🙏🌺1970 లో ఆలయస్వరూపం🌺🙏
🌺వాడపల్లి దివ్యక్షేత్ర పురాణగాధ 🌺
🌺శ్రీ మచ్చంన్దనవగ్రహం విభవజుషాం పాపౌఘ విధ్వంసకం! ధృత్వాయం భువివేం్కటేశ్వర విభుర్నౌకా పురే భాసురః సర్వద్రోహకారాంస్తమోగుణ మయూరీశ్చక్రాధేన్యాభిరా ద్దుశ్ర్మీకాన్విషభూరుహేణసదృశాస్థూరీ కరోతిస్వయమ్ ॥
భారతదేశంలోని అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాలలో వాడపల్లి ఒకటి. వాడపల్లి తీర్థం అనగానే వాడవాడలా ఉత్సవమే, ఆబాలగోపాలానికి ఆనందమే. ప్రతీ సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశినాడు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవముగా జరుగుతాయి. వాడపల్లిలో జరిగే శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవ, కళ్యాణోత్సవ కార్యక్రమములను వేలాది మంది భక్తులు కన్నుల పండుగగా భక్తిప్రపత్తులతో తిలకిస్తారు. అలనాడు దండకారణ్యంగా పిలువబడే ఈ ప్రాంతములో 300 సంవత్సరాల క్రితం స్వామి వెలసినట్లు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. నేడు ఈ ఆలయం ఆత్రేయపురం మండలం వాడపల్లిలో ఉంది. కోరిన భక్తుల కొంగు బంగారమై పిలిచిన వెంటనే పలికే వేంకటేశ్వరస్వామి స్వయంభువై రక్తచందన కొయ్యతో ఇక్కడ మూర్తీభవించడం జరిగింది. ఇటువంటి కొయ్య విగ్రహం ఒక్క వాడపల్లిలోనే ఉండటం విశేషం. గౌతమీ గోదావరి తీరాన ఉన్న వాడపల్లి వద్ద స్వామి వెలసిన విధానం అపురూపమైనది. 🌺
...

No comments:
Post a Comment