Tuesday, June 9, 2020

అనుభూతి శరీరంతోటి పనిచేస్తే ఇదే ఆఖరి జన్మ అవుతుంది..

🌿మానవ దేహంలోని భౌతిక శరీరం మానసిక శరీరంతో కలిసి ఉంటుంది . అలాగే అనుభూతి శరీరం ఆధ్యాత్మిక శరీరంతో కలిసి ఉంటుంది .కాబట్టి ఒక మనిషి ఆధ్యాత్మిక పరంగా ఎదగాలంటే తప్పకుండా అనుభూతి శరీరాన్ని ఉపయోగించాలి..మానవుడు మానసిక శరీరంతో పనిచేస్తున్నాడు కాబట్టే అతను చాలా సమస్యలలో ఉన్నాడు ఎందుకంటే మానసిక శరీరం బాహ్య సమాచారం పై ఆధారపడి పనిచేస్తుంది, ఒకవేళ అతను అనుభూతి శరీరంతో కనుక పనిచేస్తే, సమాచారం అంతరం నుండి వస్తుంది కాబట్టి ఆనందకరమైన జీవితాన్ని పొందుతాడు...మీరు మానసిక శారీరంతోటి పని చేస్తున్నంత కాలం, అంతరంలో ఉన్న జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆ పని కర్మగా పరిణమిస్తుంది...ఈ విధంగా ఎన్నో కర్మల అనంతరం మీరు కర్మ చక్రంలో బంధీ అవుతారు..తద్వారా జన్మ చక్రం ప్రారంభమవుతుంది అదే మీరు అనుభూతి శరీరంతోటి పనిచేస్తే ఇదే ఆఖరి జన్మ అవుతుంది..అనుభూతి శరీరం తోటి పనిచేయాలంటే మాత్రం ధ్యానమే చేయాలి..
🍃🌿🍃🌿🍃🌿🍃
మీ....పి.సారిక...

No comments:

Post a Comment