Thursday, January 29, 2026

కొరియన్ క్రేజ్ వెనుక ఉన్న చీకటి నిజాలు | Pavan Krishna | Square Talks

కొరియన్ క్రేజ్ వెనుక ఉన్న చీకటి నిజాలు | Pavan Krishna | Square Talks

https://youtu.be/1HgjOoUC7Dk?si=3Tih4g11ZzZnmyHJ


https://www.youtube.com/watch?v=1HgjOoUC7Dk

Transcript:
(00:00) మీరు గనుక కే పాప్ కానీ లేకపోతే కే డ్రామా అదే కొరియా డ్రామాలు వీటికి ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ వీడియో మీరు చూడకండి ఎందుకంటే దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బ్రేక్ యువర్ హార్ట్ ఈ వీడియో మీకు అస్సలు నచ్చదు. నమస్తే మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్ నేను పవన్ కృష్ణ అండ్ ప్రతి రోజు లాగా ఇవాళ కూడా మీ కోసం ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ని తీసుకొని వచ్చాను.
(00:18) రీసెంట్ గా బిటిఎస్ అనే ఒక మ్యూజిక్ కి సంబంధించిన వాళ్ళందరికీ తెలుసు ఈ బిటిఎస్ వాళ్ళు ప్రపంచం మొత్తం యాత్ర మొదలు పెట్టారు కానీ ఈసారి ఇండియాకి మాత్రం రావట్లేదు ఇండియాకి రాకపోయేసరికి ఈ బిటిఎస్ ఆర్మీ సో కాల్డ్ ఆర్మీ అని చెప్పి పేరు పెడతారు వాళ్ళ వెర్రి తలలు ఎక్కిన ఫ్యాన్స్ కొంతమంది ఉంటారన్నమాట [నవ్వు] సో ఈ పాప్ కల్చర్ లో వీళ్ళకుఉన్న ఫ్యాన్స్ ని మీ ఆర్మీ అని కూడా అంటూ ఉంటారు.
(00:40) సో వాళ్ళందరూ చాలా హర్ట్ అయ్యారు కొంతమంది ఏడ్చారు ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి వాళ్ళు లిట్రలీ అడుక్కున్నారు మా దగ్గరికి రండి అని చెప్పేసి సో ఇలాంటి ఆ సిట్యువేషన్స్ ఇవన్నీ మనకి చూస్తే ఇదేంటి ఇదెక్కడ ఈ విచిత్ర ప్రేమ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. కొరియన్ డ్రామాస్ ని కొరియన్ మ్యూజిక్ ని ఇంతలా ప్రేమిస్తున్నారు కదా మన భారతీయులు దాని వెనుకున్న కారణం ఏంటనేది ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగా దీని గురించి కనుక్కున్నాక అసలు వీ నిజాలు తెలుసుకున్నాక నేను కూడా షాక్ అయ్యాను.
(01:12) అంటే సౌత్ కొరియాలో ఉన్న ఈ కే పాబ్ కానివ్వండి లేకపోతే బిటిఎస్ కానివ్వండి లేకపోతే కే డ్రామాలు కానివ్వండి వీటి వెనుకున్న చీకటి కోణాల గురించి తెలుసుకున్నప్పుడు నిజం చెప్తున్నాను అంటే కొంచెం వశపడడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది నాకు. అన్నిటికన్నా ముఖ్యంగా భారతీయులందరూ కొరియన్స్ అందరూ ఇష్టపడుతున్నారు కానీ కొరియన్స్ భారతీయులని ఇష్టపడుతున్నారా అంటే కాదనే సమాధానం వస్తుంది.
