Tuesday, October 14, 2025

 *@ ఏది అవసరం..?@62
    తేది:14/10/2025
""""""'''"""""""""""""""""""""""""""
'నాన్నా... వచ్చే నెలలో గుంటూరులో బాలోత్సవ్ ఉంది మాస్కూలు నుంచి చాలామంది వెళ్తున్నారు...
నేనూ వెళ్లి డ్రాయింగ్
పోటీలో పాల్గొనాలనుకుంటున్నాను'అని నాలుగో తరగతి
చదువుతున్న రాము, నాన్నతో చెప్పాడు 'మంచి పని రామూ
వెళ్లు టీచర్లు తీసుకెళ్తారుగా ఉత్సాహంగా బదులిచ్చాడు నాన్న
'పిల్లలతో పాటు అమ్మగానీ నాన్నగానీ ఎవరైనా తోడుగా
రావాలన్నారు చెప్పాడు రాము...
ఆ మాటలు వింటూనే
నాన్నలో ఉత్సాహం ఆవిరైపోయింది...అబ్బో... గుంటూరు
అంటే ముప్పై కిలోమీటర్లు వెళ్లాలి సరే చూద్దాంలే...
ఇంకా
టైమ్ ఉందిగా అన్నాడు నాన్న నాలుగు రోజుల తరవాత,
రాము మళ్లీ అడిగాడు చూద్దాం అన్నాడు నాన్న...వారం
తరువాత, నాన్నా... పేరు ఇవ్వడానికి రేపే
ఆఖరి రోజు
అంటూ గుర్తుచేశాడు రాము ఆఫీసు ఉందిరా నాకు కుదరదు,
వచ్చేసారి వెళ్దాంలే అన్నాడు నాన్న
కొన్ని రోజుల తరవాత, ఓ పెద్ద హీరో సినిమా విడుదలవుతోంది అది పిల్లలు చూడదగిన సినిమా కూడా కాదు
అయినా, ఆ సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలని
అనుకున్నాడు నాన్న ఆఫీసుకు సెలవు పెట్టి పిల్లల చేత
స్కూలు ఎగ్గొట్టించాడు బండిమీద నాన్న, అమ్మ, ఇద్దరు
పిల్లలు ఇరుక్కుని కూర్చున్నారు వాళ్ల ఊళ్లో ఉన్న థియేటర్ కి
వెళ్తే టికెట్లు అయిపోయాయి అలానే బండిమీద గుంటూరు
వరకు వెళ్లారు అక్కడ కూడా టికెట్లు లేవు ఎలాగోలా రెండు
టికెట్లు బ్లాకులో కొన్నాడు పిల్లలిద్దరినీ చెరొకరి ఒళ్లో
కూర్చోపెట్టుకుని సినిమా చూశారు కేరింతలు కొట్టారు ఇంటికి
వస్తూ దారంతా సినిమా గురించి, హీరో గురించి మాట్లాడు
కుంటూ వచ్చారు ఫస్ట్ డే, ఫస్ట్ షో చూశామని ఆనందంతో పొంగిపోయారు
రెండేళ్లు గడిచాయి పేరెంట్ టీచర్ మీటింగులో 'రాము
చదువు మీద ఏ మాత్రం శ్రద్ధ చూపించట్లేదు ఎంత చెప్పినా
వినట్లేదు అంటూ నాన్నకు టీచర్లు ఫిర్యాదు చేశారు
ఇక్కడేం జరిగింది? తోటి పిల్లలతో ఆడి పాడి, ఎన్నో కొత్త
విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడే బాలోత్సవ్ కి పిల్లాణ్ని
తీసుకెళ్లడం నాన్నకు కష్టమైంది అదే తనకిష్టమైన హీరో
సినిమా కోసం ఎంత కష్టమైనా పడ్డాడు దాన్నో ఘనకార్యంలా
కొన్నాళ్లపాటు చెప్పుకొన్నారు
ఈ రెండు సంఘటనలూ పోల్చి
చూసుకున్న చిన్నారి రాము చదువుకున్నా సినిమానే గొప్పదనుకున్నాడు తండ్రి స్వయంగా తన
చేతల ద్వారా ఆ విషయాన్ని
పిల్లాడికి తెలియజేశాడు దాని ఫలితమే చదువు పట్ల రాము
చూపిస్తున్న అనాసక్తత..!
సినిమాలు చూడటం తప్పు కాదు దేనికి ఎంత ప్రాధాన్యమిస్తున్నాం అన్నది ముఖ్యం పిల్లలకు ప్రతిదీ మాటల్లో చెప్పనక్కర్లేదు,చూసి గ్రహిస్తారు పరిస్థితులనుంచి పాఠాలు నేర్చుకుంటారు
కాబట్టి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని
మన ప్రాధాన్యాల
ఎంపిక ఉండాలి...*

No comments:

Post a Comment