Tuesday, March 31, 2020

శ్రీరామనవమి ఏప్రియల్ 2నా రాముడి పుట్టినరోజు, సీతా రామల పెళ్లిరోజు


శ్రీరామనవమి ఏప్రియల్ 2నా
రాముడి పుట్టినరోజు, సీతా రామల పెళ్లిరోజు

చైత్ర నవమి,
శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.

ఉత్సవం
ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు {క్రీ.పూ} శాలివాహన శకం 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఉత్సవంలో విశేషాలు
ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు కాని ఈ సంవత్సరమునా కరోనా వైరస్ సంధర్భముగా భక్త జనకోటికి స్వామివారి కళ్యాణం చూసే భాగ్యము కోల్పోయాము కాని చింతిచంకండి కళ్యాణము అనేది ఆన్లైన్ లో చూడచ్చు,కావున ప్రతి ఒకరుకుడా సహకరిచండి.
బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.
ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.
ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు(పసుపు పచ్చని వస్ర్తాలువారు) లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు
దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు.రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది.
భద్రాచలంలో రామదాసు చే కట్టబడిన రామాలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రివర్యులు తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వారే ముత్యాలను తీసుకుని వస్తాడు.
ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది.
రామ రాజ్యం
దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది అలాంటది ఈ శార్వరినామ సంవత్సరములో ఏప్రిల్ 2నా వచ్చింది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు,నినాదాలతో యాత్ర సాగిపోతుంది .

శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు కచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు.

"ర" అక్షరం ప్రాముఖ్యత : చారిత్రికంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు.[ఆధారం చూపాలి]. ముఖ్యంగా రామాయణం, రామ నవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది."రవి" అంటే సూర్యుడు. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని "Amon Ra" లేదా "Ra" అనేవారు. లాటిన్ భాషలో కూడా "Ra" ప్రత్యయం వెలుగును సూచిస్తుంది. (ఉదా: Radiance, Radium). కడప దగ్గర ఉన్న ఒంటిమిట్ట ఆలయము కూడా ప్రాచీనమైనది.

ప్రశస్తం
‘రామ’ యనగా రమించుట అని అర్ధం. కాన మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న ఆ 'శ్రీరాముని’ కనుగొనుచుండవలె.
ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది.

దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి, వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే సరేసరి! శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట! శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు

అది యూరప్ అమెరికా వాళ్ళ అసహాయత!. ఇది మన అనంతమైన అజ్ఞానం!.

👉 అది యూరప్ అమెరికా వాళ్ళ అసహాయత! .🙏
👉 ఇది మన అనంతమైన అజ్ఞానం!.🙏.

1. తాజా ఆహారం అందుబాటులో లేక, వండుకోవదానికి సమయం కేటాయించుకో లేక ఎప్పుడో నెలల క్రితం చేసిన రుబ్బిన పిండిని కేన్ లో వేసుకుని నిలవ పెట్టీ పెట్టీ దానితో రోజూ Pan కేకుల్నీ, ఆర్నెల్ల క్రితం చేసిన పిజ్జాలమీద, బంకలు సాగే కూరలు వేసుకుని తినాల్సి ఖర్మపట్టడం అమెరికా యూరప్ వాళ్ళ నిస్సహాయత !
👉 56 భోజన వంటకాలను పక్కనపెట్టి ఎవడో ఏనాడో వండి పెట్టిన రొట్టెని కాలవలో పారెయ్యకుండా, ఫ్రిజ్జిలో మురగబెట్టి పెట్టీ మోడ్రన్ స్టైల్ పేరుతో ఆ పిజ్జాల్ని వేడిచేసి ₹ 400 / - పెట్టి మరీ తినడం, మన అజ్ఞానం.🙏క్షమించాలి ఇదినిజం.🙏 🙏!
.
2. ఎనిమిది నెలలు ఎముకలు కొరికే చలి తట్టుకోలేక, కోట్లూ సూట్లూ వేసుకోవడం వారి నిస్సహాయత!
👉 వేసవి వేడిలో చమటలతో ఉక్కపోసి వళ్ళంతా జిడ్డుజిడ్డుగా అతుక్కుంటూ చిర్రెెత్తిపోతున్నా పెళ్లి రోజుకూడా కోట్లూ సూట్లూ వేసుకుని తిరగడం మన అజ్ఞానం!..🙏క్షమించాలి ఇదినిజం.🙏 🙏!
.
3. తాజా భోజనం వండేవాళ్ళు లేక ఫ్రీజ్ వాడడం, యూరోప్ వాళ్ళ నిస్సహాయత,
👉 రోజూ తాజా కూరగాయలు వస్తున్నా, వారం రోజుల కూరగాయలు ఫ్రీజ్ లో కుక్కి కుక్కి అవి మురుగుతున్నవాటిని వండుకు తినడం, మన అజ్ఞానం!..🙏క్షమించాలి ఇదినిజం.🙏 🙏!
.
4 . ఔషధ మొక్కల జ్ఞానం లేక, మూలికలతో పరిచయం లేక, వారు జీవ జంతువుల మాంసం తో కెమికల్స్ తో ఏవేవో మందులు తయారు చేయడం, వేరేవేరో రోగాల పాలవ్వడం వారి నిస్సహాయత,
👉 మరి ఆయుర్వేదం లాంటి గొప్ప చికిత్సా విధానం తెలిసినప్పటికీ, పట్టించుకోకపోవడం, కెమికల్ మందులు ఉపయోగించడం, సైడ్ ఎఫెక్ట్ లతో కొత్తరోగాలు తెలిసితెలిసి తెచ్చుకోవడం మన అజ్ఞానం..🙏క్షమించాలి ఇదినిజం.🙏 🙏!
.
5. సరిపడ ధాన్యం లేక పంటలు పండక పళ్ళూ కాయలూ దొరకకా పాముల్ని, కప్పల్నీ, కుక్కల్ని నక్కల్ని కూడా చంపి తినడం, వాళ్ళ నిస్సహాయత,
👉 మరి 1600 రకాల ఆహార ధాన్యాలు లభిస్తున్నా వాళ్ళల్లా తినడానికి ప్రయత్నించడం మన అజ్ఞానం ..🙏క్షమించాలి ఇదినిజం.🙏 🙏!
.
6. కొబ్బరి నీళ్ళూ మావిడి పళ్ళు బత్తాయి పళ్ళూ, సపోటా, లస్సీ, అంబలి, చల్ల, మజ్జిగ, పాలు, రసం, షికాంజీ మొదలైనవి లేకపోవడం తెలియకపోవడం శీతల పానీయాలు తాగడం వారి నిస్సహాయత.
👉 అవన్నీ కాక 36 రకాల పానీయాలు అందుబాటులో ఉన్నా, శీతల పానీయాలు అనే విషాన్ని తాగడం ఆధునికంగా అభివృద్ది చెందామని భావించండం
మన అజ్ఞానం *.🙏క్షమించాలి ఇదినిజం.🙏 🙏!
.
7. వాళ్ళ పంపుల్లో నీళ్ళు గడ్డకడుతుంటే టాయిలెట్ కి వెళ్ళిన తరవాత కడుక్కోలేక టిష్యూ పేపర్లతో తుడుచుతిరగడం స్నానం చెయ్యలేక సెంటేసుకుని పడుకోవడం వాళ్ళ నిస్సహాయత.
👉 సుబ్బరంగా మనకు నీళ్ళొస్తున్నా కడుక్కోకుండా
తుడుచుకు తిరగడం మన అజ్ఞానం...🙏క్షమించాలి ఇదినిజం.🙏 🙏!
.
8. ఎలాంటి ముందుచూపూ లేక, మరుగుదొడ్ల నీళ్ళని నదుల్లో కలుపుకోవడం మళ్ళీ వాటినే శుభ్రం చేసుకుని తాగడం వాళ్ళ బుద్దిహీనత.
👉 అన్నీ తెలిసి తెలిసి వాళ్ళని గుడ్డిగా అనుసరించి అదే అభివృద్ది అనుకుని మనం కూడా మన నదుల్ని మురికి కూపాలు చేసుకుని మంచినీటికోసం అలో లక్ష్మణా అని ఏడవడం మన ఆజ్ఞానం.🙏క్షమించాలి ఇదినిజం.🙏 🙏!

9. తోటలూ మొక్కలూ లేక ఎక్కడో ఎవరి దగ్గరో బానిసలా బతికడం కాయలూ పళ్ళూ కొనుక్కు తెచ్చుకోవడం. నా అనే వాళ్ళు లేక, అశాంతిగా ఒంటరిగా జీవించడం వాళ్ళ నిస్సహాయత.
👉 చక్కగా పల్లెల్లో ఫాం హౌసుల్లాంటి ఇళ్ళల్లో పెరట్లో బోలెడన్ని మొక్కలేసుకుని చెట్టున పండిన కాయలూ పళ్ళూ తిన్నన్ని తిని పక్కవాళ్ళకిచ్చి సంతోషంగా జీవించే మనం వారిని అనుకరించడం ఇలా కొట్టుకు చస్తూ ఏడుస్తూ బతకడం మన అజ్ఞానం.🙏క్షమించాలి ఇదినిజం.🙏 🙏!

10. చెట్లు పెంచుకోవడానికి ఏ ఎరువెయ్యాలో తెలియక రసాయనిక మందులేసుకోవడం కడుపులో ఎసిడిటీలు కేన్సర్లూ తెచ్చుకోవడం వాళ్ళ నిస్సహాయత.
👉 ఇంట్లో వుండే ఎద్దులూ ఆవులు కోళ్ళు మేకల మల మూత్రాలను బయో ఫెర్టిలైజర్స్ గా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ గా వాడుకుంటూ హాయిగా ఆరోగ్యంగా బతికిన మనం
ఆ క్రిమిసంహారక మందులే వాడుతూ ఇమ్యూనిటీ నాశనం చేసుకుంటూ ఆ రోగాలే తెచ్చుకోడం మన అజ్ఞానం. 🙏క్షమించాలి ఇదినిజం.🙏 🙏!

11. ఒక్కోసారి ఆరునెలల పాటు సూర్యుడు కనిపించడు కనక వాషింగ్ మెషిన్ లో ఉతికేసిన బట్టలు సూర్యరశ్మిలో ఎండబెట్టే అవకాశం లెక డ్రైయ్యర్లో ఆరబెట్టుకుంటూ వాటికున్న ఎరోబిక్ ఎనరోబిక్ బాక్టీరియాల్లో కొన్ని చావకపోయినా హానికరమైన కెమికల్స్ వేసుకుని బతకడం వాళ్ళ నిస్సహాయత.
👉 హాయిగా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే సూర్యరశ్మి నిండుగా వున్నా వాషింగ్ మెషిన్లో ఉతికిన బట్టల్ని అందులోనే ఆరబెట్టుకోవడం బుద్దిహీనత మన అజ్ఞానం. 🙏క్షమించాలి ఇదినిజం.🙏 🙏!
.
12. గడ్డకట్టేసిన నీటితో స్నానం చెయ్యలేక శానిటైజేషన్ పేరుతో మురికి చేతులపైనే పురుగులమందులు జల్లుకుంటూ
అవే బట్టలతో ఇల్లంతా తిరగడం మంచాల మీద పడుకోవడం మాటిమాటికీ రోగాలు తెచ్చుకోవడం మందులు మింగడం వాళ్ళ నిస్సహాయత.!
హాయిగా నీళ్ళొస్తున్నా స్నానం చెయ్యకుండా స్టైల్ పేరుతో కుక్కకంపు కొట్టే సెంట్లు కొట్టుకుంతూ తిరగడం మన అనంతమైన అజ్ఞానం.

మరోసారి మళ్ళీ క్షమించాలి ఇదినిజం.🙏 🙏!
.
దూరంగా నిలబడి ఆహ్వానించడం, నమస్కరించడం,
చెప్పులు వేసుకుని ఏ ఇంట్లోకి వెళ్ళక పోవడం.
కాళ్ళు చేతులూ కడుక్కోవడానికి బకెట్ తో నీళ్ళివ్వడం
మన సంస్కారం మన పెద్దలు మనకు నేర్పిన అత్యుత్తమ సంస్కారం. దాన్ని వదిలేసి ఇవ్వాళ ఏడవడం మన అజ్ఞానం.!

విపరీతమైన చలితట్టుకోలేక ఇంటాబయటా అవే సాక్స్ అవే బూట్లతిరగడం వాళ్ళ నిస్సహాయత.
ఇంట్లోకి వచ్చేముందు చెప్పులు గుమ్మం బయటే వదిలెయ్యడం, బయట తిరిగిన బట్టల్ని బాత్ రూములొ తడిపేసి స్నానం చేసి ఇంట్లోకి రావడం మన పద్దతి.

మనం ఎంతో ఆత్మీయత గుండెల్లో పొంగితే కానీ చేతులు పట్టుకోలేం, హత్తుకుని కౌగిలించుకోలేం. తల మీదో బుగ్గల మీదో ముద్దులు పెట్టుకోలేం కానీ అవి అమెరికా వాళ్ళకి అత్యంత సహజం
అది కూడా వద్దంటోంది ప్రపంచ ఆరోగ్య మానవాళి అంతా
భారతీయుల్ని చూసి క్వారంటైన్ జ్ఞానం నేర్చుకుంటోంది. నేర్చుకోమంటోంది.
.
🧐🧐🧐 జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అజ్ఞానం అంతా వాళ్ళని చూసి మనకుగా మనం తెచ్చిపెట్టుకున్న అజ్ఞానం
మన బానిస మనస్తత్వ అజ్ఞానం
విదేశీ వ్యామోహ అజ్ఞానం.
కరోనా వైరస్ లను కొంపమీదకు తెచ్చిపెట్టుకునే అజ్ఞానం.
.
అమెరికా యాపిల్ ఫోన్ అంత మంచిఫోన్ మరొకటి లేదు.
అమెరికన్ ప్రజలంత మంచి మనసున్న మనుషులూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అన్నది ఎంత నిజమో,
అమెరికన్ ప్రజలు తినేంత అనారోగ్యకరమైన ఆహారం
అమెరికన్ ప్రజల కున్నన్ని ఆర్టిఫిషల్ అలవాట్లు, కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేవు.
Bottom LIne.
వేటిని స్వీకరించాలో వాటినే స్వీకరిద్దాం.
గుడ్డిగా మోజుతో వెర్రిగా అనుకరిస్తే పోతాం!
ఏం వచ్చి పోతాం? కరోనా వచ్చి పోతాం!. -..🙏..🙏..🙏..🙏..🙏

జీవితం అంటే - నేర్చుకోవడం

ఒక మంచి కాఫీ లాంటి సందేశం

🍥సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు.

🍥ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి.

🍥 సోక్రటీస్‌ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన దిగులు, ఆయన ముఖంలో ఆనందం వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్‌ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్‌ మనసుని తాకింది.

🍥పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటిస్‌ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు.

🍥సోక్రటీస్‌ మెల్లగా కళ్ళు తెరచి జైలర్‌ని పిలిచాడు. జైలర్‌ ఎంతో గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమికావాలన్నాడు. సోక్రటీస్‌ కిటికీలోంచి చూపించి ”మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాణ్ణి తీసుకొస్తారా?” అని అడిగాడు.

🍥జైలర్‌ ”అయ్యో!దాందేముంది?” అని వెళ్ళి ఆ బిచ్చగాణ్ణి తీసుకొచ్చాడు.

🍥సోక్రటీస్‌ ఆ బిచ్చగాణ్ణి తనకాపాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైర్‌ వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాటపాడాడు.

🍥సోక్రటీస్‌ ఆ పాట పాడుతూ లైర్‌ వాద్యం వాయించాడు. ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు.

🍥సోక్రటీస్‌ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాణ్ణి పంపేశాడు. ఆయన శిష్యులు, జైలర్‌ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది కానీ సోక్రటీస్‌ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది.

శిష్యులు

🍥”గురువుగారూ! ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు.

🍥కానీ ఇప్పుడు మీరు లైర్‌ వాద్యంమీద ప్రాక్టీసు చేసి పాట నేర్చుకున్నారు? ఏమిటిది?” అని కన్నీళ్ళ పర్యంతమయ్యారు. సోక్రటీస్‌ నవ్వి ”జీవితమంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు.

🍥 నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినన్నినాళ్ళు ప్రతిక్షణం విలువైందే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది.

🍥గంటక్రితం నాకా పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను.

🍥ఇంకా నాజీవితంలో గంట సమయముంది.
.
🍥అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశముంది” అన్నాడు.
శిష్యుల నోట మాట రాలేదు.

🍥" జీవితం అంటే యేడుస్తూ కూర్చోడం కాదు., జీవితం అంటే - నాకు ఇంతే రాసి పెట్టి వుంది - అనుకుని - నా ఖర్మ ఇంతే - అంటూ నిందించడం కాదు ., జీవితం అంటే - నేర్చుకోవడం.

అసలు ఆత్మ అంటే ఏమిటి? దాని స్వరూపం ఎలా ఉంటుంది?

💐💐అసలు ఆత్మ అంటే ఏమిటి? దాని స్వరూపం ఎలా ఉంటుంది?💐💐💐

ఆత్మ అంటే ఏమిటో చాలా మందికి అసలు తెలియదు.
దాదాపు ఈ భూ ప్రపంచం మీద పుట్టిన వారిలో ఎక్కువ శాతం
మందికి తెలియదు.

దాదాపు చాలా మందికి ఆత్మ అంటే
తెలుసు అంటారు. అది ఏమిటి అంటే కొందరు
దయ్యమని మరికొందరు భూతమని ఇలా దానికి లేని
రూపాలను దానికి లేని తోకలను తగిలిచ్చి నిజమైన
ఆత్మ స్వరూపాన్ని ఆత్మ యొక్క అర్ధాన్ని చివరకు
ఒక వ్యర్ధ పదంగా మారుస్తున్నారు.

ఇది అజ్ఞానపు ఆలోచన
ఎవరో ఒక తెలిసి తెలియక అన్న ఒక అజ్ఞానపు మాటను పట్టుకొని అందరికి అదే దాని అసలు స్వరూపం అని చెప్పడం
సరికాదు. ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆత్మ అనే
పదాన్ని పుట్టిన ప్రతి ఒక్కరు వారి నోటి నుండి
ఉచ్చరించి ఉంటారు.అజ్ఞానులైతే వారు నిర్మానుష్యమైన రాత్రి సమయాలలో మనసులల్లో భయాలు కలిగినప్పుడు అప్పుడు చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఆత్మలై తిరుగుతుంటారు అని భావించుకొనినప్పుడు వారి మనసులో ఈ పదాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు.కాని ఇది అజ్ఞానంతో ఆలోచించడం.

శ్రీకృష్ణుడు ఏం చెప్పారు..?
మరి కొందరు సద్గురువుల దగ్గర బోధన
తీసుకోవడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా
చదివి అర్థం చేసుకోవడం వలన అప్పుడు ఈ ఆత్మ
అనే పదాన్ని వినని మరియు చదవని వారు ఉండరు.
వారికి మాత్రమే ఈ ఆత్మ స్వరూపం గురించి కొద్దిగా
తెలిసి ఉంటుంది.

ఈ విషయాన్ని ఆ శ్రీకృష్ణ
పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు "ఎవరో ఒక
మహా పురషుడు మాత్రమే ఈ ఆత్మను
ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక
మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా
వర్ణించును.వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన
దానినిగా వినును. ఆ విన్నవారిలో చూచినవరిలో
చెప్పినవారిలో కూడా కొందరు దీనిని గూర్చి పూర్తిగా
తెలుసుకోలేరు.

దైవమా? దయ్యమా?
నిజానికి ఆత్మ అంటే దైవమా? లేక
దయ్యమా? ఇది తెలియాలి, మరీ ముఖ్యంగా
అందరూ తెలుసుకోవాలి. అసలు ఈ ఆత్మ అంటే ఏమిటి అన్న విషయాన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ ఆత్మ అనే పదాన్ని ప్రతి మత గ్రంధంలో లిఖించబడింది. ఈ ఆత్మ అన్న పదం లేకుండా ఉన్న మత గ్రంధమే లేదు కాని సరిగా దాని అంతరార్ధాన్ని తెలుసుకోలేక సమతమవుతూ దాని అర్ధాన్ని సరిగా గ్రహింపలేక దానికి నానార్ధాలు చెబుతూ చాలామంది వారు అయోమయం అవడమే కాక అందరిని అయోమయంలో నెట్టేస్తున్నారు.

ఎవరికీ తెలియదు..

ఈ ఆత్మ అంటే నిజానకి ఎవరికీ నిజంగానే తెలియదు. దీనిని వారి హృదయాలలో సాక్షాత్కరించుకున్న వాళ్ళకు మాత్రమే అది ఏమిటో దాని తత్వము ఏమిటో అసలు ఈ సృష్టికి మూల కారణమైన శక్తి ఏమిటో తెలుసు అంతే తప్ప మత గ్రంధాలలోని సూక్ష్మమైన రహస్యాలనుసైతం బోధించే వాల్లకు కూడ అది ఎలా ఉంటుందో తెలియదు.చూసిన వారు చెప్పిన దానిని చూడని వారు కొద్దిగా దానిని అవగతం చేసుకొని తెలుసుకుంటున్నారు.

అలాంటి వారికే ఆత్మ సాక్షాత్కారం

ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో ఈ విధంగా
తెలిపారు గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడంచేతగాని చాల శాస్త్రాల అధ్యయనం చేయడం వలనగాని ఎన్నో గుడార్థాలు మహాత్ముల వద్ద వినడం వలన గాని అత్మప్రాప్తి జరుగదు. ఆ ఆత్మ కోసం
హృదయ పూర్వకంగా ఆరాటపడి మనననిధి ధ్యాసలు చేసే వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అట్టి వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది.

భగవద్గీతలో ఇలా..
ఆత్మ మనోబలం లేనివారికి అజాగ్రత్త పరులకు
శాస్త్ర విరుద్దమైన తపస్సులు చేసేవారికి లభించదు.
అయితే ధృడంగా శ్రద్ధ వుంచి తగిన విధంగా
ప్రయత్నించే వారి ఆత్మ బ్రహ్మ పదంతో ఐక్యం
పొందగలదు.

ఒకసారి ఈ ఆత్మ గురించి మత గ్రంధాలు ఏమి
బోధించాయో కూడ తెలుసుకుందాం.
భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఆత్మ
విషయమై ఈ విధంగా తెలిపినాడు.
ఆత్మ ఇతరులను చంపునని భావించువాడను ఆత్మ
ఇతరులచే చంపబడునని భావించువాడును ఆ
ఇద్దరును అజ్ఞానులే.

నాశనం లేనిది..

ఏలాగంటే వాస్తవముగా ఆత్మ
ఎవ్వరిని చంపదు. ఎవ్వరి చేతను చంపబడేది కాదు.
ఆత్మకు చావు పుట్టుకలు లేవు . ఇది జన్మ లేనిది.
నిత్యమూ, శాశ్వతము, పురాతనము, శరీరము
చంపబదడినను ఇది చావదు. ఈ ఆత్మ నాశరహితము,
నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు
మార్పులేనిదనియు శాశ్వతమైనది
సర్వవ్యాప్తి చెందినది చలింపనిది స్తిరమైనది
మరియు సనాతనమైనది. ఈ ఆత్మ ఇంద్రియములకు
గోచరముగానిది. మనస్సునకు అందనిది. వికారములు
లేనిది. ( 2:19-25)

ఉపనిషతులు: ముండకోపనిషత్తులో ఈ ఆత్మ గురించి ఈ విధంగా వివరించబడినది.

ఆత్మ ప్రకాశం
జ్యోతి స్వరూపమైన ఆత్మ ప్రకాశవంతం అణువు కంటే
సూక్ష్మం అంతటా వ్యాపించినది. అత్యంత
సూక్ష్మమైనది సృష్టికి మూలకారణమైనది.
అపరిమితమైన జ్యోతి స్వరూపం అయిన ఆత్మ
ఊహాతీతమైన బ్రహ్మం ప్రకాశిస్తుంది. అది
సూక్ష్మతి సూక్ష్మం అది ఈ శరీరలోనే ఉన్నది.
అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్రుడు తారలు
(చుక్కలు) వెలుగు నీయవు.

మెరుపులు కూడ కాంతి నీయవు.స్వయం ప్రకాశమైన ఆత్మ తేజస్సు వలన మాత్రమే సర్వము కాంతులను వెదజల్లుతుంది.ఈ ఆత్మ జ్యోతి వల్లనే దేదీప్య మానమవుతూ ఉన్నది.

స్వయం ప్రకాశితం
స్వయం ప్రకాశిత మైన జ్యోతి స్వరూపమైన ఆత్మను
మాటలచేత వర్ణింపలేము దానిని కళ్ళు
చూడలేవు ఇంద్రియాలు గ్రహించలేవు, కర్మలు
విధులు దానిని ఆవిష్కరించలేవు. అవబోధ ప్రశాంతమై స్వచ్చ మైనపుడు అతని ప్రాణ మన శరీరాలు సర్వం విశుద్ది పొందుతాయి. అపుడు ధ్యాన నిమగ్నుడైనవాడు మాత్రమే ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు.

ఆత్మ అంటే ఒక శక్తి .మనం అర్ధం చేసుకోవడానికి
దానినే ఒక జ్యోతిగా తెలిపారు అటువంటి
శక్తిస్వరూపమైన ఆత్మ దైవమే అవుతుంది.
సంపుర్ణమైన ఆ దివ్య శక్తి స్వరూపమైన ఆత్మ
జ్ఞానాన్ని గ్రహించి అది మాత్రమే నువ్వు అని
తెలుసుకొని కాంతి వంతంగా స్వయం ప్రకాశితమైన ఆ
దివ్య జ్యోతిని నువ్వు నీ శరీరంలోనే చూసుకుని,
నిన్ను నువ్వుగా తెలుసుకొని మనం అందరం ఎత్తిన
ఈ మానవ జన్మను సంపూర్ణంగా సార్ధకం
చేసుకుందాం.

బెల్లం తినడం వల్ల కలిగే 18 ప్రయోజనాలు

బెల్లం తినడం వల్ల కలిగే18 ప్రయోజనాలు

1.బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది

2.భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యం గా ఉండవచ్చు.

3.జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది

4 బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి చేసి మెటబొలిజం ని క్రమబద్దీకరణ చేస్తుంది.ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటి తో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుందో వారు ప్రతిరోజూ ఈ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరి చేయాలి.

5.బెల్లం లో వుండే ప్రముఖ ధాతువు ఇనుము. కావున బెల్లాన్ని ఎనీమియా రోగులకు ఇచ్చినచో మంచి ఫలితం ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం అత్యావశ్యకమైనది.

6.చర్మం కోసం, బెల్లం రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్ల ను దూరం చేసి చర్మానికి మంచి మెరుపు నిచ్చి మొటిమలు ని నివారిస్తుంది
.
7.బెల్లం యొక్క గుణం వేడిచేయడం.కావున దీనిని మనం జలుబు ,దగ్గు, రొంప
లాంటివాటికి ఉపశమనం ఇస్తుంది.జలుబు వలన బెల్లం తినలేనట్లయితే చాయ్ లేదా లడ్డు లో కూడా వాటిని కలిపి సేవించవచ్చు.

8.శక్తి కోసం, బాగా నీరసం బలహీనత లక్షణాలు కనిపించగానే,బెల్లం సేవించినట్లయితే మీ ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది. దీని వల్ల షుగర్ లెవెల్ కూడా పెరగదు. రోజంతా పనిచేసిన తర్వాత మీకు అలసట గా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని తినేయండి.

9.బెల్లం శరీర ఉష్ణోగ్రత ని నియంత్రణ లో ఉంచుతుంది. దీని ఆంటి అలెర్జీక్ తత్వం వలన దమ్ము ఆస్తమా రోగులు తీసుకొంటే మంచి ఫలితాలు వుంటాయి.

10.మోకాళ్ళ నొప్పుల కి విశ్రాంతి, బెల్లం ముక్క తో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.

11.బెల్లం తో కలిసి చేసిన పరమాన్నం తింటే గొంతు మరియుమాట హయిగా వస్తాయి.

12.బెల్లాన్ని నల్లనువ్వుల తో పాటు లడ్డు చేసుకోని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు.

13.శీతకాలంలో నంజు బాగా తయారైతే బెల్లాన్ని పాపిడి రూపంలో చేసుకుని సేవించండి.

14.బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకొంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.

15.భోజన ము తర్వాత బెల్లం తీసుకొంటే అసిడిటీ తగ్గిపోతుంది

16.ఐదు గ్రాముల శొంఠి పది గ్రాముల బెల్లం ఉండలు గా చేసి తీసుకొంటే జాండిస్ (పీలియావ్యాధి)పచ్చ కామెర్లు వారికి లాభసాటిగా ఉంటుంది.

17.బెల్లం హాల్వా తీసుకొంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

18.అయిదు గ్రాముల బెల్లం అంతే పరిమాణంలో ని ఆవాల నూనె( మస్తర్డ్ ఆయిల్) తో కలిపి తీసుకొంటే శ్వాస సంభందిత వ్యాధులు నయమవుతాయి.

మంచి మాటలు,మంచి విషయాలు, మన మంచి మిత్రులకు షేర్ చేద్దాం.

🙏🏻 గాయత్రి పరివార్,జగిత్యాల శాఖ

ప్రశ్న : 'భయం ' అన్నది ఎలా పోగొట్టుకోవాలి ?




భయం' గురించి పత్రీజీ వివరణ.

ప్రశ్న : 'భయం ' అన్నది ఎలా పోగొట్టుకోవాలి ?

పత్రీజీ జవాబు ::ఈ ప్రపంచంలో సగం మందికి ''చావు "అంటే భయం --సగం మందికి "బ్రతుకు " అంటే భయం !సగం మందికి "సంసారం " అంటే భయం --సగం మందికి "సన్యాసం "అంటే భయం .
ఇలా భయం అన్నది ప్రతీ ఒక్కరికీ ఉంటుంది .మరి అలాంటి భయాల్లోంచే అనేకానేక సందేహాలు పుట్టుకొస్తూ ఉంటాయి
కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి యుద్ధం పట్ల కలిగిన భయం వలన అనేకానేక సందేహాలు పుట్టుకొచ్చాయి .అస్త్రశస్త్రాలను పడవైచి యుద్దరంగం మద్యలో కూర్చుని --ఒక భిరువులా భయాన్ని నటిస్తూ లొకంలో అందరితరుపునా వకాల్తా పుచ్చుకొని మరీ శ్రీ క్రుష్ట్నుడిని అనేకానేక సందేహాలు అడిగాడు .మరి ఈ లోకానికి భగవద్గీత
అందించ బడానికి కారకుడయ్యాడు .ఇలా ఒక్కోసారి సుజ్ఞానులకు కలిగే భయం వల్ల లొకానికి ఉపకారం కూడా జరుగుతూ ఉంటుంది .
కనుక భయాన్ని తలుచుకొని ఊరికే భయపడుతూ ,భయపడుతూ కూర్చోకుండా -భయరహితులైన వారితో కలసి తిరుగుతూ ఉండండి .మీకు మేలు జరుగుతుంది .
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

"శాంతితో సహజీవనం చేసేందుకు ప్రధానమైన సూత్రాలు ఏమిటి ?"

శ్రీరమణీయం -(481)
🕉🌞🌎🌙🌟🚩

"శాంతితో సహజీవనం చేసేందుకు ప్రధానమైన సూత్రాలు ఏమిటి ?"

