impulsive generosity is not a virtue #psychology #psychologyfacts
https://youtube.com/shorts/V3O6KKkUGus?si=YXS-ZAThRYcGmCkq
ఈ రోజుల్లో మంచి చేస్తే మనకి దూల తీర్చేస్తారు మంచి వాళ్ళకి రోజులు బాలేదు ఈ మాట మనం చాలా చాలా తరుచుగా వింటూ ఉంటాం అవునా కదా కానీ దీని గురించి కొద్దిగా లోతుగా ఆలోచిద్దాం మంచితనం రెండు రకాలుండి ఒకటి ఇంపల్సివ్ మంచితనం అవతల వ్యక్తి కష్టంలో ఉంటే మనం నియంత్రణ కోల్పోయి వాడి కష్టం చూసి మనం తట్టుకోలేక చాలా చాలా అనాలోచితంగా వాడికి మనం సహాయం చేసాం అనుకోండి ఇది ఇంపల్సివ్ మంచితనం అంటే ఎదుటి వాడి సిచువేషన్ ని క్లియర్ గా అర్థం కూడా చేసుకోకుండా వాడి ఏడుపు చూడగానే ఆటోమేటిక్ గా మన బాడీ నుంచి ఒక రియాక్షన్ వస్తది. వాడికేదో మంచి చేయాలి వాడిని కాపాడేసేయాలి. ఈ ఇంపల్సివ్ మంచితనం అనేది మనకి చాలా కీడు చేస్తుంది. ఎప్పుడూ కూడా ఈ పని చేయకూడదు. దీనివల్లే సమస్యలన్నీ వస్తాయి. కానీ ఒకళ్ళు ఎవరైనా సరే కష్టంలో ఉన్నారంటే ముందు అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అతని కన్నీళ్ళని పక్కన పెట్టేసేసి అతను చెప్పే ఆ డ్రమాటిక్ స్టోరీని పక్కన పెట్టేసేసి అతని అవసరం ఏంటో చాలా చాలా స్పష్టంగా అర్థం చేసుకొని మన కెపాసిటీ ఏంటో అంచనా వేసుకొని మనం ఇబ్బందుల్లో పడకుండా చాలా జాగ్రత్తగా సర్జికల్ ప్రొసెషన్ తో ఆచి తూచి మనం సహాయం చేశమ అనుకోండి అది మనకి హెల్ప్ అవుతుంది అవతల వాడికి హెల్ప్ అవుతుంది అపాత్రదానం చేయకుండా ఉంటాం కానీ ఎప్పుడైతే అవతల వాళ్ళని చూడగానే అయ్యో వాడికి సహాయం చేయకుండా నేను ఉండలేను నా మనసులో నుంచి కరుణ రసం పొంగుక వస్తుంది ఇట్లా ఫీల్ అయిపోయి మనం గనక హెల్ప్ చేస్తే మాత్రం మనకి దూల తీరిపోద్ది. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ప్రపంచం అంతా మనం సహాయం చేస్తాం అంటే చేతులు చాచి రెడీగా ఉంటారండి చాలా చాలా హై పొజిషన్స్ వాళ్ళు కూడా మనం ఏదైనా ఫ్రీగా పెడతామఅన్నా ఫ్రీగా చేస్తామన్నా ఆ ఇవ్వు ఇవ్వు ఇలా ఉంటారు కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి
No comments:
Post a Comment