(01:32) మీరు ఒకసారి కొరియాకి వెళ్తే కొరియాలో మనల్ని డార్క్ స్కిన్ అంటే బ్రౌన్ స్కిన్ ఉంటూ ఉంటుంది కాబట్టి మనల్ని వాళ్ళు డర్ట్ అంటే బురదతో పోలుస్తారు అక్కడ చాలా వరకు ఇండియన్స్ అక్కడ అక్కడికి వలస వెళ్లి అక్కడ పనులు చేయడానికే వచ్చారు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అక్కడ చాలా మంది ఆ కూలి పనులు కూడా చేసేవాళ్ళు ఇప్పుడు కాదు చరిత్రలో చాలా సంవత్సరాల క్రితం వెళ్ళేవాళ్ళు సో అప్పటినుంచి వాళ్ళకి ఇండియన్స్ అంటే ఒక చిన్న చూపు ఉంది.
(01:55) అండ్ వాటికి నాట్ ఓన్లీ ఇండియన్స్ అక్కడ ఉన్న కొన్ని క్లబ్స్ ఉంటాయి. కొన్ని కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి ఆ రెస్టారెంట్లలో క్లబ్బులలో బయట బహిరంగంగా బోట్స్ ఉంటాయి అన్నమాట. ఇండియన్స్ అండ్ పాకిస్తాన్ పాకిస్తానస్ ఆర్ నాట్ అలౌడ్ ఇంటు దిస్ ఏరియా అని చెప్పేసి ప్రిమిసెస్ అని చెప్పేసి అంటే నిర్మోహమాటంగా అక్కడ ఇండియన్స్ లోపలికి రావడానికి అర్హత లేదు అని పెట్టారు.
(02:14) ఒక రకంగా చూసుకుంటే మనకి బ్రిటిషర్స్ కాలంలో ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అన్న బోర్డ్స్ ఎలా అయితే ఉండేదో అలాంటి బోర్డ్స్ ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళ దృష్టిలో అందంగా ఉంటేనే వాళ్ళు మనుషులు. సో ఈ అందం వెనుకున్న రహస్యాలు దాని వెనుకున్న చీకటి కోణాలు కూడా తెలుసుకున్నప్పుడు షాకింగ్ గానే అనిపించింది.
(02:32) ఆ విషయాల గురించి పక్కన పెడితే అది మళ్ళీ చెప్పుకుందాం కానీ దాంతో పాటుగా వాళ్ళని అయినా కూడా ఇష్టపడుతున్న ఆ లేడీస్ కి గాని జెంట్స్ గాని ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. బేసిక్ గా వీళ్ళు ఇష్టపడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కే పాప్ మ్యూజిక్ తో పాటు కే డ్రామాలు అంటే కొరియన్ డ్రామాలు ఈ కొరియన్ డ్రామాలలో విపరీతమైన ప్రేమను చూపిస్తూ ఉంటారు అమ్మాయిలు అబ్బాయిల్ని ఒక రాజకుమారులాగా చూయించే ఆ విధానం కూడా వాళ్ళకి ఆ స్పెషల్ గా ఏదైతే ట్రీట్ చేస్తూ ఉంటారో వాళ్ళని పాంపర్ చేస్తూ ఉంటారు అవన్నీ అమ్మాయిలకి యూజువల్లీ బాగా నచ్చుతాయి.
(03:02) అందులో ప్రతి ఒక్క అమ్మాయిని ఆ హీరో లాగా వచ్చి కాపాడి అతన్ని ఆ అమ్మాయిని యనో లైక్ కింద పడుతుంటే పట్టుకోవడమో లేకపోతే ఎవరైనా కొట్టడానికి వస్తే కాపాడడం ఇలాంటి సీన్లు మన తెలుగులో కూడా ఉంటాయి కదా సినిమాలో అంటే కానీ అక్కడ వాళ్ళు అందంగా కనబడతారు అండ్ ఆ స్లో మూమెంట్ లో ఒక ఒక చెప్పాలంటే ఒక ఇమాజినరీ వర్డ్ లో జరిగే విషయాలన్నీ అందులో చూపిస్తారు.
(03:23) సో చాలా మంది అవి చూసిన తర్వాత రియల్ లైఫ్ లో కూడా కొరియన్స్ అలానే ఉంటారు అని చెప్పి పొరబడ్డారు. ఇక్కడే అసలైన విషయం బయటపడింది. కొరియాలో నిజంగా అంత ప్రేమగా అందరూ ఉంటారా అంటే లేదు అని కొరియన్స్ చెప్తూ ఉన్నారు అక్కడ నేను చెప్పాలంటే కొరియాలో ఇప్పుడు ఎక్కువ శాతం ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారు కొరియన్లో ఆ ప్రేమ అనేది అసలు ఒకరినొకరు ప్రేమించుకునేది చాలా తక్కువ ఆ శాతం అండ్ టాక్సిక్ రిలేషన్షిప్స్ అక్కడ ఎక్కువ అని చెప్పి అంటూ ఉన్నారు.
(03:48) అది బేసిక్ గా జపాన్ లో ఏదైతే సోలో లివింగ్ ఉందో అది నెమ్మది నెమ్మదిగా కొరియాకి సౌత్ కొరియాకి కూడా వచ్చేసింది అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా అక్కడ మెంటల్ ఇల్నెస్ తోని చాలా మంది బాధపడుతున్నారు. అక్కడ చాలా మంది సైకలాజికల్ గా ఒంటరితనాన్ని డీల్ చేయలేక శతమతం అవుతూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే సరే పెళ్లైన వాళ్ళు ఏమనా బాగున్నారా అంటే లేదు ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక మహిళ అక్కడ డొమెస్టిక్ వయలెన్స్ కి గురవుతుంది అంటే మనకి కే డ్రామాలో చూయించినట్టు ఏదో ప్రేమగా అందంగా ముద్దుగా చూయించుకుంటున్నట్టు నిజంగా అక్కడ లేదు రియల్ లైఫ్ లో కొరియాలో అక్కడ చాలా మంది
(04:18) అమ్మాయిలు చాలా మంది గృహిణులు గృహింసకి బారిన పడుతున్నారు. సరే ఇది పక్కన పెడితే చాలా మంది ఫారెన్ అంటే భారతదేశానికి సంబంధించిన ఆడవాళ్లే కాకుండా బయట [నవ్వు] దేశం నుంచి వచ్చిన ఆడవాళ్ళు కూడా వేరే దేశాల నుంచి వచ్చిన ఆడవాళ్ళు కూడా వీళ్ళకి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళు వెళ్లి అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళ దాంట్లో కూడా 43% మంది ఫారనర్స్ కొరియన్స్ ని ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆ 43% మంది అమ్మాయిలు మహిళలు అక్కడ డొమెస్టిక్ వైలెంట్ కేసెస్ పెట్టారు.
(04:46) అంటే వీళ్ళు ఏదైతే ఊహించుకొని వచ్చారో అలాంటి ఊహకి తగ్గట్టుగా అక్కడ ఎవరు [నవ్వు] లేరు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ కే డ్రామాస్ లో కే పాప్ లో కనిపించినంత అందంగా అక్కడ ఎవరు ఉండరు. చాలా నార్మల్ గా ఉంటారు నేను చెప్పాలంటే అసలైన ఫేస్ చూసినప్పుడు అరే ఇది ప్రతి చోట ఉన్నట్టుగానే ఉన్నారు కదా ఇక్కడ కూడా కాకపోతే కొంచెం కళ్ళు చిన్నగా ఉంటాయి యునో లైక్ స్కిన్ టోన్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది రంగు వేరుగా ఉంటుంది కొంచెం పొట్టిగా కొంచెం పొడుగా ఇలా రకరకాలుగా ఉంటారు అక్కడ కూడా లావుగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కానీ ఆ సీరియల్స్ గాని ఆ సీరీస్ గానీ లేకపోతే మ్యూజిక్
(05:15) ఆల్బం చూసిన తర్వాత అలానే ఉంటారని కోరుకుంటూ ఉన్నారు అలానే ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అందుకే ప్రస్తుతం ఇండియాలో కొరియాకి సంబంధించిన డ్రెస్సింగ్ గాని లేకపోతే వాళ్ళకి సంబంధించిన పాప్ ఆల్బమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇండియాలో ఒక బిగ్గెస్ట్ మార్కెట్ తయారైంది వాళ్ళకి ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా కావాలని కొరియన్స్ ని ముందు పెడుతూ ఉన్నాయి ఇప్పుడు అం ఎందుకంటే ఈవెన్ సబ్బుల్లలో కూడా ఇవాళ దొరికే బ్యూటీ సోప్ లో కూడా అక్కడ ఏదో ఒక విధంగా కొరియాకి సంబంధించిన ఒక ఇంగ్రిడియంట్ వాడి ఇదిగో ఇది కొరియా సోప్ అని చూపిస్తూ ఉన్నారు. ఫుడ్ ఐటమ్స్ లో
(05:45) కూడా కొరియాకి సంబంధించిన ఫుడ్ రెస్టారెంట్స్ హైదరాబాద్ లో మన ఏపీ తెలంగాణ అట్ ది సేమ్ టైం ఇండియా మొత్తం మీద కొత్తగా వచ్చి వెళ్తాయి అన్నమాట. ఆ ఫుడ్ నచ్చినా నచ్చకపోయినా ఆ కొరియా ఫుడ్ తినాలి ఆ రామన్ తినాలి ఆ సూప్ తాగాలి అని చెప్పేసి చాలా మంది తింటూ తాగుతూన్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఎప్పుడైతే ఆ కొరియర్ ఇండస్ట్రీకి ఒక మార్కెట్ అవుతుందని అనిపించిందో వెంటనే దాన్ని ఇంకా బాగా స్ప్రెడ్ చేసి వాళ్ళ బిజినెస్ మార్కెట్ ని ఇక్కడ పెంచుకున్నారు.
(06:10) దీనివల్ల వాళ్ళకి జరిగింది ఏంటంటే ఎగుమతులు పెరిగాయి అండ్ వాళ్ళ బిజినెస్ పెరిగింది. కొన్ని ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ డబ్బులు వాళ్ళకి వస్తూఉన్నాయి అందుకోసం అవి చేస్తున్నారు కానీ అవన్నీ నిజం అనుకొని అనుకుంటూ ఉన్నారు ఇక్కడ చాలా మంది సరే ఈ కొరియాకు సంబంధించిన స్టార్స్ వాళ్ళ జీవితాలు నిజంగా ఏమనా బాగుంటాయా అంటే అది కూడా కాదు నిజం చెప్పాలంటే మీరు కే పాప్ కి సంబంధించిన ఏ పాప్ స్టార్ ని చూసినా లేకపోతే కే డ్రామాలో చూసిన ఎటువంటి యాక్టర్స్ ని చూసినా కూడా వాళ్ళ జీవితాలు వాళ్ళవి కావు అక్కడ వాళ్ళ జీవితాలు ఇంకొకరి చేతిలో వాళ్ళ గుప్పెట్లో ఉన్నాయి.
(06:42) ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళ మిడ్ టర్మ్ స్కూల్ దగ్గర నుంచే అక్కడ అందంగా ఉన్న ఎవరో ఒక అమ్మాయిలని అక్కడ పట్టుకుంటారు. వాళ్ళని ఏం చేస్తారంటే కొరియాలో సౌత్ కొరియాలో మీకుఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ రావాలన్నా కూడా అక్కడ మీరు ప్లాస్టిక్ సర్జరీ తప్పకుండా చేయించుకోవాలి. నిజంగా సౌత్ కొరియాలో పుట్టిన వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ మొఖ కవలికలు, వాళ్ళ ఫేస్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది.
(07:06) కానీ, అక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వెంటనే గవర్నమెంట్ అక్కడ లోన్లు ఇస్తాయి. బ్యాంకులు కూడా లోన్లు ఇస్తాయి. దేనికి ప్లాస్టిక్ సర్జరీలకి ఎలాగైతే ఇండియాలో ఒక డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మాస్టర్స్ కోసం ఆ లోన్లు తీసుకుంటారు ఎడ్యుకేషన్ లోన్ అక్కడ బ్యూటీ లోన్స్ ఉంటాయి. ఈ బ్యూటీ లోన్ తీసుకొని నో సర్జరీ, హిప్ సర్జరీ లేకపోతే ఫేస్ సర్జరీ ఇవన్నీ చేయించుకుంటారు అక్కడ.
(07:27) దాని తర్వాత స్కిన్ టోన్ లో కూడా ఇంకా వాళ్ళ ఇంకొంచెం బ్రైట్ గా కనబడడం కోసం చాలా స్టెరాయిడ్స్ కానివ్వండి లేకపోతే ఆ మెడిసిన్స్ కానివ్వండి లేకపోతే పైన అప్లై చేసే స్కిన్ ఆయింట్మెంట్స్ కానీ ఇవన్నీ వాడతారు అక్కడ ఇవన్నీ వాడాక అక్కడ కొరియాలో అందంగా ఉండడం అంటే వాళ్ళకంటే కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి ఆ మెజర్మెంట్స్ పాస్ అయినప్పుడే వాళ్ళకి అక్కడ జాబ్స్ దొరుకుతాయి.
(07:48) సో ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న జాబ్ కోసే వాళ్ళు ఇంతలా అక్కడ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది అక్కడ అందుకే చాలా మంది డాక్టర్స్ సర్జరీ హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ. సో ఇంతలా ఉన్న వాళ్ళకి అలాంటి ఒక యాక్టర్ కావాలంటే ఒక కేపాప్ స్టార్ కావాలంటే వాళ్ళు ఇంకెన్ని సర్జరీస్ చేయించుకోవాలి. సర్జరీస్ మాత్రమే కాదు కడుపు మార్చుకొని చాలామంది మృత్యువాత కూడా పడ్డారు.
(08:10) ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక విషయం ఉంది మీకు ఆ ఒక కొరియన్కి సంబంధించిన ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్ జియాన్ అని చెప్పేసి కేపాప్ ఐడల్స్ ఇన్ వండర్లాండ్ అని చెప్పేసి ఒక ఒక పెద్ద బుక్ే రాశారు. దాని ప్రకారం మిడ్ టర్మ్ స్కూల్ లో ఉన్న పిల్లల్ని అక్కడ సెలెక్ట్ చేసి సాయంత్రం అవ్వగానే వాళ్ళని ట్రైనింగ్ కోసం తీసుకెళ్లి అర్ధరాత్రి దాకా ట్రైనింగ్ లో పెడతారు అక్కడ.
(08:30) ఈ ట్రైనింగ్ లో భాగంగా వాళ్ళు సన్నగా అవ్వాలి వాళ్ళు వాళ్ళకంటూ కొన్ని మెజర్మెంట్స్ పాస్ అవ్వాలి అట్ ది సేమ్ టైం వాళ్ళు ఫుడ్ విషయంలో కూడా వాళ్ళ మీద చాలా చాలా ఆంక్షలు ఉంటాయి. లిక్విడ్ డైట్స్ వాటర్ మీదనే బతకాలి వాళ్ళు వాళ్ళ కడుపు నిండ తిని ఎన్ని సంవత్సరాలు అయిందో ఎవరికీ తెలియదు ఎందుకంటే సన్నగా ఉండాలి. వాళ్ళ థైస్ సన్నగా ఉండాలి చేతులు సన్నగా ఉండాలి ఒక రకంగా చెప్పండి బార్బీ డాల్స్ లా ఉండాలి.
(08:53) అందుకే చాలా మంది అనుకుంటూ ఉంటారు అదే కొరియాలో ఇంత అందంగా ఉన్న అమ్మాయిలు మిగితా దేశాల్లో ఎక్కడ ఉండరు ఎందుకు అని మీ రీజన్ ఏంటంటే ఒక స్ట్రిక్ట్ డైట్ ఒక టాక్సిక్ డైట్ అక్కడ వాళ్ళు ఫాలో అవుతున్నారు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి అంటే అక్కడ అమ్మాయిలకి ముఖ్యంగా చిన్న వయసులోనే వాళ్ళకి రకరకాల బోన్ డెన్సిటీ ఇష్యూ రావడం అమెనోరియా అని చెప్పేసి ఒక బాడీ డిసార్డర్ వస్తుంది.
(09:18) ఎమెనోరియా బాడీ డిసార్డర్ వల్ల బోన్స్ వీక్ అవ్వడం అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళకి మెన్స్ట్రుల్ సైకిల్ కూడా రావట్లేదు వాళ్ళకి ఎందుకంటే బాడీకి కావాల్సినంత ఫుడ్ అందకపోవడం బాడీకి కావాల్సినంత పోషన్ అందకపోవడం వల్ల మరి అందంగా ఎలా కనబడుతున్నారు అంటే ఆబవియస్లీ ప్లాస్టిక్ సెంజరీస్ లేకపోతే బయట ఉండే పై పైన ఉండే మేకప్స్ [నవ్వు] మాత్రమే అండ్ అంతే కాదు వీళ్ళు ఈ ఆ స్టేటస్ లో ఉండడం కోసం వాళ్ళ జీవితాన్ని మొత్తానికి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేస్తారు అంటే కొంతమంది ఉంటారు లేండి వాళ్ళ చేతుల్లోనే ఇండస్ట్రీ అంతా ఉంటుంది ఫిలిమ ఇండస్ట్రీ గాని పాప్ ఇండస్ట్రీ గాని వాళ్ళ చేతిలో
(09:48) మొత్తం పెట్టేస్తారు. సో వాళ్ళకంటూ ఒక రిలేషన్షిప్ ఉండొద్దు అనేది ఫస్ట్ యవ్వనంలో ఉన్న వాళ్ళు 20స్ క్రాస్ అయిన వాళ్ళు ఒక రిలేషన్షిప్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉంటారు కానీ అక్కడ వాళ్ళు ఎటువంటి రిలేషన్షిప్ లో ఉండకూడదు. ఉంటే వాళ్ళ మీద విపరీతమైన కేసులు వస్తాయి వాళ్ళ ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ కాంట్రాక్ట్ బ్రేక్ చేసినందుకు వాళ్ళు రిటర్న్ లో ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
(10:11) అండ్ అంతే కాకుండా ఆ వాళ్ళకి ఇంకొంచెం ఏంటంటే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండాలనే ఒక స్ట్రిక్ట్ రూల్ కూడా ఉంటుంది అండ్ ఐడెంటిటీ మొత్తం వెళ్ళిపోతుంది వాళ్ళ ఐడెంటిటీ మొత్తం మార్చేస్తారు. సో ఇలాంటి ఒక టాక్సిక్ సిచువేషన్ మధ్యలో ఉండడం వల్ల వాళ్ళు మెంటల్ ఇల్నెస్ కి కూడా గురవుతున్నారు. ప్రతి క్షణం వాళ్ళకి ఒక ఫెయిల్యూర్ అనే ఒక భయం ఉంటుంది. ఎక్కడ మమ్మల్ని ఇండస్ట్రీలో నుంచి బయటికి పంపిస్తారో అన్న భయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది బయటకి కనిపించేంత ఆనందంగా స్టేజ్ మీద గాని లేకపోతే మనకి స్క్రీన్ మీద కనిపించేంత ఆనందంగా వాళ్ళు రియల్ లైఫ్ లో ఉండరు. నిజానికి వారి ఒంటరితనంతోని 24/7
(10:41) వాళ్ళు ఆ బాధను అనుభవిస్తున్నారు. అండ్ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది వాళ్ళ లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. మెంటల్ ఇన్స్టెబిలిటీ అనేది వాళ్ళ లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. దీని తర్వాత చాలా మంది సూసైడ్ వల్ల వాళ్ళ జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు. లేకపోతే అన్నీ కంప్లీట్ అయిన తర్వాత జీవితాంతం వాళ్ళు ఈ మెంటల్ ఇంబాలెన్స్ ఇష్యూస్ తోని వాళ్ళు జీవితాంతం బాధలు పడుతూ ఉన్నారు.
(11:02) సో ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల ప్రస్తుతానికి కేపాప్ మనం కనిపించినంత అందంగా ఉండదు అన్న సంగతి ఇప్పుడు జనాలకి ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది అయినప్పటికీ ఆ బిటిఎస్ లు కానివ్వండి లేకపోతే వాళ్ళ కే డ్రామాలు కానివ్వండి వాటికి దాని వెనక పిచ్చి పట్టినట్టు జనాలు చూస్తూన్నారు. అండ్ అంతే కాదు అక్కడ లోకల్ గా ఉన్న ఇండస్ట్రీ ఏదైతే ఫిలిమ ఇండస్ట్రీ ఉందో అది కూడా ఇప్పుడు చదిగిలబడుతుంది అనే ఒక ఆ ఒక స్టోరీస్ కూడా వినిపిస్తుంది ఎందుకు అంటే పెద్ద పెద్ద యునో లైక్ ఓటిటి ప్లాట్ఫార్మ్స్ లైక్నెట్ కానివ్వండి Amazon ప్రైమ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా కొరియన్ డ్రామాస్ ఇండియాలో
(11:33) కాదు వరల్డ్ వైడ్ గా చాలా పాపులర్ అవుతుందని చెప్పేసి వాళ్ళ కోసం స్పెషల్ గా కొన్ని షోస్ తయారు చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. దానికోసం విపరీతంగా డబ్బులు గుమ్మరిస్తూ ఉన్నారు. సో అక్కడ ప్రొడక్షన్ వాల్యూ అనేది పెరిగింది. మూవీస్ హిట్ అయ్యే సంఖ్య తగ్గుతూ ఉంది. దీని వల్ల అక్కడ ఇండస్ట్రీ మీద కూడా చాలా పెద్ద భారం పడింది అని చెప్పి అంటూన్నారు.
(11:51) సో మొత్తానికి ఇది సంగతి అండ్ ఈ విషయం ఇలా ఉంటే ప్రస్తుతానికి ఒక చిన్న సర్వే కూడా బయటికి వచ్చింది. కే డ్రామాస్ ని ఎవరైతే బాగా ఇష్టపడతారో కే పాబ్ ని ఎవరైతే బాగా ఇష్టపడతారో వాళ్ళు డెల్యూషన్స్ లో ఉండేవాళ్ళుగా చూస్తూన్నారు చాలా మంది రీసెర్చ్ చేసే స్కాలర్స్ అండ్ వాళ్ళు రియాలిటీని డిస్కనెక్ట్ అయి ఉంటున్నారు అని చెప్పి అంటున్నారు. దిస్ ఇస్ ట్రూ.
(12:13) సో ఇది సంగతి సో మీకు తెలిసిన ఎవరైనా కే పాప్ కి సంబంధించిన లేకపోతే కే డ్రామాకి సంబంధించిన పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఎవరైనా వాళ్ళకి ఈ వీడియో మాత్రం చూయించకండి ఎందుకంటే వాళ్ళకి ఈ వీడియో నచ్చదు బట్ దిస్ ఇస్ ద ఫాక్ట్ ఎనౌ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment