నమ్మించి గొంతు కోసే ఫ్రెండ్స్? (Fake Friends) - అర్జున్ రియల్ స్టోరీ | Psychology in Telugu
Author Name:Mr AK Prime
Youtube Channel Url:https://www.youtube.com/@MrAKPrime
Youtube Video URL:https://www.youtube.com/watch?v=SDZGyMEMWmA
Transcript:
(00:00) నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ ఏకే ప్రైమ్ ఒక క్షణం కేవలం ఒకే ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. మీ లైఫ్ లో ఒక వ్యక్తిని తలుచుకోండి. ఆ వ్యక్తి పేరు వినగానే మీకు సంతోషం కలగలేదు. ఉత్సాహం రాలేదు బదులుగా ఏదో తెలియని భయం గుండెలో చిన్న బరువు ఎనర్జీ మొత్తం ఆవిరైపోయిన ఫీలింగ్ ఫోన్ రింగ్ అవుతుంది.
(00:25) స్క్రీన్ మీద వాళ్ళ పేరు కనిపించింది. మీ గుండె వేగం పెరిగింది. అమ్మో మళ్ళీ వీడేనా అనిపించింది. ఎవరు వాళ్ళు వాళ్లే టాక్సిక్ పీపుల్ వీళ్ళు మనకు కనిపించే శత్రువులు కాదు మనతోనే ఉంటారు. మన పక్కనే నవ్వుతూ తిరుగుతారు. కానీ మన ప్రశాంతతని నెమ్మదిగా చాప కింద నీరులా చంపేస్తారు. ఒక విషపు పాము కాటేస్తే చికిత్స చేయడానికి డాక్టర్లు ఉంటారు.
(00:51) కానీ ఒక టాక్సిక్ మనిషి మన మైండ్ ని కాటేస్తే దానికి మందు ఎక్కడా దొరకదు అది మనమే తయారు చేసుకోవాలి. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక కథ చెప్పుకోబోతున్నాం. ఇది మీ కథ. నా కథ. మనందరి కథ. ఈ కథలో హీరో మీరు విలన్ మీ చుట్టూ ఉన్న ఆ టాక్సిక్ మనిషి. ఈ వీడియో చివరికి వచ్చేసరికి ఆ విలన్ ని ఎలా ఎదుర్కోవాలో మీ లైఫ్ అనే సినిమాకి మీరు డైరెక్టర్ ఎలా అవ్వాలో పక్కగా తెలుస్తుంది.
(01:16) సో ఈ జర్నీని స్టార్ట్ చేసే ముందు ఇలాంటి లైఫ్ చేంజింగ్ కంటెంట్ పవర్ఫుల్ సైకాలజీ టిప్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే ఈ సెకండ్ లోనే మన మిస్టర్ ఏకే ప్రైమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ ని గట్టిగా కొట్టండి. ఎందుకంటే ఈ యుద్ధంలో గెలవడానికి మీకు ఆయుధాలు కావాలి కదా. లెట్స్ బిగిన్ మన కథానాయకుడి పేరు అర్జున్ అర్జున్ మీలాగే నాలాగే చాలా సాఫ్ట్ అందరినీ నమ్ముతాడు.
(01:45) ఎవరికైనా కష్టం వస్తే ముందు ఉంటాడు. అర్జున్ లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతున్న టైంలో ఎంట్రీ ఇచ్చాడు మన విలన్ అతని పేరు రవి రవి చూడటానికి విలన్ లా ఉండడు చాలా స్వీట్ గా మాట్లాడతాడా. ఎంత స్వీట్ అంటే షుగర్ పేషెంట్ కూడా భయపడేంత స్వీట్. మొదట్లో రవి అర్జున్ కి క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. అర్జున్ నువ్వు సూపర్ రా నీ టాలెంట్ ఎవరికీ లేదురా ఇలాంటి మాటలతో అర్జున్ ఈగోని ఆకాశానికి ఎత్తేసాడు.
(02:11) దీన్నే సైకాలజీలో లవ్ బాంబింగ్ అంటారు. అంటే ఒక వ్యక్తిని పూర్తిగా తన వైపు తిప్పుకోవడానికి ప్రేమను బాంబుల్లాగా కురిపించడం. అర్జున్ పడిపోయాడు. అబ్బా నా గురించి ఇంత బాగా అర్థం చేసుకునే ఫ్రెండ్ దొరికాడు అనుకున్నాడు కానీ అర్జున్ కి తెలియదు. తాను ఒక కనిపించని వలలో ఇరుక్కుంటున్నానని ఒక సాలిగూడులో ఈగ చిక్కుకున్నట్టు రవి అనే సాలిగూడులో అర్జున్ చిక్కుకున్నాడు సీన్ కట్ చేస్తే ఆరు నెలలు గడిచాయి.
(02:41) ఇప్పుడు రవి అసలు స్వరూపం బయట పడటం మొదలైంది. కానీ అది ఒకేసారి జరగలేదు. చాలా నెమ్మదిగా స్లో పాయిజన్ లాగా ఒకరోజు అర్జున్ చాలా కష్టపడి ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశాడు. చాలా ఎక్సైటింగ్ గా రవి దగ్గరికి వెళ్ళాడు. రేయ్ రవి చూడు ఈ డిజైన్ ఎలా ఉందో అని అడిగాడు [సంగీతం] మామూలుగా అయితే ఫ్రెండ్ ఏం చెప్తాడు సూపర్ రా అంటాడు [సంగీతం] కానీ రవి ఏం చేసాడో తెలుసా ఒక చిన్న నవ్వు నవ్వాడు వెటకారపు నవ్వు బాగుందిరా అర్జున్ కానీ ఆ కలర్ కాంబినేషన్ కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ లా లేదు.
(03:15) పర్లేదులే నీ రేంజ్ కి ఇది చాలు గమనించారా రవి పైకి పొగిడినట్టే ఉంది. బాగుంది అన్నాడు కానీ వెంటనే నీ రేంజ్ కి ఇది చాలు అని ఒక చిన్న బాంబ్ వేశడు. [సంగీతం] దీన్నే బ్యాక్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అంటారు. పొగర్త మాటున దాగి ఉన్న అవమానం అర్జున్ నవ్వు ముఖం మారిపోయింది. తన కాన్ఫిడెన్స్ మీద దెబ్బ పడింది. నిజంగానే నేను చేసింది బాలేదా అని తనని తానే అనుమానించుకోవడం మొదలు పెట్టాడు.
(03:43) టాక్సిక్ మనుషులు చేసే మొదటి పని ఇదే సెల్ఫ్ డౌట్ మీ మీద మీకున్న నమ్మకన్ని దెబ్బతీయడం ఇది ఒక ఇన్సిడెంట్ మాత్రమే కాదు రోజులు గడుస్తున్న కొద్దీ రవి ప్రవర్తన మారుతూ వచ్చింది. నలుగురిలో ఉన్నప్పుడు అర్జున్ గురించి జోక్స్ వేయడం అర్జున్ సీరియస్ గా ఏదైనా చెప్తుంటే నువ్వు మరీ సెన్సిటివ్ రా చిన్న జోక్ కూడా తీసుకోలేవా అని అర్జున్ మీదే తప్పు నెట్టడం మీ లైఫ్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా మిమ్మల్ని జోకర్ చేసి వాళ్ళు నవ్వుతూ పైగా నువ్వే ఓవర్ రియాక్ట్ అవుతున్నావ్ అని అనేవాళ్ళు ఉంటే జాగ్రత్త మీరు డేంజర్ జోన్ లో ఉన్నారు.
(04:19) కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఒకరోజు అర్జున్ రవిని నిలదీశడు. రవి నిన్ను నువ్వు అందరి ముందు నన్ను ఎందుకు అలా అవమానించావు అని అడిగాడు. దానికి రవి రియాక్షన్ చూసి అర్జున్ షాక్ అయ్యాడు. రవి కోప్పడలేదు. సారీ చెప్పలేదు. చాలా కూల్ గా నేనా నేను ఎప్పుడు అన్నానురా నువ్వు ఏదో ఊహించుకుంటున్నావ్ నీకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది.
(04:45) నేను అలా అనలేదు నువ్వే తప్పుగా విన్నావ్. [సంగీతం] అర్జున్ కన్ఫ్యూజ్ అయ్యాడు. నిజంగానే నేను తప్పుగా విన్నానా నా మైండ్ సరిగ్గా పని చేయడం లేదా? ఫ్రెండ్స్ దీన్నే సైకాలజీలో గ్యాస్ లైటింగ్ అంటారు. ఇది ఎంత ప్రమాదకరం అంటే అవతలి వ్యక్తి అబద్ధాన్ని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తారంటే నిజం తెలిసిన మనమే మనల్ని మనం అనుమానించుకుంటాం. నేనే పిచ్చివాడినేమో అనుకునే స్టేజ్ కి తెస్తారు.
(05:11) అర్జున్ పరిస్థితి కూడా అదే రవిని వదులుకోలేడు అలాగని రవితో ఉండలేడు శక్తి మొత్తం అయిపోయింది. ఎప్పుడూ అలసట నిద్ర పట్టదు ఎప్పుడూ ఏదో తెలియని ఆందోళన రవి ఫోన్ చేస్తే చాలు. అర్జున్ గుండె దడదడలాడిపోతుంది. ఇక్కడితో అర్జున్ కథ క్లోజ్ అవ్వాల్సింది. చాలా మంది కథలు ఇక్కడే ఆగిపోతాయి. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. కానీ మన అర్జున్ కి ఒక దారి దొరికింది.
(05:39) ఆ దారి పేరే అవేర్నెస్ అర్జున్ ఒకరోజు ఒంటరిగా పార్కులో కూర్చుని ఆలోచిస్తున్నాడు. నేను ఎందుకు ఇలా అయిపోయాను పాత అర్జున్ [సంగీతం] ఎక్కడ అప్పుడే అతనికి అర్థమయింది. సమస్య తనలో లేదు సమస్య రవిలో ఉంది. రవి ఒక ఎనర్జీ వాంపైర్ అంటే మన ఎనర్జీని రక్తంలా పీల్ చేసే పిశాచం అర్జున్ డిసైడ్ అయ్యాడు. ఇక చాలు ఈ డ్రామాకి నేను ఫుల్ స్టాప్ పెట్టాలి కానీ ఎలా రవిని తిడితే వాడు మళ్ళీ అర్జున్ననే బ్లేమ్ చేస్తాడు.
(06:09) రవిని కొడితే విక్టిం కార్డు ప్లే చేస్తాడు. మరి రవిని ఓడించడం ఎలా అప్పుడే అర్జున్కి ఒక బ్రహ్మాస్త్రం దొరికింది. ఆ అస్త్రం పేరే ద గ్రే రాక్ మెథడ్ మీకు బూడిది రంగు రాయి గ్రే రాక్ తెలుసు కదా దానిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమీ అనిపించదు దానికి ఎమోషన్స్ ఉండవు. అది బోర్ కొడుతుంది దానితో మాట్లాడాలనిపించదు. అర్జున్ ఇప్పుడు అదే రాయిలా మారబోతున్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయేవి.
(06:36) అర్జున్ ఫాలో అయిన టెక్నిక్స్ ఇవి మీ లైఫ్ లో ఉన్న టాక్సిక్ పీపుల్ ని హ్యాండిల్ చేయడానికి మీకు ఉపయోగపడతాయి. శ్రద్ధగా వినండి. ఇవి మామూలు టిప్స్ కాదు. సైకలాజికల్ వెపన్స్ వెపన్ ఒకటి, ఎమోషనల్ డిటాచ్మెంట్, గ్రే రాక్ మెథడ్ మరుసటి రోజు రవి వచ్చాడు. మామూలుగానే అర్జున్నని రెచ్చగొట్టడానికి ట్రై చేశాడు. ఏరా అర్జున్ ఆ షర్ట్ ఏంటి జోకర్ లా ఉంది అన్నాడు రవి పాత అర్జున్ అయితే ఫీల్ అయ్యేవాడు లేదా కోపంతో అరిచేవాడు కానీ కొత్త అర్జున్ రవి వైపు చూశడు ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు జస్ట్ అవునా అన్నాడు అంతే రవికి అర్థం కాలేదు. ఏంటి
(07:16) వీడు ఫీల్ అవ్వట్లేదు అనుకున్నాడు మళ్ళీ ట్రై చేశాడు. మీ ప్రాజెక్ట్ మొత్తం చెత్తలా ఉంది తెలుసా అర్జున్ మళ్ళీ అంతే కూల్ గా సరే చూద్దాం అన్నాడు. టాక్సిక్ మనుషులకి కావాల్సింది మీ రియాక్షన్ మీరు ఏడిస్తే వాళ్ళకి ఆనందం మీరు అరిస్తే వాళ్ళకి పండగ [సంగీతం] ఎప్పుడైతే మీరు రియాక్ట్ అవ్వడం మానేస్తారో వాళ్ళకి పిచ్చఎక్కుతుంది.
