Thursday, October 23, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి... 

            *ఆచార్య సద్బోధన*
                 ➖➖➖✍️
```
దైవం మనల్ని ఏ కారణం లేకుండా ప్రేమిస్తున్నట్లే, మనం కూడా ప్రేమను అలవాటు చేసుకోవాలి. ప్రేమ వల్లనే కొత్త మనుషులు పుట్టుకొస్తారు.

“నాజీవితం నాఇష్టం. నాకు అదుపు లేదు. అడ్డు లేదు. ఆజ్ఞ లేదు. హద్దులు లేవు. నేను అనుకున్నదే జరగాలి.   నా మాటే అందరూ వినాలి” అని అనుకుని విచ్చలవిడిగా ప్రవర్తించే వారికి ఈ భూమ్మీద చోటు లేదు.

మనుషులు మంచివారు, పరిస్థితులే దేనికైనా కారణం. పరిస్థితులను మారిస్తే అపార్థాలు తొలగిపోతాయి.

ధర్మరాజులా మనం ఉండలేకపోవచ్చు. కాని, దుర్యోధనుడిలా ఉండకూడదు. శ్రీరాముడిలా ఉండటం అసాధ్యం అనిపిస్తుంది. కాని రావణాసురుణ్ని ఆదర్శంగా పెట్టుకోకూడదు.

ఈ ప్రపంచం   ఒక అద్భుతమైన ఉద్యానవనం. అందమైన, అరుదైన పువ్వుల్లాంటి మనుషుల ఆత్మసౌందర్యాన్ని, ప్రేమ పరిమళాన్ని ఆస్వాదించాలి. ప్రేమను ఇవ్వాలి. ప్రేమను పుచ్చుకోవాలి.✍️```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment