తెలుసుకనుక, ఈ సారి విజయం తప్పకుండా లభిస్తుం ది ! మీకు అవసరమైన ప్రావిణ్యం ఉన్నా, మీ మనసు పరిపరివిధాల పోతోంది. ఇది మీ ఇంటిపైనున్న నీరు నిలువచేసే తొట్టివంటిది. తొట్టె నిండా నీరున్నా, క్రిందనేఉన్న స్నానా లగదిలోకి నీరు రావటంలేదు. నీటి గొట్టంలో ఏదో అడ్డుపడిందేమో. దాన్ని ముందు తొలగించాలి. అదే విధంగా, మీకు ఎన్నో మంచి ఉద్దే శాలు ఉండవచ్చు; కాని వాటిని సమర్థవంతంగా కార్యరూపంలోకి మార్చకపోతే, మీకున్న జ్ఞానంవల్ల ప్రయోజనమేముంటుంది ? విజయం కార్యనిర్వహణపై ఆధార పడుతుంది, ఊహలపై కాదు. మన భారతదేశంలో నైపుణ్యానికి కొదవ లేదు ; లేనిది కార్యదక్షత ఒక్కటే. ఊహలు నైపుణ్యాన్ని సృష్టిస్తాయి; వాటిని అమలుచేయడం కార్య దక్షతను సృష్టిస్తుంది. 
        🙏🕉️ హరిఃఓం  🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺

No comments:

Post a Comment