(07:38) వాళ్ళ చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్ పని చేయడం మానేస్తుంది. ఒక గోడతో ఎంతసేపు మాట్లాడగలరు బోర్ కొట్టి వెళ్ళిపోతారు కదా అదే గ్రే రాక్ మెథడ్ బి బోరింగ్ బి అన్ఇంట్రెస్టింగ్ వెపన్ రెండు బౌండరీస్ గీయడం ద పవర్ ఆఫ్ నో ఇది చాలా ముఖ్యం అర్జున్ ఇన్నాళ్ళు ఎన్నో చెప్పడానికి భయపడేవాడు. కానీ ఇప్పుడు నేర్చుకున్నాడు రవి వచ్చి రేయ్ నా బైక్ ఇవ్వు నేను ఊరు వెళ్ళాలి అన్నాడు.
(08:04) అర్జున్ కళ్ళలోకి సూటిగా చూసి కుదరదు రవి నాకు పని ఉంది అన్నాడు. రవి షాక్ అరే ఫ్రెండ్ కి హెల్ప్ చేయవా అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ మొదలు పెట్టాడు. అర్జున్ స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. నేను చేయలేను అని చెప్పాను కదా అని సింపుల్ గా ముగించాడు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎన్నో అనేది ఒక చిన్న పదం కాదు. అది ఒక పూర్తి వాక్యం మీరు నో చెప్పినప్పుడు దానికి రీజన్స్ ఎక్స్ప్లనేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
(08:30) టాక్సిక్ పీపుల్ మీ బౌండరీస్ ని టెస్ట్ చేస్తారు. ఆ గోడను పగలగొట్టడానికి చూస్తారు. కానీ మీరు ఆ గోడను కాపాడుకోవాలి. వెపన్ మూడు లిమిటెడ్ యక్సెస్ ఇన్ఫర్మేషన్ డైట్ రవికి అర్జున్ గురించి ప్రతి విషయం తెలుసు అందుకే ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేవాడు. ఇప్పుడు అర్జున్ తన పర్సనల్ విషయాలు చెప్పడం మానేసాడు.
(08:54) లైఫ్ ఎలా ఉంది అని రవి అడిగితే బాగుంది అని ఒక్క ముక్కలో తేల్చేసేవాడు మీ వీక్నెస్ మీ సీక్రెట్స్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ టాక్సిక్ మనుషులకి అస్సలు చెప్పకూడదు. వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ని మీకే వ్యతిరేకంగా వాడతారు. సో వాళ్ళని ఇన్ఫర్మేషన్ డైట్ లో ఉంచండి. వాళ్ళకి ఏమి తెలియనివ్వకండి రోజులు గడుస్తున్నాయి. రవికి పిచ్చి పడుతుంది. అర్జున్ తన కంట్రోల్ లోకి రావట్లేదు.
(09:16) తన మాటలు పని చేయడం లేదు. రవి ఈగో హర్ట్ అయింది. ఎలాగైనా అర్జున్ మళ్ళీ కిందకి లాగాలి. అందుకే రవి ఒక ప్లాన్ వేశడు. అందరూ ఉన్న ఒక పార్టీలో రవి మైక్ తీసుకున్నాడు. అర్జున్ గురించి అందరి ముందు అవమానకరంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. పాత విషయాలు పర్సనల్ ఫెయిల్యూర్స్ బయట పెట్టాడు. అందరూ అర్జున్ వైపు చూస్తున్నారు. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది.
(09:40) ఇక్కడ అర్జున్ ఏం చేస్తాడు ఏడ్చుకుంటూ పారిపోతాడా లేక రవి కాలర్ పట్టుకొని కొడతాడా అర్జున్ ఈ రెండు చేయలేదు. అర్జున్ నెమ్మదిగా రవి దగ్గరికి నడిచాడు. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అర్జున్ రవి కళ్ళలోకి సూటిగా చూశాడు. అక్కడ ఒక నిశశబ్దం సైలెన్స్ ఆ నిశశబ్దం ఎంత భయంకరంగా ఉందంటే రవికి చెమటలు పట్టాయి. అర్జున్ చాలా ప్రశాంతంగా రవి నీకు నా మీద ఇంత కోపం ఉందని నాకు తెలియదు.
(10:07) ఐ హోప్ యు ఫైండ్ పీస్ నీకు ప్రశాంతత దొరకాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెనుదిరిగి నడిచాడు. అంతే ఆ ఒక్క దెబ్బతో రవి ఓడిపోయాడు అందరి ముందు రవి ఒక ఫూల్ అయ్యాడు. ఎందుకంటే అర్జున్ ఆ గొడవలోకి దిగలేదు. రవి స్థాయికి దిగజారలేదు. తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకొని ఒక రాజులా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రవికి అర్థమయింది.
(10:32) అర్జున్ ఇక ఎప్పటికీ దొరకడు అని టాక్సిక్ పీపుల్ కి ఇచ్చే అతి పెద్ద శిక్ష. మీ సైలెన్స్ మౌనం మరియు మీ సక్సెస్ కథ అయిపోయింది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. మీ లైఫ్ లో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. మనం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చలేకపోవచ్చు కానీ మనం ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు అనేది మన చేతిలోనే ఉంది. ఒక కుళ్లిపోయిన ఆపిల్ పక్కన మంచి ఆపిల్స్ పెడితే మంచి ఆపిల్స్ ఆ కుళ్లిన ఆపిల్ ని బాగు చేయలేవు.
(11:05) కానీ ఆ కుళ్ళన ఆపిల్ మిగతా మంచి ఆపిల్స్ ని పాడు చేస్తుంది. టాక్సిక్ పీపుల్ కూడా అంతే వాళ్ళని మీరు మార్చలేరు. డోంట్ ట్రై టు ఫిక్స్ దెమ జస్ట్ వాక్ అవే మీ మానసిక ప్రశాంతత మెంటల్ పీస్ కన్నా ఏది ముఖ్యం కాదు అవసరమైతే ఒంటరిగా ఉండండి. కానీ విషంతో మాత్రం ఉండకండి. మీ లైఫ్ అనే బస్ కి డ్రైవర్ మీరు. ఎవరిని ఎక్కించుకోవాలో ఎవరిని మధ్యలోనే దించేయాలో మీరే డిసైడ్ చేయాలి.
(11:32) ఈ కథ మీకు కనెక్ట్ అయిందా? అర్జున్ ప్లేస్ లో మిమ్మల్ని మీరు చూసుకున్నారా? అయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో ఐ చూస్ పీస్ నేను ప్రశాంతతను ఎంచుకుంటున్నాను అని టైప్ చేయండి. అది మీలో ఒక కొత్త నిర్ణయానికి నాంది అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఇలాంటి టాక్సిక్ రిలేషన్ లో గాని ఫ్రెండ్షిప్ లో గాని నలిగిపోతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి.
(11:54) మీరు వాళ్ళ లైఫ్ ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇలాంటి పవర్ఫుల్ సైకాలజీ మోటివేషన్ లైఫ్ స్కిల్స్ కోసం మర్చిపోకుండా మిస్టర్ ఏకే ప్రైమ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కలుద్దాం మరో అద్భుతమైన టాపిక్ తో అంతవరకు బీ హ్యాపీ బి స్ట్రాంగ్ స్టే అవే ఫ్రమ్ టాక్సన్స్ సైనింగ్ ఆఫ్ మీ మిస్టర్ ఏకే ప్రైమ జై హింద్
No comments:
Post a Comment