మనని పరిపూర్ణమైన శాంతితో ఉంచేందుకు మన పెద్దలు సూచించిన సులభ మార్గాలను మనం అనుసరించాలి. "మనం ఎక్కడున్నా మన మనసులో దైవనామాన్ని స్మరించటం, మనకు ఎదురుగా ఉన్నదాన్ని మనసొంతం చేసుకోవాలన్న ఆశను విడనాడటం, ఈ సృష్టిని నడిపే శక్తి నన్ను కూడా చల్లగా చూస్తుందన్న విశ్వాసంతో ఉండటం, మనంచేసే ప్రతి పనీ పవిత్రంగా ఉండేలా సరి చేసుకోవటం" అనేవి అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక మార్గాలుగా మన పెద్దలు నిర్ధేశించారు. ఇప్పుడు మనకి సమకూరినవన్నీ మనం కోరుకోకుండా వచ్చినవేనన్న సత్యం అర్థమైతే, మనసులో వెలితిపోయి, శాంతితో సహజీవనం చేస్తాం. అదే నిజమైన సన్యాసం !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_'శాంతితో సహజీవనమే సన్యాసం !'-

🕉🌞🌎🌙🌟🚩

మౌన మంత్రం

మౌన మంత్రం
🕉🌞🌎🌙🌟🚩
-{మౌనం’ అంటే మనతో మనం సంభాషించుకోవడం !}-


ప్రపంచం ఇప్పుడు స్వీయ నిర్బంధంలో ఉంది. ఇల్లే ఒక లోకంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో మానసికమైన ఆసరా కోసం వెతకడం సర్వసాధారణం. అలాంటి ఆసరా ఆధ్యాత్మిక చింతన ద్వారా సాధ్యమవుతుంది. దైవం అండగా ఉన్నాడనే భావన ఎనలేని శక్తిని ఇస్తుంది. వ్యతిరేక భావాల్లోకి జారిపోకుండా చేయూతనందిస్తుంది. ఆ చేతిని అందుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకొనే మార్గాలు ఎన్నో ! వాటిలో ఎంతో శక్తిమంతమైనది మౌనం.


మౌనం ఒక శక్తిమంతమైన ఆయుధం. మనలోని వ్యతిరేక భావనలను తొలగించే శక్తి దానికి ఉంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దాన్ని ఆశ్రయిస్తే అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.


మౌనం’ అంటే మనతో మనం సంభాషించుకోవడం ! ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావడానికో, మానసికంగా తగిలిన గాయాలను మాన్పుకోవడానికో మౌనాన్ని మనం ఆశ్రయిస్తూనే ఉంటాం.


మౌనం ఒక శక్తిమంతమైన ఆయుధం. మనలోని వ్యతిరేక భావనలను తొలగించే శక్తి దానికి ఉంది. అంతేకాదు, అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మౌనంలో లభిస్తాయి. అందుకే ఋషులు మౌనాన్ని ఆశ్రయించారు. వారిని ‘మౌని’ లేదా ‘ముని’ అని పిలవడానికీ అదే కారణం. మౌన వ్రతాన్ని దాదాపు అన్ని మతాలూ సూచించాయి. భాద్రపద మాసంలో మౌనవ్రతాన్ని పాటించే సంప్రదాయం ఉంది. ఆ సమయంలో శివ నామస్మరణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం ఉంది.


ఇంటి నుంచి బయటకు వెళితే మనం ఏం చేస్తాం ? స్నేహితులతోనో, పరిచయస్థులతోనో మాట్లాడతాం. అయితే ఇప్పుడు మాటే చేటు తెస్తోంది. అందుకే ఇంటికే పరిమితం కావలసిన ప్రస్తుత కాలంలో మౌనాన్ని సాధన చేద్దాం.


మహాభారత లేఖనంలో...

మౌనం ఎంత గొప్పదో మహాభారత రచనకు సంబంధించిన ఒక కథ మనకు చెబుతుంది.


వ్యాస భగవానుడు చెబుతూ ఉంటే భారతాన్ని వినాయకుడు వ్రాశాడు. రచన పూర్తయిన తరువాత వ్యాసుడు ‘‘వినాయకా! ఆ భగవంతుడే మహాభారతాన్ని సృష్టించాడు. అది నా నోటి నుంచి వచ్చింది. నువ్వు రాశావు. ఇది నా అదృష్టం. కానీ నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించినది నీ మౌనం ! నేను భారతాన్ని చెబుతున్నప్పుడు దాదాపు రెండు లక్షల పదాలు నా నోటి నుంచి వచ్చాయి. ఇదంతా రాసే సమయంలో నువ్వు ఒక్క మాట మాట్లాడగా నేను వినలేదు. ఎందుకని ?’’ అని అడిగాడు.


దానికి గణపతి సమాధానమిస్తూ, ‘‘కొన్ని దీపాలలో నూనె ఎక్కువగా ఉంటుంది. మరి కొన్నిటిలో చాలా కొంచెం ఉంటుంది. అయితే ఏ దీపానికీ నిరంతరంగా నూనె అందడం జరగదు. అలాగే, మానవులకూ, రాక్షసులకూ, ఆఖరికి దేవతలకు కూడా పరిమితమైన జీవిత కాలం ఉంటుంది. ఎవరికైతే స్వీయ నియంత్రణ ఉంటుందో, తమ శక్తులను సహనంతో, అవగాహనతో ఉపయోగించుకుంటారో వాళ్ళే జీవితం నుంచి పూర్తి ప్రయోజనం పొందగలుగుతారు. స్వీయ నియంత్రణకు మొదటి మెట్టు - మాటను నియంత్రించుకోవడం ! మాట మీద నియంత్రణ లేని వాళ్ళు అనవసరంగా ఎంతో శక్తిని కోల్పోతారు. మాటను నియంత్రించుకోవడం ద్వారా అలాంటి నష్టాన్ని నివారించుకోగలరు. అందుకే మౌనానికి ఉన్న శక్తిని నేనెప్పుడూ నమ్ముతాను’’ అని చెప్పాడు !

🕉🌞🌎🌙🌟🚩

Monday, March 30, 2020

సుందరకాండ పారాయణంతో సకల దోషాల... విముక్తి..!!

సుందరకాండ పారాయణంతో సకల దోషాల... విముక్తి..!!

శ్రీరామ జయరామ జయ జయరామ..!!

సుందరకాండ పారాయణ వల్ల సకల దోషాలు
తొలగి పోతాయి.
శని,రాహు,కుజ, కేతు దోషాల వల్ల మనుషులు
ఎన్నో కష్ట నష్టాలకు గురి అవుతూ ఉన్నారు.
అటువంటి బాధల నుంచి విముక్తిపొందేందుకు సుందరకాండ పారాయణను చేయడం అత్యంత శ్రేష్ఠమని సాక్షాత్తు పరమశివుడు పార్వతి దేవితో
ఓ సందర్భంలో అంటాడు.
'ఓ పార్వతీ! సకల దేవతల్లో శ్రీరాముడు ఎంతగొప్పవాడో, ఉన్నతుడో,
వృక్షజాతుల్లో కల్ప వృక్షం ఎంత మంగళకరమైనదో, అంతటి గొప్పది అయిన ఆది కావ్యమైన శ్రీమద్రామాయణంలో అత్యంత కీలకమైనది సుందరకాండ.

సుందరకాండ పారాయణ తులసివనంలో చేస్తే
ఎంతో మేలు జరుగుతుంది.
బిల్వవృక్షం వద్ద చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది.
నదీ తీరాల్లో సుందరకాండ పారాయణ
ఎంతో శుభప్రదం.
ఇంట్లో పారాయణ చేసేవారు శుచి, శుభ్రత లను పాటించాలి.
సుందరకాండ పారాయణం వల్ల మనిషిలో
ఉదాత్త గుణాలు కలుగుతాయి.
ఎవరితోనూ తగవులు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించేందుకు అవసరమైన బుద్ధిని ఆంజనేయుడు ప్రసాదిస్తాడు.
సుగ్రీవుని మంత్రిగా ఆంజనేయుడు రామలక్ష్మణులను చూసిన నాటి నుంచి
శ్రీరామ పట్టాభిషేకం వరకూ వహించిన పాత్ర ఆయనలోని బుద్ధి బలాన్నీ, యశోధైర్యాన్ని సుబోధకం చేస్తుంది.

ఆంజనేయుణ్ణి కేవలం వానరంగా కాకుండా, ఈశ్వరాంశ సంభూతునిగా,
శ్రీరామచంద్రునికి నమ్మిన బంటుగా ఆరాధిస్తే
ఎంతో మేలు జరుగుతుంది.
నవగ్రహ పీడలు తొలగి పోతాయి.
మనిషిలో నిదానం వృద్ధి చెందుతుంది.
ఏ కార్యాన్ని చేపట్టినా ఆలోచనకు
పదును పెట్టగలుగుతారు.
ఆలోచన లేకుండా ఏ పని చేపట్టినా
అది సక్రమమైన రీతిలో పూర్తి కాదు.

అంతేకాక,అహంకార, మమకారాలకు
ప్రభావితం కాకుండా మనిషి సంయమనాన్ని అలవర్చుకోగలుగుతాడు.
ప్రలోభాలకు, బెదిరింపులకు చలించకుండా
తన పనిని సక్రమంగా నిర్వహించుకోగలుగుతాడు. బృహద్ధర్మపురాణంలో సుందరకాండ పారాయణ పాశస్త్యాన్ని గురించి వివరించబడింది.

మనిషికి ఐశ్వర్యం ఎంత ముఖ్యమో,
ఆరోగ్యం అంతకంటే ఎక్కువ.
ఆరోగ్యమే మహాభాగ్యమనే సామెత
అందుకే పుట్టింది.
మనిషిలో నైరాశ్యాన్ని పోగొట్టి,
ధైర్యాన్నీ,ఉత్సాహాన్ని కలిగించేది సుందర కాండ.

కుటుంబ పరమైన క్లేశాల్లో ఉన్నవారు
సుందరకాండ పారాయణ చేస్తే వీలైనంత
త్వరలోనే వాటి నుంచి విముక్తి పొందుతారు. మనిషిలోఏకాగ్రతను పెంచుతుంది.
చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది.

సుందరకాండ పారాయణకు మన పెద్దలు
అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
ఆంజనేయుడు సీతామాత కోసం లంకా నగరంలో అన్వేషించిన సమయంలో అడుగడుగునా ఎదురైన అడ్డంకిలను ఏ విధంగాతొలగించుకుంటూ ముందుకు సాగుతాడో మనిషి కూడా తాను చేపట్టిన పనికి ఎదురైన అవరోధాలను తొలగించుకోవడానికి సుందరకాండ పారాయణ ఎంతో ఉపయోగపడుతుంది.

రాముణ్ణి సేవించి ఆంజనేయుడు తాను తరించి తనను నమ్ముకున్నవారిని తరింపజేస్తున్నాడు.

శ్రీరామదూతం శిరసానమామి అని ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో వారి జోలికి
భూత,ప్రేత పిశాచాలు రావు.
శత్రువులు వారిని ఏమీ చేయలేరు. వాల్మీకి,తులసీదాసు ప్రభృతులు చెప్పిన
పరమ రహస్యం ఇదే..!!

బొట్టు మేధావి తనానికి చిహ్నమా? ఎంత పెద్ద బొట్టు పెట్టుకుంటే అంత మేధావులవుతారా?

బొట్టు మేధావి తనానికి చిహ్నమా? ఎంత పెద్ద బొట్టు పెట్టుకుంటే అంత మేధావులవుతారా?


బొట్టు అనేది స్త్రీకి ఎంత అందమో మనకందరికీ తెలిసింది. కానీ, ఈ మధ్యలో బొట్టు స్థానంలో రకరకాల స్టిక్కర్లు వచ్చాయి.

అలాగే బొట్టు పరిమాణం కూడా రోజు రోజుకూ తగ్గిపోతోంది. దీనివలన కలిగే నష్టాలేంటి కష్టాలేంటి? అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? దాని వలన ప్రయోజనాలేంటి?

బొట్టు పెట్టుకుంటే మేధావులు అయిపోతారా? అంటే అందుకు గల కారణాలను మన శాస్త్రాలు తెలుపుతున్నాయి. బొట్టు వెనుక ఆరోగ్యం, మేధావితనం రెండూ లభిస్తాయా? పరిశీలిద్దాం.

భృగిటిన బొట్టు పెట్టుకోవడం వెనుక ప్రధాన కారణం శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణ చేసుకోవడానికి మాత్రమే. మన సాంప్రదాయాలలో ఇది భాగం అయ్యింది.

బొట్టు శరీరంలో ఉష్ణాన్ని పీల్చీవేస్తుంది. ఎప్పుడైతే శరీర ఉష్ణోగ్రతలు క్రమబద్దీకరించబడతాయో అప్పుడు మనసు, ఆరోగ్యం పదిలంగా ఉంటాయి.

సాయంత్రం రాత్రి సమయాల్లో కుంకుమకు బదులుగా విభూతిని ధరిస్తే చల్లగా ఉంటుంది. విభూతి వల్ల రక్తప్రసరణ చాలా బాగా జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతలు నియంత్రించ బడుతుంది.

ఓజస్సు వృద్ధి చెంది, చర్మరోగాలు రాకుండా రక్షణ కలుగుతుంది. జఠరశ్వాసకోశాలకు తగినంత ఉష్ణాన్ని అందిస్తుంది.
గంధం బొట్టు శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది
మనం సూర్యుని నేరుగా చూడలేము. అందుకే అద్దాలను వినియోగిస్తాం. సూర్యునిలో ఉష్ణోగ్రత కారణంగా ఏర్పడే రంగులను మన కళ్ళు గ్రహించలేవు.

అదే సమయంలో జ్ఞాననాడి ఉంటుంది. భృకుటి వద్ద బొట్టు పెట్టుకోవడం వలన సూర్య కిరణాల నుంచి జ్ఞాననాడికి హానికలుగకుండా ఉంటుంది.

బొట్టు పెట్టుకోకుండానే మేధావులు అయినవారు లేరా? అంటే ఉన్నారు. కాని వారు బొట్టుపెట్టుకుని ఉంటే మరింత మేధావులుగా మారేవారు అనే వాదన ఉంది.

మహిళలు వైదూహ్యం పొందిన తరువాత కూడా వీబూదీ పెట్టుకోవడం వెనుక కారణం. శరీర ఉష్ణోగ్రతలను అదుపులో పెట్టుకోవడానికే.

మగవారు కూడా కొందరు బొట్టు పెట్టుకుంటారు, అలాగే కొందరు వీబూది పెట్టుకుంటారు. అబ్బా… ! అందమైన మహిళలను చూసినప్పుడు కనీసం మనస్సులోనైనా ఎంతందంగా ఉన్నారు అనుకుంటాం.

ఇది ఒక రకంగా అసూయకు దారితీస్తుంది. ఎవరు ఎవరితో మాట్లాడాలాన్నా ముఖంచూసే మాట్లాడగలుగుతారు.

నేరుగా ముఖం చూసే మాట్లాడుతారు కాబట్టి అక్కడ బొట్టు పెట్టుకోవడం వలన ఆ అందంపై కాకుండా నేరుగా దృష్టి బొట్టుపైకి వెళ్ళుతుంది.

బొట్టు ఎర్రగా నిండుగా కళకళలాడుతూ ప్రకాశిస్తూ వుండటం వల్ల ఇతరులు ముఖంలోకి చూడగానే వారిదృష్టిని ముందుగా ఈ బొట్టే ఆకర్షిస్తుంది.

వారెంత ప్రయత్నించినా ముఖంలోని అందమైన ఇతరభాగాల వైపు చూడలేరు. ఇలా దృష్టి దోషం తగ్గుతుంది. బాధ ఏమిటంటే ఆధునీకరణ పెరిగే కొద్ది బొట్టులో మార్పులు వస్తున్నాయి.

రకరకాల స్టిక్కర్లను పెట్టుకొంటూ చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. అందుకే నిర్ధిష్ట పద్దతిలో తయారు చేసిన బొట్టును మాత్రమే వినియోగించాలి.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

నక్షత్రములు వాటి ప్రభావములు

నక్షత్రములు వాటి ప్రభావములు

నక్షత్రాల సంఖ్య 27. ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క రాశిలో రెండున్నర నక్షత్రాలుగా ఉంటాయి. ఈ నక్షత్రాలు జాతకుని స్వభావాలు తెలుపుతాయంటున్నారు జ్యోతిష్యులు.

1 అశ్విని : ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు సంచార స్వభావం కలవారిగా ఉంటారు. చపలత్వం ఈ జాతకుల స్వభావమని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

2 భరణి : ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు స్వార్థ ప్రవృత్తి కలిగినవారిగా ఉంటారు. వీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమౌతుంటారు, కాబట్టి ఎల్లప్పుడు ఇతరులపై ఆధారపడి, ఇతరుల నిర్ణయాలను తమ నిర్ణయాలుగా భావిస్తుంటారు.

3 కృత్తిక : కృత్తిక నక్షత్రంలో పుట్టినవారు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇతరుల వస్తువులు తమవిగా ఆక్రమించుకుంటుంటారు. ముఖ్యంగా వీరు అహంకార స్వభావులై ఉంటారు. ఈ జాతకులకు నిప్పు, వాహనాలు, ఆయుధాలంటే ఎక్కువగా భయపడుతుంటారని జ్యోతిష్యులు చెపుతున్నారు.

4 రోహిణి : రోహిణి నక్షత్రంలో పుట్టినవారు ప్రశాంతవదనంతో, కళాప్రియులుగా ఉంటారు. వీరు మనసులో ఏదీ దాచుకోరు. ఉన్నతమైన భావాలు కలిగిన వారిగా ఉంటారు.

5 మృగశిర : ఈ జాతకులు భోగలాలసులు. వీరికి అమితమైన తెలివి ఉన్నాకూడా తగిన సందర్భంలో తమ తెలివిని ప్రదర్శించరు.

6 ఆరుద్ర : ఆరుద్ర నక్షత్ర జాతకులు కోపోద్రిక్తులుగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అవునా, కాదా అన్నట్టు వీరి నిర్ణయాలుంటాయని, ఎవ్వరినికూడా విరు నమ్మరని జ్యోతిష్యులు అంటున్నారు.

7 పునర్వసు : ఈజాతకులు ఆదర్శవాదులుగాను, ఇతరులకు సహాయ సహకారాలందించేవారిగాను ఉంటారు. ముఖ్యంగా వీరు శాంతచిత్త స్వభావులు. ఆధ్యాత్మికం అంటే వీరికి అమితమైన ఇష్టం.

8 ఆశ్లేష : ఆశ్లేష నక్షత్ర జాతకులు మంకుపట్టు స్వభావులై ఉంటారు. వీరిలో ఆత్మన్యూనతాభావం ఎక్కువగా ఉంటుంది. స్వయంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు.

9 మఖ : ఈ జాతకులు స్వాభిమానిగా ఉంటారు. గొప్ప గొప్ప కోరికలుంటాయి. సహజంగా నేతృత్వం వహించే లక్షణాలుంటాయంటున్నారు జ్యోతిష్యులు.

10 పూర్వాభాద్ర : వీరు కళలపట్ల ఎక్కువ మక్కువ చూపుతుంటారు. రతిక్రీడలంటే అమితమైన ఇష్టం ఈ జాతకులుకు.

11 ఉత్తరాభాద్ర : ఇతరులతో వీరు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కలవారై ఉంటారు ఈ జాతకులు.

12 హస్త : హస్త నక్షత్రం జాతకులు కల్పనా జగత్తులో విహరిస్తుంటారు. వీరు శుఖ వంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. సత్ప్రవర్తన కలిగి ఉంటారు.

13 చిత్త : చిత్త నక్షత్ర జాతకులు చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ కనపరుస్తారు. కొత్త కొత్త ఫ్యాషన్‌లంటే అమితమైన ఇష్టం. ఎదుటివారిని ఆకర్షించే గుణం వీరిలో ఉంటుంది. ప్రధానంగా భిన్న లింగ వ్యక్తులతో ఎక్కువగా మసలుతుంటారు.

14 స్వాతి : ఈ జాతకులు అందరిని సమానంగా చూస్తుంటారు. వీరి మనసును అదుపులో ఉంచుకుంటారు. కష్టాలను ఓర్చుకునే స్వభావులై ఉంటారంటున్నారు జ్యోతిష్యులు.

15 విశాఖ : వీరు స్వార్థపరులుగాను, జగమొండిగా వ్యవహరిస్తారు. తాము అనుకునింది చేయాలని ఈ జాతకులు భావిస్తుంటారు. ఏదో ఒక విధంగా తమదే పై చేయిలా అనిపించుకుంటుంటారు.

16 అనూరాధ : ఈ జాతకులకు తమ కుటుంబమంటే అమితమైన ప్రేమ. వీరికి శృంగారంమంటే చాలా ఇష్టం. మృదుస్వభావి, అలంకార ప్రియులుగాకూడా ఉంటారంటున్నారు జ్యోతిష్యులు.

17 జ్యేష్ఠ : జ్యేష్ఠ నక్షత్ర జాతకుల స్వభావం స్వచ్ఛమైనదిగానూ, ఎల్లప్పుడూ సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతుంటారు. కాని వీరు శత్రువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను వదలరు. దొంగచాటుగా శత్రువులపై దాడికి దిగుతుంటారు.

18 మూల : ఈ జాతకుల ప్రారంభపు జీవితం కష్టతరంగాను, కుటుంబంనుంచి చీదరింపులను ఎదుర్కోక తప్పదు. కళలంటే అమితమైన ఇష్టం. వీరు కళాకారులుగా రాణిస్తారు.

19 పూర్వాషాఢ : పూర్వాషాఢ నక్షత్ర జాతకులు శాంతస్వభావులుగా ఉంటారు.

20 ఉత్తరాషాఢ : ఈ జాతకులు వినయ స్వభావులై ఉంటారు. వీరిలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. అందరినీ కలుపుకుపోయే తత్వం వీరిదని జ్యోతిష్యులు చెపుతున్నారు.

21 శ్రవణం : వీరు సన్మార్గులై, పరోపకారిగాను ఉంటారు.

22 ధనిష్ట : ధనిష్ట నక్షత్ర జాతకుల వ్యవహారం కటువుగా వుంటుంది. కోపం వీరి సొత్తులాగా ఉంటుంది. వీరు నిత్యం అహంకార పూరితులై ఉంటారని జ్యోతిష్యులు అంటున్నారు.

23 శతభిష : ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు రసిక ప్రియులై ఉంటారు. వీరికి రతిక్రీడలంటే ఎక్కువ మక్కువ. వీరు వ్యసనపరులై ఉంటారంటున్నారు జ్యోతిష్యులు. వీరి సమయానుసారం వ్యవహరించరు. ఏదైనా పని చేయాలనుకుంటే వీరికి ఇష్టం వచ్చినప్పుడే చేస్తుంటారు.

24 పుష్యమి : పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు సన్మార్గులై ఉంటారంటున్నారు జ్యోతిష్యులు. వీరు బుద్ధిమంతులుగాను, ఇతరులకు దానం చేసే స్వభావులై ఉంటారు. వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.

25 పూర్వాభాద్ర : ఈ జాతకులు బుద్ధిమంతులై, పరిశోధనాత్మకమైన దృక్పథం కలిగినవారిగా ఉంటారు. వీరు తమకు అందిన పనిని సమయానుసారం సమర్థవంతంగా నిర్వహిస్తుంటారు.

26 ఉత్తరాభాద్ర : ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఇతరులను ఆకర్షించే స్వభావం కలిగినవారై ఉంటారు. వీరి మాటల్లో చతురత కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఇతరులను ప్రభావితం చేసే గుణం వీరిలో ఉంటుంది.

27 రేవతి : రేవతి నక్షత్ర జాతకులు సత్యవాదులై ఉంటారు. ఎల్లప్పుడూ ప్రజల బాగు కొరకు శ్రమిస్తుంటారు. వివేకవంతులుగాను ఉంటారని జ్యోతిష్యులు చెపుతున్నారు.

సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవసేనలను వివాహం చేసుకొనుట

సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవసేనలను వివాహం చేసుకొనుట

లోకసంరక్షనార్ధం తారకాసురున్ని వధించేందుకై దేవతలకోరిక మేరకు లోకనాయకుడు పరమశివుడు అంశతో మార్గశిర శుద్దషష్టి నాడు జన్మించారు సుబ్రహ్మణ్య స్వామి. ఈ మార్గశిర షష్టి ని "సుబ్రహ్మణ్య షష్టి" లేదా "స్కంద షష్టి" గా పిలువబడుతోంది.

సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అందరినీ వధించిన తరువాత షణ్ముఖుడు తిరుచందూర్ ప్రాంతానికి వచ్చి సేదతీరారట . కురువ వంశానికి చెందిన గిరిజనుల నాయకుడు నంబిరాజన్. అతనికి అడవిలో లభించిన వల్లీ దేవిని ఇక్కడే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వివాహం చేసుకున్నారు . కళ్యాణ క్షేత్రంగా ప్రసిద్ధి . ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను కుమారస్వామికి ఇచ్చి వివాహం చేసాడు . తారకాసురునితో జరిగిన యుద్ధంలో కుమారుని ఛాతి భాగంలో లోతైన గాయం అయ్యినదట. స్వామి వారి పెద్ద భార్య దేవసేన తండ్రి దేవతల అధిపతి అయిన దేవేంద్రుడు ఒక గంధపు చెట్టు తాలూకు భాగాన్ని అరగదీయడానికి కావలసిన రాతిని ఇచ్చి గంధం తీసి గాయం మీద రాయమన్నారట. నేటికీ కోవెలలో గంధం తీసే రాయి ఇంద్రుడు ఇచ్చినదిగా పరిగణిస్తారు.
అదే విధంగా మూలవిరాట్టుకు అలంకరించే చందనంలో అద్భుత ఔషధ గుణాలున్నాయని భక్తులు విశ్వసిస్తారు.

అల్లుడికి వివాహ కానుకగా లెక్కలేనన్ని కానుకలతో పాటు ఐరావతాన్ని కూడా ఇచ్చేశాడట దేవేంద్రుడు. ఆయన వైభవానికి కారణమైన తెల్ల ఏనుగు దేవలోకాన్ని వదిలి వెళ్లడంతో ఇంద్రుడు తన సంపదలను కోల్పోవడం ప్రారంభమైనది. మామగారి పరిస్థితి తెలుసుకొన్న షణ్ముఖుడు ఐరావతాన్ని అమరావతి వైపుకు తిరిగి ఉండమన్నారట. స్వర్గాధిపతి పరిస్థితి స్థిరపడింది. ఐరావతాన్ని తన లోకం వైపు చూసేలా చేసి తనకు పూర్వస్థితి దక్కేలా చేశారు అన్న కృతజ్ఞతతో ఇంద్రుడు కలువ పూలతో అర్చించారట. అందుకే ఈ ఉత్సవాల సందర్భంగా ఈ పూలతో అర్చన, అలంకరణ చేస్తారు.

పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు.*

చిరంజీవులు అంటే ఎప్పటికీ చావు లేనివారు అని అర్థం. వీరినే చిరజీవులు అనికుడా అంటారు. పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు.

సప్తచిరంజీవి శ్లోకం:

అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।
కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం |
జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ||

సప్తచిరంజీవులు ఎవరంటే...

1. అశ్వత్థాముడు
2. బలి చక్రవర్తి
3. హనుమంతుడు
4. విభీషణుడు
5. కృపుడు
6. పరశురాముడు
7. వ్యాసుడు

వారు చిరంజీవులు ఎలా అయ్యారు?

శ్రీకృష్ణ పరమాత్మ శాపము వలన అశ్వత్థాముడు, వామనుని అనుగ్రహము వల్ల బలిచక్రవర్తి, లోకహితము కొరకు వ్యాసుడు, శ్రీరాముని యొక్క భక్తితో హనుమంతుడు, రాముని అనుగ్రహము వల్ల విభీషణుడు, విచిత్రమైన జన్మము కలగడం వలన కృపుడు, ఉత్క్రుష్టమైన తపోశక్తి కలగడం చేత పరశురాముడు సప్తచిరంజీవులు అయ్యారు. ఈ ఏడుగురితో పాటుగా, శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుడిని ప్రతినిత్యం స్మరించుకొన్నచో సర్వవ్యాధులనుంచి ఉపశమనం పొంది శతాయుష్యు కలుగునని శాస్త్ర వచనం.

శనివారం రోజున హనుమ ఆరాధన ఫలితం

*శనివారం రోజున హనుమ ఆరాధన ఫలితం* ఆపదలో వున్న తన భక్తులను ఆదుకోవడానికి హనుమంతుడు ఎంత మాత్రం ఆలస్యం చేయడు. అలాంటి హనుమంతుడిని అనునిత్యం పూజించేవారు వుంటారు .. ఆ స్వామికి ప్రదక్షిణలు చేసిన తరువాతనే తమ దైనందిన కార్యక్రమాలను మొదలుపెట్టేవారు వుంటారు. ఇక స్వామివారికి ప్రత్యేకించి పూజాభిషేకాలు చేయించేవారు మాత్రం, హనుమకు ఇష్టమైన మంగళవారం రోజున అవి చేయిస్తుంటారు. తమలపాకులతో పూజలు చేయించి .. ఆ స్వామికి ఇష్టమైన తీపి అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వలన అనారోగ్యాలు .. ఆపదలు .. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక చాలామంది శనివారం రోజున కూడా హనుమంతుడిని పూజిస్తుంటారు .. భక్తి శ్రద్ధలతో సేవిస్తుంటారు. శనివారం రోజున హనుమను పూజించడం వలన, శనిగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శనివారం రోజున హనుమను పూజించేవారి జోలికి రానని ఒకానొక సందర్భంలో శనిదేవుడు .. హనుమకు మాట ఇచ్చాడట. అందువల్లనే శనివారం రోజున హనుమను పూజిస్తే, శని దోష ప్రభావం తగ్గుతూ వెళుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.

కుబేరుడు

కుబేరుడు

సిరి సంపదలకు, నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు, లోకపాలకుడు, ధనదుడు, ధనాధిపతి, యక్షరాజు, రాక్షసాధిపతి, భూతేశుడు, గుహ్యకాధిపతి, కిన్నెరరాజు, మయురాజు, నరరాజు. అథర్వణ వేదం ప్రకారం ఈయన గుహ్యాధిపుడు కూడా! కుబేరుడు అనగా అవలక్షణమయిన (లేదా అవలక్షణాలున్న) శరీరము కలవాడు (బేరము అంటే శరీరము) అని అర్థము. పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా (మరగుజ్జులా), పెద్ద కుండ వంటి పొట్టతో, మూడు కాళ్ళు, ఒకే కన్ను, ఎనిమిది పళ్ళతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది. శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో, మణులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు. ఈయన ముఖము ఎడమవైపుకి వాలినట్టు ఉంటుందనీ, మీసం, గడ్డంకలిగి ఉంటాడనీ, దంతాలు బయటకి వచ్చి (వినాయకుని దంతాల వలె) ఉంటాయనీ ఉంది. అదే విధముగా, శ్రీ శివ, మత్స్య, స్కాంద పురాణాల ప్రకారం, కుబేరుని శరీరం మాత్రం వినాయకుని పోలి ఉంటుందని చెప్పబడింది. కైలాసం వద్దన ఉండే అలకానగరం కుబేరుని నివాస స్థలం.
ఈయన జనన సంబంధిత విషయాలు శ్రీ శివ పురాణంలో సూత మహర్షి శౌనకాది మునులకి చెప్తున్నట్టు వస్తుంది. ఆ ప్రకారంగా, పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు – సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేద, వేదాంగాలు, శాస్త్ర, పురాణాలు అన్నిటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు. వీరి ఏకైక సంతానం గుణనిధి. అతను చెడు సావాసాల వలన జూదమునకు బానిసయ్యి, ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. తల్లయిన సోమిదమ్మకి ఇవన్నీ తెలిసినా గారాబంతో మందలించకపోగా, భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో మౌనం వహించేది. యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్య కలాపాలలో నిమగ్నమై కొడుకుని పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడయినా కొడుకు గురించి భార్యను వాకబు చేస్తే, ఆవిడ పుత్ర ప్రేమతో చదువుకోడానికి గురువు గారి వద్దకు వెళ్ళాడనో, గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్య పెట్టేది. దానితో గుణనిధికి అడ్డు, అదుపు లేక ఇంటిలో నగలన్నీ దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంట పడటం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయటం, అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పటంతో యజ్ఞదత్తుని నోట మాట రాలేదు. ఆ రోజు దాకా కొడుకు ఏమి చేస్తున్నదీ తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ, భార్యా బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్లి, కొడుకు చెడు సావాసాలకు లోనయిన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు. ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోయాడు. తన మిత్రులెవరూ కూడా తనకి తల దాచుకోవటానికి సహకరించలేదు. చెంతనే ఉన్న గౌతమీ నది దాటి ప్రక్క ఊరు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి, తమ శక్తి కొలదీ జాగారాలు చేసి, మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక, ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకుని తిందామని గర్భ గుడిలోనికి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక, తన పైవస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటకి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి, నందీశ్వరుని మీద పడి, తల పగిలి చనిపోతాడు. ఊరి నుండీ పారిపోతూ పవిత్రమయిన గౌతమీ స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసినా శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించటం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. అందుకనే “జన్మానికో శివరాత్రి” అంటారు.

ఇదిలా ఉండగా, పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ధర్మాన్ని గ్రహించాలన్న ఆసక్తితో, మేరు పర్వతానికి అతి చేరువలో ఉండే తృణబిందుని ఆశ్రమానికి వెళ్ళి, అక్కడ తనకనువయిన ఒక చోటు చూసుకుని తపస్సు ప్రారంభించాడు. ఆ ఆశ్రమ పరిసరాలు ఎంతో రమణీయమయిన ప్రకృతి శోభతో విలసిల్లుతూ ఉండేవి. అందుకే దేవతాంగనలు, అప్సరసలు, నాగకన్యలు అక్కడకి వెళ్ళి తమ ఆటపాటలతో కాలం గడిపి వెళ్ళిపోయేవారు. వీటి వలన పులస్త్యునికి తపోభంగం కలిగేది. దానితో ఆగ్రహించిన ఆయన, తన కంట పడిన కన్య గర్భవతి అవుతుందని శపించి తపస్సులో మునిగిపోతాడు. ఈ శాపం గురించి తెలిసినవారెవరూ అక్కడికి వెళ్ళేవారు కాదు. ఒకనాడు ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కుమార్తె అయినటువంటి మానిని అక్కడికి వెళ్ళటం, గర్భం దాల్చటం జరగటంతో తన కుమార్తెను స్వీకరించమని తృణబిందుడు పులస్త్యుని అడుగగా దయతో ఆమెను స్వీకరించి, ఆమె సేవలకి మెచ్చి, తనతో సమానమయిన జ్ఞానం, శక్తి ఉన్న పుత్రుడు పుడతాడని ఆశీర్వదిస్తాడు. అలా పుట్టినవాడే విశ్రవుడు (వేదాధ్యాయమును విన్నవాడు అని అర్థం). విశ్రవుడు (ఇతనిని విశ్రవ బ్రహ్మ అని కూడా పిలుస్తారు) తన తండ్రితో అన్ని విషయాల్లోనూ సమానుడై, నిత్యం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. యుక్త వయస్కుడైన విశ్రవునికి, భరద్వాజ మహర్షి తన కుమార్తె అయిన దేవవర్ణినిచ్చి వివాహం జరిపించారు. వీరిరువురికీ పుట్టినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే (విశ్రవుని కుమారుడు) కుబేరుడు.

కుబేరుడు చిన్నతనం నుండీ శివ భక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా (కుబేరునిగా) పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు, తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్ధాలను సేవించి, తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి, అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమయ్యి, తనని లోకపాలకునిగా, ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అంతర్ధామనవుతాడు. ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా, ఆయన ప్రత్యక్షమయ్యి శంఖనిధి, పద్మనిధి మరియు పుష్పక విమానం ప్రసాదించి, త్రికూట పర్వతం మీద, సముద్ర మధ్యభాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారనీ, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడకి వెళ్ళి ఉండమనీ చెప్పి మాయమవుతాడు.

దక్షిణామూర్తి అవతారం

దక్షిణామూర్తి అవతారం

శివుడు లయ కారకుడు. అంటే సృష్టిని విలీనం చేసుకొని కొత్త సృష్టికి మార్గాన్ని కల్పిస్తాడు. జ్ఞానంపై ఆసక్తి లేనివాళ్లను మళ్లీ జన్మ ఉండేటట్లుగా లయం చేయడం, జ్ఞానం కోరేవాడికి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్లీ జన్మ లేకుండా భగవంతుని స్వరూపంలో కలపడం అనే రెండు రకాలుగా శివుడు లయం చేస్తాడు. శివుని యొక్క జ్ఞానావతారమే దక్షిణామూర్తి.

దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.

బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత మరియు సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.

ఇక ఈ నలుగురూ గురువు కోసం వెదుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మ గారినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నాడు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ మరియు పరమశివుడినీ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ మరియు పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.

పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి, అతని తేజస్సుకు ఆకర్షితులై, ఆయన చుట్టూ కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా యోగ భంగిమ లొనే కూర్చున్నాడు. ఋషులందరికి అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానవంతులయ్యారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందనివారు కాబట్టి అలా బోధించారు.

ఇలాంటి యువకుడైన దక్షిణామూర్తి చుట్టూ వృద్ధులైన మునులు కూర్చుని ఉంటారట. గురువు చేసేది మౌనవ్యాఖ్యానం. మౌనంగా చిన్ముద్రలో కూర్చుని ఉండటమే అతడు చేసే వ్యాఖ్యానం.
దక్షిణామూర్తి పాదాలక్రింద ఉన్నది తమో గుణ రూపానికి ప్రతీక!వాటిని శివుడు తన కాలితో అదిమిపడుతాడు! దక్షిణామూర్తి కాలికింద ఉన్న రాక్షసుడు (తమో గుణం) ఆనందంగా ఉండటం! అజ్ఞానాన్ని అదుపు చేసేవాడే శ్రీ దక్షిణామూర్తి. ఈ తత్వమే ఆదిగురుతత్త్వం. దక్షిణామూర్తి ఆది గురువు, ఆది యోగి అన్న మాట. ఆయన సమస్త జ్ఞానానికి మూలం! ఈ తత్వాన్ని తెలుసుకోవటమంటే – జ్ఞానం, ఎరుక అనే అవగాహన కలిగివుండటమే! పరమశివుని ఈ రూపం సంగీత, సాహిత్యాల , యోగ, తాంత్రిక విద్యల కలయిక. సకల శాస్త్రాల సారాన్ని తెలిసి , అర్హులైన మహర్షులకు ఉపదేశం చేసినవాడే శ్రీ దక్షిణామూర్తి. సద్గురువు లభించని ఉత్తములు ఈయన్ని గురువుగా భావించి, జ్ఞానం, మోక్షాన్ని పొందవచ్చు.

దక్షిణామూర్తి శ్లోకం

గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః

అర్ధం :

సర్వలోకాలకు గురువు, భవరోగులకు ( సంసార బంధాలలో చిక్కుకుపోయిన వాళ్ళకు ) వైద్యుడు, సకల విద్యలకు నెలవు ( నివాసం ) అయిన దక్షిణామూర్తి కి నమస్కారములు.

నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది...? ఎలా ముగిసింది........?!!

నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది...? ఎలా ముగిసింది........?!!

వేదాలను అనుసరించి యుగాలు మొత్తం నాలుగు. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఇలా ఒక్కో యుగానికి ఒక్కో భగవంతుడు ఉండగా జ్యోతిష్య గ్రంథం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కో గ్రహం రాజు, మంత్రి అని చెబుతున్నారు. మరి పురాణాలూ, శాస్రాలు యుగాల గురించి ఎం చెబుతున్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. కృతయుగం:
నాలుగు యుగాలలో మొదటిది కృతయుగం. దీనినే సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగం నందు నారాయణుడు లక్ష్మి సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము పదిహేడు లక్షల ఇరవై ఏడూ వేల సంవత్సరములు. ఈ యుగం లో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ యుగంలో అకాలమరణాలుండవు. ఇక ఈ కృతయుగమునకు రాజుగా సూర్యుడు అంటే రవి మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులయ్యారు. బంగారమునకు అధిపతి గురువు కావున ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారుమయముగా ఉండేది. ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భావ విభేదము విరోధము లేక చక్కగా కాలకు నడిచినది. సూర్య ప్రభావము చేత సుక్షత్రియులు, గురు ప్రభావము చేత సద్బ్రాహ్మనులు జనించి ధర్మ మయిన పాలన నడిచినది.
ఇక సకాలమునకు వర్షం మంచి పంటలు పాడి పశువులు అభివుద్ది చెంది ప్రజలు సుఖమయిన జీవనము గడుపుతూ ధర్మమయిన పాలన సాగుతుంది. సూర్య, గురు వులు వారికి మిత్ర గ్రహములయైన కుజ, చంద్ర, కేతువుల సహాయముతో ధర్మమయిన పాలన చేస్తూ ఉన్నారు. శని, శుక్ర, బుధ, రాహు గ్రహములు కదలక మెదలక కొంత వరకు వాగ్వివాదము కల్పించ ప్రయత్నము చేసిరి.
శని, శుక్ర, బుధ, రాహు గ్రహ కారకముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదమునకు దిగు వానిని చూసి శాపానుగ్రః శక్తి గలిగిన బ్రాహ్మణులు కోపమాపలేక వీడు రాక్షసుడై పుట్టేందుకే ఇటువంటి అన్యాయ ప్రవర్తన ఇటువంటి మాటలు మాట్లాడు తున్నాడు అని అనడము వలన ఆ తపోశక్తి శాప రూపమున త్రేతాయుగములో రాక్షస వంశము అధికమయ్యెను. తపస్సుచే దైవబలమును సంపాదించారు కాని కోపము ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగములో క్రూరులు, రాక్షస స్వభావులు, రాక్షసులు, కలహము పెంచేవారు అధికమయ్యారు. ఈవిధముగా కృతయుగమున సవ్యముగా నడిచి త్రేతాయుగము ఆరంభమయినది.

2. త్రేతాయుగము:
త్రేతాయుగము లో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు. ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగం కాల పరిమాణము పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము మూడు పాదములపై నడుస్తుంది.
ఇక త్రేతాయుగమునకు రాజుగా కుజుడు అంటే మంగళుడు. మంత్రిగా శుక్రుడు నియమితులైయ్యారు. కుజుడు పురుష కారకుడు యువకుడు , యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహు బాల పరాక్రమ వంతుడు, సత్యము పలుకు వాడు రాజుగా ఆచారమునకు కట్టుబడి ఉండక తిరుగువాడు. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు స్త్రీలకు కారకుడు మాయ మంత్ర తంత్రవాది కుజునకు పరమ శత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలము పాలించవలసి వచ్చింది.
రాక్షస గురువు శుక్ర బలమున దుష్ట శక్తి, మాయా మంత్రం ప్రభావము చేత రాక్షసులను పురిగోలిపి యజ్ఞ యాగాది క్రతువులకు, తపస్సంపన్నులకు , రూపవతులయిన స్త్రీలకూ, బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి బాధించేవాడు. రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుకు పడకపోవడం చేత మంత్రులు క్రూర స్వభావులై రాజ్య పాలనను బ్రష్టు పట్టించి స్త్రీ వ్యామోహము వలన కలహము పెంచి ప్రజలను పీడించి రూపవతులు అగు స్త్రీలచే, యువకులకు ప్రాణ హానిని కలిగించేవారు. నాలుగు హంగులలో ప్రథమ మయిన మంత్రము యజ్ఞ యాగాదులు మొదలగు దైవ కార్యములు వాటిని జరిపించు బ్రాహ్మన వంశాములను అంతరించేలా చేసేవారు. ఇలా రాక్షసుల వలన, దుర్మార్గుల వలన మంత్రి సామంతుల వలన త్రేతాయుగములో నాలుగింట ఒక భాగము దెబ్బతిన్నది. కుజ గ్రహ బలము చేత ధనుర్ విద్యా పారంగతులు అయిన రాజ యువకుల చేత రాక్షస సంహారము చేయించుచు, అధర్మపరులను శిక్షిస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ స్త్రీలకూ రక్షణ కల్పిస్తూ ధర్మమును కొంత రక్షించెను. ఈవిధంగా త్రేతాయుగమున ధర్మము నాలిగింట ఒక పాదము తగ్గి ద్వాపరయుగం మొదలవుతుంది.

3. ద్వాపరయుగం:
ద్వాపరయుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఈ యుగం కాల పరిమాణము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది. ద్వాపర యుగమున రాజుగా చంద్రుడు , మంత్రిగా బుధుడు నియమితులయి పాలన చేస్తున్నారు. చంద్రుడు గురు గ్రహ వర్గమునకు చెందినా వాడు బుధుడు శని వర్గమునకు చెందిన వాడు. వీరు ఒకరికి ఒకరు పడనివారు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు, దుష్టులకు ఇచ్చి సాదువుల సజ్జనుల, రూపవతుల, పతివ్రతలకు, కన్యలకు అపకారము చేయు వారిని పురిగొల్పుతాడు.
బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహార్ములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు. దేవతా కార్యములు అర్థ భాగము నశింప చేసి, రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంత వరకు మారుస్తాడు. ఇక ఈ యుగంలో నాలుగు హంగుల ధర్మములో రెండు హంగులు మాత్రమె నిలిచింది.
బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహార్ములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు. దేవతా కార్యములు అర్థ భాగము నశింప చేసి, రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంత వరకు మారుస్తాడు. ఇక ఈ యుగంలో నాలుగు హంగుల ధర్మములో రెండు హంగులు మాత్రమె నిలిచింది.
చంద్రుడు సకల విద్యా పారంగతుడు బలవంతుడు మనో కారకుడు మాతృ కారకుడు కాన రాజుల విధ్యాపారంగుతులను చేసి ధనుర్ విద్య నేర్పించి దుష్టులను ప్రబలకుండా ఈ మాంత్రికులను, వామాచారులను, మాయావులను నాశనము చేయుటకు స్వయముగా భగవానుడే కృష్ణుడిగా అవతరించి దేవతా వర్గమున కొందరిని అంటే ఇంద్రుని అంశలు ధర్మ రాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు తోడుచేసుకొని ద్వాపరయుగ అంతమున మంత్రయుగమును మటు మాయం చేస్తాడు. ఈ విధంగా ద్వాపర యుగమున ధర్మము రెండు భాగాలు నశించి కలియుగము ప్రారంభము అవుతుంది. అంటే మంత్రం యుగము అంతరించి యంత్రయుగము ప్రారంభము అవుతుంది.

4. కలియుగము:
మన ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం. కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరిస్తాడని చెబుతారు. కలియుగం కాల పరిమాణము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు. సూర్య సిద్ధాంత ప్రకారము క్రీ.పూ 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభం అయింది. ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తారు.

ఈ కలియుగమునకు రాజు శని మంత్రులు రాహు కేతువులు. రాహువు కేతువు ఇద్దరికీ ఒకరు అంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు.

కొంత కాలము రాహువు మంత్రిగా కొంత కాలము కేతువు మంత్రిగా పాలన చేయుచున్నారు. నాలుగు ధర్మ శాస్త్రములు అదృశ్యం అవ్వగా అప్పుడు కలియుగము ముందుకు నడిచేను. ధర్మమును నిలబెట్టు శాస్త్రములు ఉన్న తన పని సాగదని కలియుగము నడవదని తలంచి కలియుగ ఆరంభములోనే శాస్త్రములను వారిని రక్షించు బ్రాహ్మణులను, అగ్రహారములను, రాజులను ఒక్కొక్కటిగా నశింపు చేస్తూ వచ్చాయి.

ఇక అప్పటినుండి కూరము, కుచ్చితము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలెత్తాయి. ఈ యుగంలో వావి వరుసలు తప్పి, వర్ణ సంకరములు మొదలై, దొరలే దొంగలయ్యారు. దైవభక్తి తగ్గి, గురుభక్తి, మాతృపితృ భక్తి అపురూపము అయింది. దైవమును నమ్మి పూజించు కాలము పోయి గురువును పూజించు కాలము వచ్చింది. ఇక హింసా సిద్ధాంతము ఎక్కువ అయి, పాపము వలన దుఖము అనుభవిస్తాము అన్న భయమే లేకుండా పోయింది. పుణ్య కార్యములు కరువయ్యాయి. ఎలాగైనా ధనాన్ని, స్త్రీని పొందినవాడే గొప్పవాడని అనుకునే వారు ఎక్కువయ్యారు. దొంగలకు దారి చూపే వారు ఎక్కువయ్యారు. ఇంకా ప్రజలు స్వధర్మమును వీడి అన్య ధర్మములను ఆచరించు కాలమునాకు పోయారు. వర్ణ ద్వేషాలు, మత ద్వేషాలు పెరిగాయి. మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు. అయితే కేతువు మంత్రిగా ఉన్న ఈ కాలములో కొంత మంది ధర్మాత్ములు పుట్టి లోకమునకు మంచి మార్గమును చూపెట్టు పనులు చేస్తున్నారు.

ఈవిధంగా కలియుగం మంచి అనేదానికి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతూ నడుస్తుంది. కలియుగం అంతంలో భగవంతుడు కల్కి గా అవతరించి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమము చేస్తాడని చెబుతారు.

దేనికీ భయపడకండి మీరు అద్భుతాలు సాధించగలరు.


🧘‍♂ ప్రతిక్షణం ఆనందంగా జీవించండి. ఏ క్షణం వృధా చేయవద్దు

దేనికీ భయపడకండి మీరు అద్భుతాలు సాధించగలరు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకూ పనికిరాని వారు అవుతారు. లోకంలోని దుఖాలు అన్నిటికీి మూల కారణం భయమే. నిర్భయత్వం ఒక్క క్షణంలో సైతం ఆనందాన్ని ప్రాప్తింప చేయగలదు

బలాన్ని గురించి స్మరించడం బలహీనతల నుంచి బయట పడే మార్గం. బలహీనులమని బాధపడటం కాదు.

నువ్వేది కాగోరితే అది కాగలవు. బలహీనుడను
అని భావిస్తే బలహీనుడు అవుతావు. బలవంతుడు అని భావిస్తే బలవంతుడు అవుతావు.

మనిషి యొక్క ప్రధాన శత్రువు భయం. భయం వలనే అహంకారం. గుర్తింపు, పోల్చుకోవడం, ఈర్ష్య అసూయ, నిందించడం, బాధ్యతారాహిత్యం కలుగుతున్నాయి

ఆధ్యాత్మికతలో మొట్ట మొదట అన్ని భయాలను జయించాలి. ఏ భయాలు మనల్ని భయ పెట్టకూడదు. భయాలకు భయపడని భయరహిత జీవితం అనుభవించాలి. అదే నిజమైన జీవితం.

నాలోని ఏ భయాలకు నేను ఏ మాత్రం భయపడను. అని సంకల్పం చేసుకుంటూ నీలోని భయాలను ధ్యానంలో వాటిని ధైర్యంగా, స్పష్టంగా నీవు దర్శించి కలిగినప్పుడు, నీలో భయాలన్ని నువ్వు బాగా అర్థం చేసుకున్నప్పుడు, అవి నీ నుంచి వెళ్లిపోతాయి, లేకపోతే అణచబడి ఉంటాయి మళ్లీ మళ్లీ వస్తూ ఉంటాయి.

కాబట్టి మిత్రులారా అందర్నీ ప్రేమిద్దాం. సర్వ జీవుల పట్ల ప్రేమ లేనప్పుడు ఆ స్థానంలో భయం కూర్చుంటుంది

భయానికి మూల కారణం ప్రేమ రాహిత్యం ప్రేమ లేకపోవడం అందర్నీ ప్రేమిద్దాం, అన్ని జీవుల్ని ప్రేమిద్దాం, ఇదే ఆనందాన్ని పొందే గొప్ప మార్గం

సర్వ జీవులు సుఖంగా ఉండాలి
సర్వ జీవులు శాంతితో ఉండాలి
సర్వ జీవులు పరమానందంగా ఉండాలి

🔺 స్వామివివేకానంద 🔺

ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి

ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి
1.అశ్విని
ఓం శ్వేతవర్ణై విద్మహే
సుధాకరాయై ధిమహి
తన్నో అశ్వినేన ప్రచోదయాత్

2.భరణి
ఓం కృష్ణవర్ణై విద్మహే
దండధరాయై ధిమహి
తన్నో భరణి:ప్రచోదయాత్

3.కృత్తికా
ఓం వణ్ణిదేహాయై విద్మహే
మహాతపాయై ధీమహి
తన్నో కృత్తికా ప్రచోదయాత్
4.రోహిణి
ప్రజావిరుధ్ధై చ విద్మహే
విశ్వరూపాయై ధీమహి
తన్నో రోహిణి ప్రచోదయాత్

5.మృగశిరా
ఓం శశిశేఖరాయ విద్మహే
మహారాజాయ ధిమహి
తన్నో మృగశిర:ప్రచోదయాత్

6.ఆర్ద్రా
ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే
పశుం తనాయ ధిమహి
తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్

7.పునర్వసు
ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే
అదితి పుత్రాయ ధిమహి
తన్నో పునర్వసు ప్రచోదయాత్

8.పుష్య
ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే
మహాదిశాయాయ ధిమహి
తన్నో పుష్య:ప్రచోదయాత్

9.ఆశ్లేష
ఓం సర్పరాజాయ విద్మహే
మహారోచకాయ ధిమహి
తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్

10.మఖ
ఓం మహా అనగాయ విద్మహే
పిత్రియాదేవాయ ధిమహి
తన్నో మఖ: ప్రచోదయాత్

11.పుబ్బ
ఓం అరియంనాయ విద్మహే
పశుదేహాయ ధిమహి
తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్

12.ఉత్తరా
మహాబకాయై విద్మహే
మహాశ్రేష్ఠాయై ధీమహి
తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్

13.హస్త
ఓం ప్రయచ్చతాయై విద్మహే
ప్రకృప్రణీతాయై ధీమహి
తన్నో హస్తా ప్రచోదయాత్

14.చిత్తా
ఓం మహాదృష్టాయై విద్మహే
ప్రజారపాయై ధీమహి
తన్నో చైత్రా:ప్రచోదయాత్

15.స్వాతి
ఓం కామసారాయై విద్మహే
మహాని ష్ఠాయై ధీమహి
తన్నో స్వాతి ప్రచోదయాత్

16.విశాఖ
ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే
మహాశ్రేష్ఠాయై చ ధీమహీ
తన్నో విశాఖ ప్రచోదయాత్

17 అనూరాధ
ఓం మిత్రదేయాయై విద్మహే
మహామిత్రాయ ధీమహి
తన్నో అనూరాధా ప్రచోదయాత్

18.జ్యేష్ఠా
ఓం జ్యేష్ఠాయై విద్మహే
మహాజ్యేష్ఠాయై ధీమహి
తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్

19.మూల
ఓం ప్రజాధిపాయై విద్మహే
మహాప్రజాధిపాయై ధీమహి
తన్నో మూలా ప్రచోదయాత్

20.పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై వి
ఓం ప్రజాధిపాయై విద్మహే
మహాప్రజాధిపాయై ధీమహి
తన్నో మూలా ప్రచోదయాత్

20.పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై విద్మహే
మహాబీజితాయై ధిమహి
తన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్

21.ఉత్తరాషాఢ
ఓం విశ్వేదేవాయ విద్మహే
మహాషాఢాయ ధిమహి
తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్

22. శ్రవణ
ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే
పుణ్యశ్లోకాయ ధీమహి
తన్నో శ్రవణ ప్రచోదయాత్

23.ధనిష్ఠా
ఓం అగ్రనాథాయ విద్మహే
వసూప్రితాయ ధీమహి
తన్నో శర్విష్ఠా ప్రచోదయాత్

24.శతభిషం
ఓం భేషజాయ విద్మహే
వరుణదేహాయ ధీమహి
తన్నో శతభిషా ప్రచోదయాత్

25.పూర్వాభాద్ర
ఓం తేజస్కరాయ విద్మహే
అజరక పాదాయ ధీమహి
తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్

26.ఉత్తరాభాద్ర
ఓం అహిరబుధ్నాయ విద్మహే
ప్రతిష్ఠాపనాయ ధీమహి
తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్

27.రేవతి
ఓం విశ్వరూపాయ విద్మహే
పూష్ణ దేహాయ ధీమహి
తన్నో రేవతి ప్రచోదయాత్ .....
ఇప్పుడున్న విష(మ)జ్వరాల ప్రభావం బారిన పడకుండా సకలజనుల శ్రేయస్సు కోరి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు తెలియజేసిన మంత్రతుల్య మార్గాలు. దీనిని ఉపదేశంగా గ్రహించి మనందరం మననం చేసుకుందాం. మనతో పాటుగా విశ్వమంతా బాగుండాలని ప్రార్థిద్దాం.

ప్రశ్న: ప్రాణాయామము అంటే ?

🕉️☀️💥🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️💥☀️🕉️

30-03-2020

☀️ "అమర చైతన్యం" ☀️
( శ్రీ రమణ మహర్షి బోధనలు )

ప్రశ్న: ప్రాణాయామము అంటే ?

జవాబు: ప్రాణము ఆత్మతో సమానము. అదియే జీవశక్తి. మనసు, ప్రాణము ఒకే మూలము నుంచి ఉద్భవించినవి. శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును శ్వాస ద్వారా నియమించుదురు. ఇదే ప్రాణాయామము. అభ్యాసముతో ఈ రకంగా మనసు స్వాధీనం కాబడి చివరకు నశించిపోతుంది. మనసు సద్దు మణిగి ఒక తెలియని శూన్యస్థితి ఏర్పడుతుంది. అది ప్రశాంత స్థితియే అయినప్పటికి అది తాత్కాలికమే. యోగికి ఎప్పుడు ఆ స్థితి కావలసినా, ప్రాణాయామము చేయవలసిందే. యోగి ఆ స్థితి కంటే కూడా ఇంకా సాధన చేసి మనసు మీద నేరుగా అధీనము పెరిగి చివరకు సహజసమాధి స్థితిలోకి రావాలి. తాత్కాలికమైన సమాధి కాదు.

మనసును అధీనములో ఉంచుకోలేని వాళ్ళకు ప్రాణాయామము ఉపయోగపడుతుంది. శ్వాసను గమనించడం ద్వారా కూడా ఇది సాధ్యమే. కేవలం శ్వాస మీద దృష్టి పెడితే మనసు ఇతర విషయాల మీదకు వెళ్ళక మనసు, శ్వాస స్వాధీనంలో ఉంటాయి. ధ్యానంలో కొద్ది సేపటికి మనసు స్థిమితంగా ఉంటుంది. అదిచాలు. శ్వాసను గమనిస్తే శ్వాసను నియత్రించవచ్చు. శ్వాసను గమనించినా, మనసుని గమనించినా, రెండింటిని నియత్రించవచ్చు. గురువు సమీపంలో లేని వారికి శ్వాస మీద ధ్యాస పనికి వస్తుంది. సమర్థుడైన గురువు సమక్షంలో మనసే స్ఠిమితంగా ఉంటుంది.

నేను అన్న ఆలోచన ఎక్కడ పుడుతుందో గమనించు. అక్కడే ప్రాణం (శ్వాస) ఆగుతుంది. ఆలోచన ఆగుతుంది. ప్రాణం, ఆలోచన ఒక్కసారే లేస్తాయి. ఒక్కసారే అణుగుతాయి. ఆలోచనలు ఆగినపుడు ఏ ప్రశాంతత, ఏ ఆనందం అనుభవానికి వస్తుందో అదే ఆత్మ. అది దివ్యమైన వెలుగు. అది శాశ్వతమైనది. అవధులు లేనిది. అదే గమ్యము. అదే భగవంతుడు. సాధనలో నీవు ఏ వెలుగునీ ఊహించుకొనవద్దు. తనంత తానే అనుభవానికి వస్తుంది. ప్రయత్నం చేస్తూంటే అదే గమ్యం చేరుస్తుంది.

"నేను" అదృశ్యమయ్యే కొద్దీ ఆశాంతి తగ్గి, ఉన్న శాంతి వ్యక్తమౌతుంది !!

"నేను" అదృశ్యమయ్యే కొద్దీ ఆశాంతి తగ్గి, ఉన్న శాంతి వ్యక్తమౌతుంది !!

జ్ఞానం అంటే ఉన్నది తెలియడమే. ఉన్నది అంటే కనిపించేదాని వెనుక ఉన్నదేదో తెలియడం. నేను అంటే మనసే. మనసంటే ఆలోచనలే. ఇది అర్ధమైతే ఆలోచనలు తగ్గుతాయి. ఆలోచనలు తగ్గితే నేను తగ్గుతుంది. నేను అదృశ్యమయ్యే కొద్ది ఆశాంతి తగ్గి, ఉన్న శాంతి వ్యక్తమౌతుంది. సుఖం కోసం, సౌఖ్యం కోసం మరో దానిపై ఆధారపడే కొద్దీ నేను పెరుగుతుంది. నేను పెరిగే కొద్దీ అజ్ఞానం పెరుగుతుంది. ఆధునికత పేరుతో మనిషి సాంకేతికపై ఆధారపడటమే ప్రస్తుత అజ్ఞానానికి కారణం. అంటే సాంకేతికత వద్దని కాదు. దాని అతివినియోగం, దుర్వినియోగం వద్దని భావం. ప్రాపంచిక విషయాలపై కాకుండా పరిపూర్ణ విశ్వాసంతో పరమాత్మను నమ్మితే, అహంకారంతో కూడిన నేను పోయి జ్ఞానం అంకురిస్తుంది. నేను అస్తమించడమే జ్ఞానం ఉదయించడం !

🕉 శ్రీ గురుభ్యోనమః

ఆత్మజ్ఞానం భగవంతుడు బహుమతి గా ఇచ్చేదే కానీ, మనం
అడిగి తీసుకునేది కాదు.

జ్ఞానం పొందాలంటే సుఖపడాలనే కాంక్ష పోవాలి. సుఖపడే రోజులు రావడం లేదు అనేది ఒక ఆపేక్ష. నీవు అనుకున్నా అనుకోక పోయినా జరిగేది జరిగి తీరుతుంది.

కలియుగంలో ఎవరిని ఎలా హింసించాలనే ఆలోచనలు ఉంటాయి. మనకు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడనే విశ్వాసం ఉండాలి.

అందరినీ ఆయనే చూసుకుంటు న్నాడు. ఎవరిని హింసించినా భగవంతుని హింసిస్తున్నాము అనే భావన రావాలి.

ఈ దేహం ఎందుకు వచ్చిందో ఆ పనులు పూర్తి అయ్యేవరకు అది ఈ భూమి మీద తిరుగాడుతూనే ఉంటుంది. దేనికీ ఆందోళన వద్దు.


" అమృతవాహిని"

🌷🙏🌷

Sunday, March 29, 2020

చాగంటి కోటేశ్వర రావు గారి గూర్చి చాలామందికి తెలియని కొన్ని సంగతులు -

చాగంటి కోటేశ్వర రావు గారి గూర్చి చాలామందికి తెలియని కొన్ని సంగతులు -


ఇవాళ సినిమా హీరోలలో అగ్రహీరోలకు ఏమాత్రం తీసిపోని పేరుప్రఖ్యాతులు కలిగిన ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు. గత పదిహేనేళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహం. అఖండ ప్రజ్ఞావంతుడు, పండితుడు, వేదమూర్తి చాగంటి వారు. ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో , కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. సునాయాసంగా బయటపడ్డారు.

చాగంటివారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి. ఏ ఛానెల్లో చూసినా చాగంటి వారి ప్రవచనాలు కనిపిస్తుంటాయి. అవి చూస్తే అసలు చాగంటి వారు ఏనాడైనా ఆఫీసుకు వెళ్తారా అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా. కానీ చాగంటివారు ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు. ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు. అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో. ఛానెల్స్ వారు అక్కడికి వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు.

చాగంటి వారికి ఉన్న ప్రతిభాసంపత్తిని సొమ్ము చేసుకోదలచుకుంటే ఈపాటికి ఆయన వందల ఎకరాల భూములు, ఇల్లువాకిళ్ళు, మణిమాణిక్యాలు సంపాదించేవారు. కానీ ప్రవచనాలను ఆయన నయాపైసా పారితోషికం తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు. ఆయనకున్నది కేవలం రెండు పడకగదుల చిన్న ఇల్లు. ఇంతవరకు ఆయనకు కారు లేదు. ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు. ఎఫ్ సి ఐ డైరెక్టర్ క్రైస్తవుడు. చాగంటి వారు ఆఫీసుకు వెళ్ళగానే ఆయనే స్వయంగా వచ్చి బూట్లు విప్పి చాగంటి వారికి నమస్కారం చేస్తారు. సెలవులను ఉపయోగించుకోమని, కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని చెప్పినా చాగంటివారు ఆ సౌకర్యాలను ఎన్నడూ వినియోగించుకోలేదు.

చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు. ఆయనకు ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచి ఆయన విద్యాబుద్ధులు వికసించాయి. వేదాగ్రణి ఆయన రసన మీద తిష్టవేసుకుని కూర్చున్నది. ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.

ఇక ఆయన ఇవాళ చెప్పే ప్రవచనాల వెనుక ఆయనేదో వేదవేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఆపోసన పట్టారని చాలామంది పొరపడతారు. ఆయన కృషి పెద్దగా లేదు. అవన్నీ ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించినవి అంటే మనం ఆశ్చర్యపోవాలి. ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప ఈ జన్మకృషి కాదు. అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు. ఎంతచదివినా ధారణాశక్తి అనేది ప్రధానం. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు. వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం.

ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానె తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు. తనకంటూ ఈరోజు వరకు బ్యాంకు బాలన్స్ లేదంటే నమ్ముతారా?

అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఎన్నడూ పట్టణం దాటి ఎరుగరు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు. ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు.

పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు. "మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను" అన్నారు పీవీ.

చాగంటి వారు నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.

ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం రెండు మూడు ధోవతులు, నాలుగు పంచెలు, నాలుగు జతల ఆఫీస్ బట్టలు!!


చాగంటివారిని చూసి ఆయన ఎన్నో ఏళ్ళనుంచి ప్రవచనాలు ఇస్తున్నారని, లక్షలు సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తుంటారు. ఆయన బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు...... Forwarded as received

మిత్రమా !

ధుర్మార్గులను ఖండించక పోవుట ఏంతటి తప్పో
ఇట్టువంటి మహాత్ములను ప్రశంసించక పోవడం గూడా అంతే తప్పు ఔతుంది
ఒక మహోన్నతమైన వ్యక్తిని కీర్తించడం పదుగురికీ తెలియజేస్తున్న మీ మహోన్నత వ్యక్తిత్వం ప్రశంసనీయం ధన్యవాదములు
🙏🙏🙏

కర్మానుభవం తప్పింపరానిది!

కర్మానుభవం తప్పింపరానిది!

అనగనగా ఒక శివుని దేవాలయం
ఒకరోజు ఆ దేవాలయంలో పూజ చేయాలని అందరు దేవతలూ వస్తుంటారు
మొదటగా యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతుపై వచ్చి వాహనం దిగి గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వి గుడి లోపలికి వెళతాడు
తర్వాత కొంత సమయానికి శ్రీ మహావిష్ణువు తన వాహనం గరుత్మంతుడిపై వచ్చి వాహనం దిగి గుడి లోపలికి వెళతాడు
ఆ విధంగా అందరు దేవతలూ గుడిలోకి వెళతారు
వాహనాలు గుడి బయట ఉంటాయి
అంతలో గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్ట తన పక్షి జాతికి చెందిన గరుత్మంతుడి దగ్గరకు వచ్చి "యమధర్మరాజు అంటేనే మరణానికి సంకేతం, అటువంటి యమధర్మరాజు గుడిలో కి వెళ్లేముందు నన్ను చూసి నవ్వాడు. నాకు భయంగా ఉంది నన్నెలాగైనా కాపాడు" అని గరుత్మంతుడిని వేడుకుంది.
అప్పుడు గరుత్మంతుడు "నేను అన్నిటికన్నా వేగంగా పోగలను, మూడు ఘడియలలోపు నిన్ను ఏడు సముద్రాలకు అవతల వదిలి వస్తాను, అప్పుడు నువ్వు యమధర్మరాజుకు కనిపించవు యముడు నిన్నేమీ చేయలేడు" అని చెప్పి ఆ చిన్న పిట్టను వేగంగా తీసుకెళ్ళి ఏడు సముద్రాలకు అవతల ఒక దీవిలో ఒక చెట్టు తొర్రలో వదిలి 'నీకేం కాదులే హాయిగా ఉండు' అని చెప్పి అంతే వేగంగా తిరిగి వచ్చేస్తాడు.
కొంత సేపటికి దేవతలందరూ పూజ ముగించుకుని బయటకు వస్తారు.
అప్పుడు గరుత్మంతుడు యమధర్మరాజుతో " యమధర్మరాజా నువ్వు గుడి లోపలికి వెళ్లే ముందు ఆ చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వావట ఎందుకు" అని అడిగాడు.
అప్పుడు యమధర్మరాజు " ఏం లేదు నాకు బ్రహ్మ దేవుడు రాసిన అందరి తలరాతలూ కనిపిస్తాయి, ఆ చిన్న పిట్ట తలరాత చూసి నవ్వొచ్చింది" అని అన్నాడు.
ఆ పిట్ట తలరాతలో ఏం రాసి ఉంది అని గరుత్మంతుడు అడిగాడు
"ఆ చిన్న పిట్ట మూడు ఘడియలలో ఏడు సముద్రాలకు అవతల ఉన్న ఒక చెట్టు తొర్రలో ఉన్న ఒక పాముకు ఆహారం కాబోతోంది అని రాసి ఉంది, ఆ చిన్న పిట్ట మూడు ఘడియలలోపు ఏడు సముద్రాలు దాటి వెళ్లలేదు, ఆ పాము కూడా ఏడు సముద్రాలు దాటి ఇక్కడికి రాలేదు కానీ బ్రహ్మరాత మాత్రం జరిగి తీరుతుంది. ఎలా జరుగుతుందో అని తలుచుకొని నవ్వొచ్చింది" అన్నాడు యమధర్మరాజు
తానొకటి తలచిన దైవమొకటి తలచు
ప్రపంచంలో అన్ని దేశాలనూ ఆడించగల అమెరికా అన్నీ మూసుకుని(సరిహద్దులు) ఉండాల్సి వస్తుందని ఏనాడైనా ఊహించి ఉంటుందా
వేల కాంతి సంవత్సరాల దూరంలో ఏం జరుగుతున్నదో
బిలియన్ల సంవత్సరాల ముందు ఏం జరిగిందో చెప్పగలిగిన టెక్నాలజీ ఉన్న మానవజాతి ఒక చిన్న కంటికి కనిపించని పురుగును చూసి ఇంత భయపడాల్సి వస్తుందని ఊహించి ఉంటుందా?

మాయ మాయ పోరి మాయారే సాంగ్ లిరిక్స్ (Maya Chowrasta Song Lyrics in Telugu) తెలుగులో



మాయ మాయ పోరి మాయారే సాంగ్ లిరిక్స్ (Maya Chowrasta Song Lyrics in Telugu) తెలుగులో
గానం: రామ్ మిర్యాలా, యశ్వంత్ నాగ్, బాల
దర్శకుడు: కృష్ణ తేజ
ఆడియో: చౌరాస్తా మ్యూజిక్

మాయ మాయ పోరి మాయారే…
ఓహొ మాయ మాయ… పోరిల స్టోరి మాయరే…

ఓహొ మాయ మాయ పోరి మాయరే…
ఓహొ మాయ మాయ… పోరిల స్టోరి మాయరే…

స్మైలు మాయ, హొయలు మాయ..
స్వీటుగా ఆడే మాటలు మాయ…
షేపులు మాయ.. చూపులు మాయ..
చూపులు గుచ్చే మత్తు సూదులు మాయ…

గివ్వన్ని చూసి బిస్కట్ తిన్నావా.. తమ్ముడు !!!
నీ జిందగీ మొత్తం మాయ మాయ మాయ

మాయ మాయ పోరి మాయరే..
ఓహొ మాయ మాయ.. పోరిల స్టోరి మాయరే…
ఓహొ మాయ మాయ మాయ మాయ మాయ మాయ మాయ మాయ……

కాఫీ షాపుల్లో డేటింగ్ మాయ
వాట్సాప్ చాటింగులో ముద్దులు మాయ
ఇచ్చి ఇవ్వనట్టి హగ్గులు మాయా
ఇవన్నీ ఇవ్వాళ రేపు కామన్ రా అయ్య

ఇదంతా ప్రేమ అనుకొని ఫిక్స్ అయినవో
బోల్తా పడ్తావ్ రోయ్ బుల్ బుల్ మియా
చెప్పినా ఇనకుండా ఉరికినావో
నీ కోసం ఫుల్ బాటిల్ వైటింగ్ రా బావా

స్వాతి మాయ శ్వేత మాయ…
జ్యోతి మాయ ప్రీతి మాయ..
బ్యూటి మాయ స్వీటి మాయ…
ఆఖరికి విజ్జు కూడా మాయ..

మాయ మాయ పోరి మాయారే…
ఓహొ మాయ మాయ.. పోరిల స్టోరి మాయారే….

దీనమ్మ ప్రేమ ఏందిరా బయ్ గిట్ల సంపుతున్నాది
పోరి పీకినాక హ్యాంగోవర్ టార్చర్ ఉన్నాది
మూడు అంటే మూడు రోజులకే స్టోరి ఎండ్ కొచ్చింది
ఇంకేంటి మ్యాటర్ కాస్త సాయంత్రానికి క్వార్టర్ అయ్యింది

మాయ మాయ మాయ ఓహో మాయ మాయరే..
మల్లేశా!! పడకు పడకు ప్రేమలో పడకు పడితే పోతవ్ రో…
శీనయ్య!! అమ్మాయి మాటలు విన్నావంటే ఇదయ్ పోతావ్ రో…
బంగారం, బుజ్జి, కన్నా, మున్నా అంటూ అల్లుకు పోతారు…
బొంగరంలా తిప్పేసుకొని నేలకేసి కొట్టేసి పోతారు..
మాయ మాయ మాయ ఓహో మాయ మాయారే..

మాయ మాయ పోరి మాయారే…
ఓహొ మాయ మాయ.. పోరిల స్టోరి మాయారే..

ఓహొ మాయ మాయ పోరి స్టోరి మాయారే..
ఓహొ మాయ మాయ.. పోరిల స్టోరి మాయారే…

ఊరికే పుట్టలేదు మన తెలుగు సామెతలు

ఊరికే పుట్టలేదు మన తెలుగు సామెతలు :---

1. వినాశకాలే విపరీతబుద్ది అన్నట్లు
చైనా చేసిన పాడుపనికి కరోనా పుట్టింది !
2. తను తీసుకున్న గోతిలో తానే పడింది !
3. అందుకే అంటారు. చెడపకురా చెడేవు అని !
4. ఆవలింతకు అన్న ఉన్నాడు గానీ,
తుమ్ముకు తమ్ముడు లేడనుకుంది ఇటలీ !
చైనా వాళ్ళతో హగ్గులు, పెగ్గులూ పంచుకుంది !
5. మన దీపమని ముద్దాడితే మూతి కాలినట్టు
ఇటలీ కంటుకుంది కరోనా !
6.ఇంతింతై, వటుడింతై అన్నట్లు విజృంభించింది కరోనా!
7. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం?
8.తూర్పు తిరిగి దణ్ణం పెట్టమని వదిలేసింది ప్రస్తుతం!
9. ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చినట్లు అన్ని దేశాలకు పాకింది కరోనా!
10.తగువెలా వస్తుందిరా జంగమ దేవరా అంటే
బిచ్చం పెట్టవే బొచ్చు మొహం దానా అన్నట్టు
అమెరికా చైనాను నిందించడం మొదలు పెట్టింది !
11. పైగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఎలా అని
ఆలోచనలో పడింది!
12. అ, ఆ లు రావుగానీ, అగ్ర తాంబూలం నాకే అన్నట్లు
వ్యాక్సిన్ కూడా కనిపెట్టానంటోంది అమెరికా !
13. ఈలోగా కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు
విదేశాలనుండి కొందరొచ్చి కరోనా అంటించారు !
14. అగ్నికి, వాయువు తోడైనట్లు A నుండి B కి,
B నుండి C కి అది పాకింది !
15. చాపకింద నీరులా పాకడం మొదలైంది !
దాంతో అదిరి పడ్డాయి ప్రభుత్వాలు !
16. కీడెంచి మేలంచాలనుకుని LOCK DOWN ప్రకటించాయి !
17.వాన రాకడ! ప్రాణం పోకడ ఎవరి కెఱుక మరి !
18. ప్రజలందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లయి పోయారు !
19. బతికుంటే బలుసాకు తినొచ్చని కొందరూ
20. ఊపిరుంటే ఉప్పమ్ము కోవచ్చని కొందరూ
ఇంట్లోనే ఉన్నారు !
21. అన్నీ తెలిసినమ్మ అమాస నాడు ఛస్తే
ఏమీ తెలీనమ్మ ఏకాశి నాడు చచ్చినట్లు
ప్రమాదం అని తెల్సి కూడా కొందరూ
22.దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఇంకొందరూ
బైట తిరుగుతున్నారు!
23.కొరివితో తల గోక్కోకండిరా అని పోలీసోళ్లు
మొదటి రోజు సుద్దులూ, బుద్ధులూ చెప్పారు!
ఐనా వినలేదు !
24.అడ్డాలనాడు బిడ్డలు గానీ, గడ్డాల నాడు కాదు కదా!
25.దండం దశ గుణం భవేత్ అనుకున్నారు పోలీసులు !
26.వడ్డించే వాడు మనోడైతే అన్నట్టు వడ్డించడం మొదలెట్టారు !
27.పట్టి పంగానామాలు పెడితే
గోడ చాటుకెళ్లి చెరిపేసుకున్నట్లు
తిరుగుతునే ఉన్నారు కొందరు !
28.పొర్లించి, పొర్లించి కొట్టినా
మీసాలకు మన్నంట లేదన్నట్టు
తిరుగుతూనే ఉన్నారు ఇంకొందరు !
29. అందుకే అన్నారు కుక్కతోక వంకర అని !
30.ఇకపోతే కూరగాయల ధరలు
అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లు
ఆకాశాన్ని అంటుతున్నాయి !
31. మోసేవాడికి తెల్సు కావడి బరువు అన్నట్లుంది
డాక్టర్లు, పోలీసులు,పారిశుధ్య కార్మికుల పని !
32. అడిగే వాడికి చెప్పేవాడు లోకువన్నట్లు
కరోనా ఎప్పుడు తగ్గుతుంది?
వ్యాక్సిన్ కనిపెట్ట డానికి ఎన్ని రోజులు
పడుతుందని అడుగుతారు జర్నలిస్టులు!
33.అనుభవజ్ఞులందరూ మాకు మాత్రం ఏం తెలుసు
ఐతే ఆదివారం, కాకుంటే సోమవారం అంటున్నారు !
34.కొండల్లే వచ్చిన ఆపద మంచల్లే కరుగు తుందన్నట్లు
దేనికైనా TIME రావాలి కదా !
35 ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు మరి !
36. అందుకే ప్రజలందరూ ప్రభుత్వం చెప్పినట్లుగా
LOCK DOWN పాటించి ఇంట్లోనే సంతోషంగా ఉండండి !
36. సంతోషమే సగం బలం మరి !
37. ఇప్పటికైనా ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తించి
శుచి, శుభ్రత పాటిస్తూ, ఆహారపు అలవాట్లు
ఆచార, వ్యవహారాలు మార్చుకోండి !
38.ఉందిలే మంచి కాలం ముందు ముందునా
అని అందరూ ఎదురు చూడండి !
39. సర్వే జనా! సుఖినోభవంతు !

అంటురోగం కన్నా... అధైర్యమే ప్రమాదకరం!

అంటురోగం కన్నా... అధైర్యమే ప్రమాదకరం!

మానవాళికి అంటువ్యాధుల ముప్పు ఈనాటిది కాదు. మానవుడు ప్రకృతికి విరుద్ధంగా నడుచుకున్నా, జీవరాశులన్నిటితో స్నేహంగా మెలగకపోయినా ఉత్పాతాలు తప్పవు. ఇది గౌతమ బుద్ధుడు ఏనాడో చేసిన హెచ్చరిక!

బుద్ధుడు మగధ రాజధాని రాజగృహలో ఉన్న రోజులవి. ఒకనాడు కొందరు బాటసారులు ఆయన దగ్గరకు వచ్చి- ‘‘భగవాన్‌! వైశాలి రాజ్య పరిస్థితి ఘోరంగా ఉంది. వైశాలి నగరం అంటురోగాలతో అల్లాడుతోంది’’ అని చెప్పారు.

బుద్ధుడు వెంటనే తన వెంట 500 మంది భిక్షువులను తీసుకొని వైశాలికి వెళ్ళాడు. ఆ ప్రాంతం తీవ్ర అనావృష్టితో విలవిలలాడుతోంది. చెరువులు ఎండిపోయాయి. ఆ బురద నీటినే మనుషులూ, పశువులూ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. నీటి కొరతతో, ఆహారం కొరతతో ఎన్నో పశువులు మరణించాయి. దుర్గంధం వ్యాపించింది. ఎంతో పశుసంపద, అటవీ సంపద యజ్ఞాలకు ఆహుతయింది. క్రమేపీ ప్లేగు, కలరా లాంటి అంటు రోగాలు ప్రబలిపోయాయి. వేల మంది మరణించారు.


బౌద్ధ సంఘం వైశాలిలో ప్రవేశించిన రోజున... అనుకోకుండా కుంభవృష్టి కురిసింది. ఎన్నో జంతు కళేబరాలు, మనుషుల శవాలు నీటి వేగంలో పడి కొట్టుకుపోయాయి. ప్రజలెవరూ బయటకు రావడం లేదు. రాజు, రాజ పరివారం కూడా ఇళ్ళకే బందీలైపోయారు. నగరాన్ని శుభ్రం చేసేవారెవరూ లేరు.


బుద్ధుడు వచ్చాడని తెలిసి, కొందరు ధైర్యం చేసి బయటకు వచ్చారు. బుద్ధుడు సరాసరి రాజ మందిరానికి చేరాడు. రాజును ఉద్దేశించి ‘‘రాజా! ఏమిటీ పని! ఎందుకీ భయం! ఇలాంటి సమయంలోనే ధైర్యాన్ని కోల్పోకూడదు. ప్రభుత్వం ఆసరా ఇప్పుడే ప్రజలకు అవసరం. మీరూ, మీ రాజోద్యోగులూ, మంత్రులూ... అందరూ నగరంలోకి వెళ్ళండి. ప్రజలను ఉత్సాహపరచండి. వారిలో ధైర్యం నింపండి. అంటురోగాల కన్నా అధైర్యమే ప్రమాదకరం. భయమే ఎక్కువ కీడు చేస్తుంది. ప్రజలు కోలుకోవడానికి యజ్ఞాలూ, యాగాలూ చేస్తే కుదరదు. వారికి ఈ పరిస్థితుల్లో కావలసిన సపర్యలు చేయాలి. వారికి తగిన ఔషధాలు అందివ్వాలి. ఈ విషయంలో మీరు సంచార ఆటవిక జాతుల నుంచి ఎంతో నేర్చుకోవాలి’’ అని చెప్పాడు.


అనంతరం తన భిక్షు సంఘంతో వీధుల్లోకి వెళ్ళాడు. భిక్షువులు నగరాన్ని మధ్యాహ్నానికల్లా శుభ్రం చేశారు. బౌద్ధ వైద్యుడు జీవకుడు తెచ్చిన ఔషధాలు ప్రజలకు అందాయి. భిక్షువులు వైద్యులుగా మారారు. ప్రజలు ధైర్యం తెచ్చుకున్నారు. ఆ రోజు సాయంత్రం బుద్ధుడు వారికి కొన్ని ప్రబోధాలు చేశాడు. అవే ‘రత్న సూత్ర, మైత్రీ సూత్రాలు’గా బౌద్ధ సాహిత్యంలో నిలిచిపోయాయి.


వైశాలీ ప్రజలైన లిచ్ఛవులను ఉద్దేశించి బుద్ధుడు మాట్లాడుతూ, ‘‘వైశాలీ లిచ్ఛవులారా! ఈ భూమిపై జీవించే ప్రతి జీవీ, నేలలో, నీటిలో, గాలిలో జీవించే ప్రతి జీవీ మంచిగా బతకాలి. మంచి మనసుతో బతకాలి. మీరు నా మాట శ్రద్ధగా వినండి. సర్వజీవుల పట్ల మీరు స్నేహంతో ఉండాలి. ఆశ, అసూయలతో వాటికి ఉనికి లేకుండా చేస్తే ఇలాంటి ఉపద్రవాలే వస్తాయి. సర్వజీవుల సుఖంలోనే మన సుఖం కూడా ఉంది. అంతేకాదు, మనిషి నిరాశలో కూరుకుపోయి లేదంటే సోమరితనంలో పడిపోయి పరులకు బరువు కాకూడదు. అలాగని ఎప్పుడూ అవిశ్రాంతంగా ‘పనులు... పనులు’ అంటూ పరుగులు తీయకూడదు. ఇంద్రియాల పగ్గాలు ఇసుమంత కూడా వదలకూడదు. ఆడంబరాలకు పోకూడదు. ఆలోచించుకొని ముందుచూపుతో బతకాలి. సంతృప్తిగా గడపాలి. లేకుంటే మనిషి అలిసిపోతాడు. అర్భకుడవుతాడు. అప్పుడు ఇలాంటి ఉపద్రవాలను ఎదుర్కోలేడు’’ అంటూ అనేక ఆరోగ్య సూత్రాలనూ, జీవన గతులనూ వివరించాడు. ప్రకృతిని ధ్వంసం చేసినప్పుడు, మానవజాతి దాని కన్నెర్రకు గురికావాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో ప్రకృతిని ఆశ్రయించడమే మార్గం.



సర్వజీవుల సుఖంలోనే మన సుఖం కూడా ఉంది. అంతేకాదు, మనిషి నిరాశలో కూరుకుపోయి లేదంటే సోమరితనంలో పడిపోయి పరులకు బరువు కాకూడదు. అలాగని ఎప్పుడూ అవిశ్రాంతంగా ‘పనులు... పనులు’ అంటూ పరుగులు తీయకూడదు.

- బొర్రా గోవర్ధన్‌

కరోనా అంటే ఏమిటి? ఎలా వృధ్ధి చెందుతుంది? ఎలా నివారించ వచ్చు?

కరోనా అంటే ఏమిటి? ఎలా వృధ్ధి చెందుతుంది? ఎలా నివారించ వచ్చు?
కరోనా అనునది ప్రాణము లేని వొక ప్రోటీన్ పదార్థపు కణము, దీని పైన క్రొవ్వు పదార్థము వొక పొరలా యేర్పడి వొక పౌడరు లా వుంటుంది. ఇతర వాటిలా కాక యీ కణము కొంత బరువు కలిగి వుండటం తో గాలిలో యెగురలేదు. భూమిపై పడిపోతుంది.
ఇది నిర్జీవ కణం. ఒక స్త్రీ అండాశయం లో నిర్జీవ అండం యెలా 14 రోజులు వుండి, వీర్య కణం తో జీవకణం గా మారి, కణ విభజన మొదలవుతుందో, యీ కరోనా నిర్జీవ కణం కూడా 14 రోజులు నిర్జీవ కణం గానే వుండి, యీ మధ్యలో ఎప్పుడైతే మానవుని శరీరం లోని "చీమిడి" తో సంపర్కమవుతుందో మవుతుందో, దానిలో కణ విభజన ఆరంభమవుతుంది. మన ముక్కు లోని చీమిడి లో కల ప్రోటీన్ ధాతువులు దీనికి మూలాధారం. మన కంటి 'కలక' లేక 'పుసిలి' కానీ, ముక్కులోని 'చీమిడి' కానీ, నోటిలోని 'గళ్ళ' కానీ దానికి దొరికితే వెంటనే నిముషాలలో కొన్ని వేల, లక్షల లో కణ విభజన జరిగి శ్వాస కోశాలలో చేరి, వూపిరి తిత్తులలోని రక్తనాళాలను ఆక్రమించి మన శరీరానికి ప్రాణవాయువును నిరోధిస్తుంది. దీని కారణంగా, రోగి ప్రాణవాయువు అందక మరణిస్తాడు. దీని విస్తరణ కు పడిశాన్ని వుధృతం చేసికుంటుంది.
రోగిష్టి తుమ్మినపుడూ, దగ్గినపుడూ, వారి చీమిడి ద్వారా, కఫము ద్వారా, యీ రోగ కణాలు ఎచ్చటంటే అచ్చట పడతాయి. మనం దగ్గరగా వుంటే మనపై పడవచ్చు. లేక అవి తుంపరలుగా వేటిపైనన్నా పడివుంటే, ఆయా పదార్థ లక్షణములను బట్టి వాతావరణం లోని వేడిని స్వీకరించు సామర్థ్యాన్ని బట్టి అవి 4 గంటల నుండీ 24 గంటల వరకూ శక్తివంతమై ఉండగలవు. అంటే వేడికి దీనిపై వున్న క్రొవ్వు పొర కరగి పోయి నిర్వీర్యమై పోతుంది.
ఇప్పటి వరకూ యీ వ్యాధి విజృంభించిన దేశాలన్నీ దరిదాపు శీతల ప్రదేశాలే. వేడి తక్కువ ప్రాంతాలు కావటం తో, దీనిపై గల క్రొవ్వు పొర కరగడానికి హెచ్చు ఆస్కారం లేక పోవడం వొక కారణం.
ఈ మధ్య సమయం లో వాటిని మనం స్పర్శించిన చో అవి మనకు అంటుకొన గలవు. సర్వ సాధారణంగా మనం మన చేతుల తోనే స్పర్శించుతాము కావున మన అరచేతులకు, వ్రేళ్ళకు అంటుకొన గలవు. సర్వ సాధారణంగా మన చేతులతో మన కళ్ళను, ముక్కును, నోటిని స్పర్శించడం సహజం. ఇలా యీ రోగ కణాలు ఎక్కడికైతే చేరకూడదో అచ్చటికి సులభంగా చేరిపోతాయి.
ఒక్కసారి అవి మన కంటి కలకను కానీ, చిమిడిని లేక ముక్కులోని పొక్కులను కానీ, మన నోటిలోని గళ్ళను కానీ చేరాయో, యిక వాటిని నిరోధించటం అసాధ్యం. ఇవి సర్వ సాధారణంగా అందరిలో ఎల్లవేళలా ముఖ్యంగా ముసలి వారిలో వుంటాయి కళ్ళ కలక ను చేరితే వెంటనే అది కంటి నీరుగా వృధ్ధి చెంది, ముక్కు ప్రక్కగా జారి, ముక్కు ద్వారా విజృంభిస్తుంది.
దీనికి ఇంతవరకూ మందు కనుగొన లేకున్నా, దీనికి గల కొన్ని బలహీనతలను ఆసరాగా చేసికొని మనలను మనం రక్షించు కొనవచ్చు.
అదియేలా?

దీనికి రక్షక కవచం దీనిపైనున్న క్రొవ్వు పదార్ధం. ఈ క్రొవ్వు పదార్థాన్ని మనం తొలగించి నట్లయితే దీనిని నిర్వీర్యం చేయవచ్చు.
సాధారణంగా క్రొవ్వు పదార్థం వేడికి కరగి పోతుంది. లేక 'సబ్బు' నురుగుకు కరగి పోతుంది. సర్వ సాధారణంగా మన ఇళ్లలో చేతికి కాని, పాత్రలకు కానీ పట్టిన జిడ్డు (క్రొవ్వు పదార్థం)ను తొలగించడానికి మనం సబ్బు పదార్థాలు వాడుతాం. దీనికి కూడా అంతే.
మన శరీరాన్ని, తల వెంట్రుకలతో సహా సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో, రోజుకు 2-3 పర్యాయాలు బాగా తల స్నానం చేయడం తో మన శరీర భాగాలను అంటుకున్న యీ కరోనా కణము పైగల క్రొవ్వు కరగి పోయి నిర్వీర్యమై పోతుంది. అటు తరువాత బాగా కొబ్బరి నూనెను శరీర భాగాలకు రుద్దుకుంటే, ఒకవేళ మన శరీర భాగాలపై యీ రోగ కణాలు మరలా పడ్డా, అందులో చిక్కుకుని బయటకు రాలేని స్థితి ఏర్పడుతుంది. మరు స్నాన శుభ్రత లో వీటిని నిర్వీర్యం చేయవచ్చు.
వీటి మధ్య లో అనేక పర్యాయాలు మన చేతులను 38 డిగ్రీలు అంతకన్నా హెచ్చు వేడి నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో వొక నిముషం పాటు శుభ్ర పరచుకుంటే, మనం ధరించే వస్త్రాలను, కర్చీఫులను, మాస్కులను పై లాగే శుభ్ర పరచుకుంటే, యీ వ్యాధి కణాలపై వున్న క్రొవ్వును కరిగించి దానిని నిర్వీర్యం చేయవచ్చు.
కానీ యెట్టి పరిస్థితులలో కానీ యీ కణం మన ముఖానికి చేర కూడదు. కంటి కలక తో కానీ, ముక్కు చీమిడి లేక పొక్కులతో కానీ, నోటి గళ్ళ తో కానీ సంపర్క మైతే దానిని అడ్డుకొనటం అసాధ్యం.
ఇదే వైదులు నెత్తి నోరు కొట్టుకొని మనకు చెప్పే సలహాలు, వాటి వెనుక వున్న వుద్దేశాలు.
దీనిని మీవారికందరికి తెలిపి యీ వ్యాధినుండీ జాగ్రత్త పరచండి.